రోగ్యంగా ఉండాలంటే సమయానికి తినడం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే అవసరం. టైమ్ కి నిద్రపోకపోవడం వల్ల మధుమేహం, అలసట, ఊబకాయం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక వ్యక్తికి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. అర్థరాత్రి 12 గంటలకు పడుకుని తెల్లారి 10 గంటలకి లేవడం అసలు కరెక్ట్ కాదు. చాలా మందికి మధ్యాహ్నం 2.30-3.00 గంటల మధ్యలో ఎక్కువగా నిద్ర ముంచుకు వస్తుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసా? రాత్రిపూట సరైన టైమ్ కి పడుకోవడం లేదని అర్థం.


సిర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి?


శరీరం ఎప్పుడు నిద్రపోవాలి, మేల్కొవాలి అనే వాటిని సిర్కాడియన్ రిథమ్ సూచిస్తుంది. అందుకే దీన్ని ‘నిద్ర చక్రం’ అని కూడా అంటారు. ఉదయం శరీరం సూర్యరశ్మికి గురైనప్పుడు మేల్కొని ఉండటానికి సహాయపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. సూర్యుడు అస్తమించినప్పుడు విశ్రాంతినిచ్చేలా చేస్తుంది. శరీరంలో విడుదలయ్యే రాశయనాలు అలసిపోయిన అనుభూతిని కలిగిస్తాయి. దీన్ని పోస్ట్ ప్రాండియల్ డిప్ అంటారు. ఈ డిప్ ఎప్పుడు సంభావిస్తుందో పరిశోధకులు పర్యవేక్షిస్తున్నారు. నిద్ర- మెల్కొనే చక్రంలో ఎంత దూరంలో ఉన్నారనే దానికి ఇది సూచిక.


మీకు మధ్యాహ్నం 3 గంటల నుంచి అలసిపోయినట్టుగా అనిపిస్తే రాత్రి 9-10 మధ్య నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఉదయం త్వరగా నిద్రలేవాలి అనుకుంటే 7-8 గంటల మధ్య నిద్రపోవాలి. ప్రతీ రోజు ఇదే క్రమం పాటించాలని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి నిద్ర అలవాట్లు, అవసరాలు భిన్నంగా ఉంటాయి. కానీ నిద్ర టైమ్ మార్చుకుంటే దాని ప్రభావం శరీరం మీద పడుతుంది. ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన నిద్ర కావాలంటే వెలుగులు చిమ్మే కాంతి దీపాలు, ఆల్కహాల్, కెఫీన్ ను నివారించాలి. మెటబాలిక్ డిజార్డర్స్, గుండె జబ్బులు, స్ట్రోక్ ను దూరంగా ఉంచి మెదడు పనితీరు సక్రమంగా ఉండేలా చేయాలనుకుంటే కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.


గుండెకి మేలు


గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి 10 లేదా 11 గంటల మధ్య నిద్రపోవడం మంచిదని కొత్త అధ్యయనం చెప్తోంది. నిద్ర తగ్గిన వారిలో మధుమేహం, ఊబకాయం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. లేదంటే నిద్ర తక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఆ ప్రభావం అంతా శరీరంపై పడుతుంది. అవయవాల పనితీరు కూడా మందగిస్తుంది. పని ఒత్తిడి వల్ల ఎక్కువగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటారు. దీన్ని అధిగమించాలంటే నిద్రని ప్రేరేపించే ఆహార పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. పడుకోవడానికి ఒక గంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగితే హాయిగా నిద్రపోవచ్చు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఐస్‌ ఫేషియల్‌తో మతిమరపు సమస్య పోతుందా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు