Sugar in Nestle Products: బోర్న్‌విటాలో షుగర్ కంటెంట్ (Sugar Content in Bournvita) ఎక్కువగా ఉంటోందని డిబేట్ జరుగుతుండగానే ఇప్పుడు Nestle Baby Products లోనూ చక్కెర శాతం మితిమీరి ఉంటోందన్న వాదన మొదలైంది. యాడెడ్ షుగర్స్ లెవెల్స్ (Sugar in Nestle Products) ఎక్కువగా ఉంటున్నాయని ఓ విచారణలో తేలింది. Nestle కంపెనీ విక్రయిస్తున్న రెండు ఫుడ్ ప్రొడక్ట్స్‌లో చక్కెర ఉందని తేల్చి చెప్పింది. ఇవే ప్రొడక్ట్స్ యూకేలో షుగర్ ఫ్రీగా ఉన్నాయని, అలాంటప్పుడు ఇండియాలో మాత్రం షుగర్ కంటెంట్ ఎందుకు ఉంటోందని Public Eye సంస్థ ప్రశ్నించింది. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే నెస్లే ఉత్పత్తుల్లో చక్కెరతో పాటు తేనె కూడా కలుపుతున్నారని వెల్లడించింది. చిన్నారులకు పెట్టే సెరిలాక్‌లోనూ ఇవి కలుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నిబంధనల్ని పక్కన పెట్టి కొన్ని దేశాల్లో ఇలా విక్రయిస్తున్నారని మండి పడింది. వీటి కారణంగా చిన్నారుల్లో ఊబకాయంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడే ప్రమాదముందని అసహనం వ్యక్తం చేసింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనే ఇలాంటి ఉత్పత్తులు విక్రయిస్తున్నట్టు గుర్తించింది. అయితే...Nestle India Ltd కంపెనీ దీనిపై స్పందించింది. దాదాపు ఐదేళ్లుగా తాము చిన్నారుల కోసం విక్రయిస్తున్న ఆహార ఉత్పత్తుల్లో షుగర్ కంటెంట్‌ని 30% వరకూ తగ్గించామని చెబుతోంది. ఇప్పటికీ తమ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేస్తున్నామని స్పష్టం చేసింది. అవసరమైతే ఫార్ములేషన్‌లో మార్పులు చేస్తామని వెల్లడించింది. పిల్లలకు పోషకాహారం అందించాలన్నదే తమ లక్ష్యం అని తెలిపింది.
ప్రతి చెంచాలో 3 గ్రాముల చక్కెర..
భారత్‌లో దాదాపు 15 Cerelac baby products లో దాదాపు 3 గ్రాముల షుగర్ కంటెంట్ ఉందని ఈ అధ్యయనం గుర్తించింది. ఒక చెంచాడు ప్రొడక్ట్‌లో 3 గ్రాముల చక్కెర ఉంటోందని స్పష్టం చేసింది. అటు జర్మనీ, యూకేలో మాత్రం ఈ షుగర్ కంటెంట్ లేదు. ఇథియోపియా, థాయ్‌లాండ్‌లో మాత్రం ఈ షుగర్ లెవెల్స్ 6 గ్రాముల వరకూ ఉంటోందని గుర్తించింది. అయితే...ఆ ప్రొడక్ట్స్‌పై కంటెంట్స్ టేబుల్‌లోనూ షుగర్ ఎంత యాడ్ చేస్తున్నారన్నది వెల్లడించడం లేదు. విటమిన్స్, మినరల్స్, మిగతా న్యూట్రియెంట్స్ విషయంలో చాలా పారదర్శకంగా ఉండే నెస్లే షుగర్ విషయంలో మాత్రం కొన్ని వివరాలు దాచేస్తుందని రిపోర్ట్ తేల్చి చెప్పింది. 2022లో ఇండియాలో రూ.20 వేల కోట్ల విలువైన ఉత్పత్తులను విక్రయించింది నెస్లే కంపెనీ. ఇది ఇలాగే కొనసాగితే చిన్నారులకు సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది పబ్లిక్ ఐ సంస్థ. పిల్లలకు అందించే ఆహారల్లో చక్కెర వేయకూడదని,ఆ రుచి వాళ్లకి వ్యసనంగా మారిపోతుందని స్పష్టం చేసింది. తీపి పదార్థాలు తినడం ఇక్కడి నుంచే వాళ్లకి అలవాటవుతుందని, వాటిని తినేందుకే ఎక్కువగా ఇష్టపడతారని తెలిపింది. ఫలితంగా వాళ్లలో పోషకాహార లోపం తలెత్తుతుందని వివరించింది. వాళ్లు పెరిగే కొద్దీ ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది. ఒబెసిటీతో పాటు బీపీ, డయాబెటిస్ లాంటివి వచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read: Viral Video: మీకు అవతార్ బిర్యానీ గురించి తెలుసా? భలే ఇంట్రెస్టింగ్ రెసిపీ ఇది - మీరూ ట్రై చేయండి