చేదు జ్ఞాపకాలు మిగిల్చిన 2021కు గుడ్‌బై చెప్పి.. ఎన్నో ఆశలతో 2022కు వెల్‌కమ్ చెప్పే క్షణాలు వచ్చేస్తున్నాయ్. ఏడాదంతా పడిన కష్టాలను మరిచిపోయేందుకు డిసెంబరు 31 రాత్రంతా.. జనాలు పార్టీల్లో మునిగిపోతారనే సంగతి తెలిసిందే. కొత్త ఏడాదిలోకి వచ్చామనే ఉత్సాహం.. కేవలం జనవరి 1 రోజు మాత్రమే ఉంటుంది. 2వ తేదీ నుంచి మళ్లీ అందరికీ రొటీన్ లైఫ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో.. బోలెడన్ని మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. కాసేపు పాత ఏడాది పెట్టిన బాధలన్నీ మరిచిపోయి.. సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలనుకుంటే... ఈ మీమ్స్ చూసి సరదాగా గడిపేయండి.