Thyroid Yoga Poses : హార్మోన్లు అదుపులో లేకపోవడం, ఒత్తిడి, లైఫ్‌స్టైల్ వంటి ఇతర కారణాల వల్ల చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే నెల రోజుల్లో దానిని తగ్గించుకోవాలనుకుంటే కొన్ని యోగాసనాలు ట్రై చేయమని చెప్తున్నారు నిపుణులు. Tambi Dadhich అనే యోగా టీచర్.. తన ఇన్‌స్టాలో దీనిని గురించి రీల్ షేర్ చేసింది. అంతేకాకుండా కొన్ని టిప్స్ కూడా ఇచ్చింది. అవేంటో చూసేద్దాం.
ఉస్ట్రాసనం
మోకాలిపై నిలబడాలి. కాళ్లు దూరంగా ఉంచి.. వెనక్కి వంగాలి. బిగినర్స్ అయితే నడుముకు చేతులు సపోర్ట్ తీసుకోవచ్చు. ఇప్పటికే యోగా చేసేవారు అయితే చేతులతో మడమలను పట్టుకోవాలి. తల వెనక్కి వంచి ఛాతిని పైకి లేపాలి. ఈ పోజ్‌లో 15 సెకన్లు ఉండాలి.. మెల్లగా సాధారణ స్థితికి రావాలి. ఇలా మూడు రౌండ్లు చేయాలి.
ఛాతి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. వెన్నెముకకు బలం అందిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.
సర్వాంగాసన
నెలపై పడుకొని.. చేతులను నడుమునకు సపోర్ట్ ఇస్తూ శరీరాన్ని పైకి లేపాలి. మోకాళ్లు నిటారుగా ఉంచి.. భుజాలపై శరీరాన్ని నిలబెట్టాలి. మెడ గాయపడకుండా జాగ్రత్తగా ఉండాలి. 15 సెకన్లు ఉండి యథాస్థితికి రావాలి. మూడు రౌండ్లు చేయాలి.
రక్తప్రసరణ మెరుగవుతుంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథులు ఉత్తేజమవుతాయి. హార్మోనల్ బ్యాలెన్స్ అవుతాయి. మానసిక ప్రశాంతతను ఇస్తుంది.
సేతుబంధాసన
నేలపై పడుకోవాలి. మోకాళ్లను మడిచి.. పాదాలను నేలపై ఉంచాలి. నడుమును పైకి లేపి.. రెండు చేతులతో నేలను పట్టుకుని మద్ధతు ఇవ్వాలి. 15 సెకన్లు ఇలా ఉండి యథాస్థితికి రావాలి. మూడు రౌండ్లు చేయాలి.
నడుము నొప్పి తగ్గుతుంది. ఊపిరితిత్తులకు మంచిది. థైరాయిడ్‌ను కంట్రోల్ చేస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. జీర్ణాశయ వ్యవస్థను మెరుగుచేస్తుంది.
మత్యాసన
పడుకొని మోకాళ్లు మడుచుకోవాసి. ఛాతిని పైకి లేపి..తల వెనక్కి వంచాలి. తలపై ప్రెజర్ లేకుండా సున్నితంగా చేయాలి. 15 సెకన్లు ఉండి యథాస్థితికి రావాలి. మూడు రౌండ్లు చేయాలి.
థైరాయిడ్ సమస్యలు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం అందుతుంది. వెన్నెముక స్ట్రాంగ్ అవుతుంది.
బ్రహ్మరీ ప్రాణాయామం
సుఖాసనంలో కూర్చోవాలి. చెవులపై వేళ్లతో మూసేయండి. ముక్కుతో లోపలికి ఊపిరి పీల్చుకుని ఓం అనే శబ్ధం చేయాలి. వదిలేప్పుడు నోటితో వదలాలి. ఇలా 2 నుంచి 5 నిమిషాలు పునరావృతం చేయాలి.
ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. యాంగ్జైటీ, ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్ర లేమి, మైగ్రేన్ సమస్యలతో పాటు థైరాయిడ్ సమస్యలను దూరం చేస్తుంది.
ఈ యోగాసనాలు నెలరోజులు కంటిన్యూ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని తంబి దధీచ్ తెలిపారు. అలాగే ఖాళీ కడుపుతో వీటిని చేస్తే మంచిదన్నారు. ఉదయాన్నే కాఫీ తాగకూడదని.. డైట్లో అయోడిన్ రిచ్ ఫుడ్స్, సెలెనీయం ఫుడ్స్, జింక్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలని తెలిపారు. మీరు కూడా ఈ యోగసనాలతో థైరాయిడ్ సమస్యను తగ్గించుకోండి.