✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Romance Scam Alert : డేటింగ్ యాప్స్​ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రేమ పేరుతో మోసం చేసేస్తారు

Geddam Vijaya Madhuri   |  08 Jul 2025 12:24 PM (IST)

Dating Apps : డేటింగ్ యాప్స్ ఉపయోగించే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త మార్కెట్​లోకి కొత్త స్కామ్ వచ్చిందట. కాస్త అటూ ఇటూ అయితే మీరు కూడా దానిబారిన పడతారు.

డేటింగ్ స్కామ్స్ (Image Source : Freepik)

Romance Scam : ఈ రోజుల్లో చాలామంది అనేక స్కామ్‌లకు గురవుతున్నారు. ఉదాహరణకు - డెబిట్ కార్డ్ స్కామ్, క్రెడిట్ కార్డ్ స్కామ్, డేటింగ్ స్కామ్ మొదలైనవి. అయితే వీటితో పాటు మరో కొత్త స్కామ్ కూడా మార్కెట్​లోకి వచ్చింది. దాని పేరు రొమాన్స్ స్కామ్. ఈ స్కామ్‌లో భాగంగా బాధితులను భావోద్వేగపరంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా నష్టపరుస్తారు. ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఫేక్​ లవ్​ నటించి.. ప్రేమలో పడేస్తారు. ప్రేమ పేరుతో నాటకాలు ఆడి.. ఆర్థికంగా దోచుకుంటారు. అయితే ఈ తరహా స్కామ్​లు ప్రస్తుతం హైదరాబాద్, ఢిల్లీలో పెరుగుతున్నట్లు గుర్తిచారు. ఈ ట్రెండ్​ వల్ల ప్రజలు నిజమైన ప్రేమపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఈ తరహా మోసాలనుంచి ఎలా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

డిజిటల్ యుగంలో.. యువత అంతా ప్రేమను డిజిటల్ యాప్స్​లోనే వెతుక్కుంటున్నారు. దానిలో భాగంగానే.. Tinder, Bumble వంటి పలురకాల డేటింగ్ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ డేటింగ్ యాప్‌ల ద్వారా చాలా స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్‌లలో మొదట ప్రజలను బురిడీ కొట్టించి.. తర్వాత సానుభూతితో వారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అది నిజమో కాదో తెలుసుకోవడం పక్కన పెట్టి.. ఎమోషనల్​ కనెక్షన్ పెంచుకుని చాలామంది ఆ ట్రాప్​లో చిక్కుటుంటున్నారు. అనంతరం వారు ఎమోషనల్​గా, ఫైనాన్షియల్​గా కూడా మోసపోయినట్లు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు చాలా ఎక్కువ అయ్యాని.. అలాంటి స్కామ్​ల నుంచి ఎలా సురక్షితంగా భయటపడాలో చూసేద్దాం. 

గుర్తించుకోవాల్సిన విషయాలు.. 

  • మీరు ఎవరినైనా డేటింగ్ యాప్‌లో కలిసి.. వెంటనే మిమ్మల్ని ప్రేమిస్తున్నాని.. లేదా మీపై క్రష్ ఉందని చెప్తే బ్లష్ అయిపోకండి. వారికి మీరు ఎంతవరకు తెలుసు.. వారు మిమ్మల్ని ఇష్టపడటానికి రీజన్స్ ఏంటో తెలుసుకోండి. ఎందుకంటే ప్రేమ పేరుతో వారు మిమ్మల్ని తమవైపు తెచ్చుకునే యత్నం కావొచ్చు. 

  • డేటింగ్ యాప్‌లో ఉపయోగించిన ఫోటో అసలైనదా కాదా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీన్ని తెలుసుకోవడానికి మీరు Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించవచ్చు. లేదా కలవడానికి ముందు వీడియో కాల్‌లో ఒకసారి మాట్లాడండి.

  • డేటింగ్ యాప్​లో పరిచయమైన వారిని మీరు మొదటిసారి కలవడానికి వెళుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు వెళ్లే ప్రదేశం మీ ఫ్రెండ్స్​కి లేదా మీ ఫ్యామిలీకి చెప్పాలి. అలాగే జనసంచారం కాస్త ఎక్కువగా ఉండే ప్రదేశాలు ఎంచుకుంటే మంచిది. దీనివల్ల మీరు ఎలాంటి మోసాలకు లేదా ముఠాకు చిక్కకుండా ఉంటారు. 

  • ఆన్​లైన్​లో లేదా డేటింగ్ యాప్​లో పరిచయమైన వారికి మీ సమాచారం అంతా ఇచ్చేయవద్దు. ముఖ్యంగా మీ అకౌంట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం, డబ్బులు పంపడం, అడ్రెస్ షేర్ చేయడం వంటివి మానుకుంటే మంచిది. అత్యంత అవసరం అన్నా సరే ఆన్​లైన్​లో పరిచయమైన వారికి డబ్బులు పంపడం మంచిది కాదు. లేదంటే మీరు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. 

మీరు నిజంగానే డేటింగ్ యాప్​ వాడాలనుకుంటే మీరు ఎవరినైతే డేట్ చేయాలనుకుంటున్నారో వారు ఒరిజనలో కాదో తెలుసుకోండి. అలాగే వెంటనే ప్రేమలో పడిపోకండి. సమయం తీసుకోండి. ఎంత లవ్​ ఎట్ ఫస్ట్ సైట్ అయినా కూడా ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నప్పుడు లేదా జీవితాంతం కలిసి ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు కాస్త సమయం తీసుకోవడం మంచిది. 

 

Published at: 08 Jul 2025 12:12 PM (IST)
Tags: Relationships Love Dating dating apps dating tips Romance Scam
  • హోమ్
  • లైఫ్‌స్టైల్‌
  • Romance Scam Alert : డేటింగ్ యాప్స్​ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. ప్రేమ పేరుతో మోసం చేసేస్తారు
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.