Navratri and Vijayadashami Differences : నవరాత్రి(Navratri2025), దసరా(Dussehra2025). ఈ రెండు పండుగలు కూడా చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తాయి. అయితే వీటిలో చాలా తేడాలు ఉన్నాయి. అర్థాల నుంచి.. ఉద్దేశ్యాల వరకు ఈ రెండు పండుగల మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి. నవరాత్రులు ఈ ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన మొదలవగా.. దసరా సరిగ్గా పదో రోజు అంటే అక్టోబర్ 2వ తేదీన వస్తుంది. పక్క పక్కనే వచ్చే ఈ పండుగల ప్రాముఖ్యత ఏంటి? వాటి మధ్య వ్యత్యాసం ఏంటి? మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

అర్థాలు.. 

నవరాత్రి అర్థమిదే : నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు (9 nights). ఈ సమయంలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను భక్తి, శ్రద్ధలతో(Durga Puja Navratri) ఆరాధిస్తారు. ఉపవాసం చేస్తారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చెడుపై మంచి గెలుపు కోసం దుర్గాదేవి చేసిన యుద్ధాన్ని నవరాత్రి సూచిస్తుంది. తొమ్మిది రోజుల యుద్ధం తర్వాత మహిషాసురుడిని దుర్గాదేవి ఓడించిందని చెప్తారు. 

దసరా అర్థమిదే : దసరా లేదా విజయదశమి. నవరాత్రులు పూర్తి అయిన తర్వాత 10వ రోజు.. యుద్ధాన్ని గెలిచిన సందర్భాన్ని సూచిస్తూ చేసుకుంటారు. అంతేకాకుండా రావణుడిని శ్రీరాముడు ఓడించిన రోజునే దసరాగా జరుపుకున్నట్లు రామాయణం చెప్తుంది. అందుకే ఈ సమయంలో చాలామంది ఆయుధ పూజలు చేస్తారు. రావణ దహనం(Ravan Dahan festival)తో పాటు శమి పూజలు కూడా చేస్తారు. ఇది కూడా చెడుపై మంచి విజయాన్ని సాధించడాన్నే సూచిస్తుంది. 

Continues below advertisement

నవరాత్రి స్పెషల్స్.. (Navratri Significance)

నవరాత్రి సమయంలో ప్రతి రోజుకి ఓ స్పెషల్ కలర్ (Navratri colours 2025) ఉంటుంది. దీనిని నార్త్ స్టేట్స్​లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. గుజరాత్​లో గార్భా, దాండియా ఎక్కువగా చేస్తారు. డ్రమ్స్, సాంగ్స్, దుర్గా మాతా స్లోగాన్స్​తో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడం లాంటిదని చెప్తారు. దీనివల్ల శరీరం లైట్​గా ఉండి.. ఆధ్యాత్మిక ఎనర్జీ పెరుగుతుందని చెప్తారు. 

Also Read : దసర నవరాత్రులు ప్రారంభం.. అమ్మవారికి మొదటిరోజు క్షీరాన్నాన్ని ఇలా చేసి నైవేద్యంగా పెట్టేయండి

దసరా స్పెషాలిటీ ఇవే (Vijayadashami Significance)

దసరా రోజు రావణ దహనం కచ్చితంగా చేస్తారు. పటాకులతో పెద్ద విగ్రహాన్ని తయారు చేసి దహనం చేస్తారు. శమి పూజ కచ్చితంగా చేస్తారు. ఇది సంపద, శుభాన్ని సూచిస్తుంది. ఆయుధ పూజ చేస్తారు. వాహనాలు, ఇండస్ట్రీల్లోని మెషీన్లకు పూజలు చేస్తారు. 

తేడాలు ఇవే

నవరాత్రి 9 రోజులు దుర్గా దేవికి పూజ చేస్తే.. దసరా ఆ తొమ్మిది రోజుల ముగింపును సూచిస్తూ.. విజయోత్సవాన్ని హైలెట్ చేస్తుంది. అంటే నవరాత్రి భక్తి, శక్తిని సూచిస్తే… దసరా ఆ శక్తి సాధించిన విజయోత్సవాన్ని మనకు గుర్తు చేస్తుంది.