James Anderson: సచిన్ రికార్డుపై కన్నేసిన జేమ్స్ అండర్సన్ - త్వరలో బద్దలు కొడతాడా?

సచిన్ టెండూల్కర్ అత్యధిక టెస్టుల రికార్డును జేమ్స్ అండర్సన్ త్వరలో బద్దలు కొట్టగలడు.

Continues below advertisement

Most Test Matches in Career: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. సచిన్ తన కెరీర్‌లో మొత్తం 200 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1989లో టెస్టు అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ 2013లో చివరి టెస్టు ఆడాడు.మొత్తం 24 ఏళ్ల పాటు టెస్టు క్రికెట్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌ దిగ్గజ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ సచిన్‌ టెస్టు రికార్డును బద్దలు కొట్టేందుకు చేరువయ్యాడు.

Continues below advertisement

జేమ్స్ అండర్సన్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 179 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అత్యధిక టెస్టు మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతను ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కంటే కేవలం 21 టెస్టుల వెనుక ఉన్నాడు. అండర్సన్ ఫిట్‌నెస్, అతని ఫామ్‌ను చూస్తుంటే, ఈ ఆటగాడు రాబోయే రెండేళ్లలో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడగలడని సులభంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం అండర్సన్ వయసు 40 ఏళ్లు అయినప్పటికీ అతని ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది. కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడో ఇప్పటికీ అదే స్పీడ్‌తో బౌలింగ్‌ చేస్తున్నాడు. అతని స్వింగ్, రివర్స్ స్వింగ్ ఇప్పటికీ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాయి.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే జేమ్స్ అండర్సన్ ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్. అటువంటి పరిస్థితిలో అతను రాబోయే రెండు, మూడేళ్ల పాటు సులభంగా టెస్టులు ఆడగలడు. ఇది జరిగితే సచిన్ టెండూల్కర్ సాధించిన ఈ భారీ రికార్డును అండర్సన్ బద్దలు కొడతాడు.

2024 డిసెంబర్ వరకు వచ్చే 22 నెలల్లో ఇంగ్లాండ్ జట్టు 22 టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో జేమ్స్ అండర్సన్ క్రమం తప్పకుండా ప్లేయింగ్ 11లో కొనసాగితే వచ్చే ఏడాది చివరికి సచిన్‌ టెండూల్కర్‌ను అధిగమిస్తాడు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు జేమ్స్ అండర్సన్ 179 టెస్టు మ్యాచ్‌ల్లో 685 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక్కడ అతను ఈ ఏడాది జూన్‌లో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌లో రెండో ర్యాంక్‌లో ఉన్న షేన్ వార్న్ (708 వికెట్లు)ను అధిగమించగలడు. రెండు మూడేళ్ల పాటు క్రికెట్ ఆడుతూ ఇదే లయను కొనసాగిస్తే అగ్రస్థానంలో ఉన్న ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు)ను కూడా దాటేయచ్చు.

బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపట్నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇండోర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి 2 టెస్టులు గెలిచిన భారత్ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా సిద్ధమవుతోంది. మరోవైపు మిగతా 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ అనుకుంటోంది.

బలమైన ఆస్ట్రేలియా జట్టును 2 టెస్టుల్లో చిత్తుగా ఓడించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది. కేఎల్ రాహుల్ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ చెప్పుకోదగ్గ ఫాంలోనే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతను అదే జోరును కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. కోహ్లీ, పుజారా, భరత్ లు సమయానుకూలంగా ఆడుతున్నారు. లోయరార్డర్ లో అశ్విన్, జడేజా, అక్షర్ లు జట్టుకు ఉపయోగపడే పరుగులు చేస్తున్నారు. ఈ స్పిన్ త్రయం బౌలింగ్ లోనూ అదరగొడుతోంది. 

Continues below advertisement
Sponsored Links by Taboola