Liver Health Tips : ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని విష పదార్థాలను, టాక్సిన్లను బయటకు పంపాల్సి ఉంటుంది. ఈ పనిని కాలేయం చేస్తుంది. టాక్సిన్లను ఫిల్టర్ చేయడమే కాకుండా పోషకాలను ప్రాసెస్ చేసి శరీరానికి అందిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. కాబట్టి లివర్​ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా అది పూర్తి ఆరోగ్యాన్ని నెగిటివ్​గా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి లివర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కాలేయాన్ని కేవలం ఆల్కహాలే కాదు చాలా విషయాలు నెగిటివ్​గా ప్రభావితం చేస్తాయి. శరీరంలో, లివర్​ దగ్గర కొవ్వు పేరుకుపోవడం, అన్​ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం, షుగర్స్, పలు రకాల మెడిసన్స్ కూడా కాలేయ సమస్యలకు కారణమవుతాయి. అయితే వాటికి దూరంగా ఉండడంతో పాటు కొన్ని రకాల ఫుడ్స్ రెగ్యులర్​గా తీసుకుంటే లివర్​ హెల్త్​కి మంచిదట. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటి? అవి కాలేయాన్ని ఎలా డీటాక్స్ చేసి.. హెల్తీగా ఉంచుతాయో తెలుసుకుందాం. 

బీట్​రూట్

బీట్​రూట్​లలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్​ ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించి.. లివర్​ని డీటాక్స్ చేస్తాయి. దీనికోసం బీట్​రూట్​ని జ్యూస్ రూపంలో లేదా సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు. 

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్, సెలీనియం ఉంటాయి. ఈ రెండు సహజమైన కాంపౌండ్స్ లివర్​ యాక్టివిటీని మెరుగుపరుస్తాయి. లివర్​ని డైట్​లో తీసుకోవాలంటే కాస్త క్రష్ చేసి భోజనంతో తీసుకోవచ్చు. లేదా ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మంచిది. 

పసుపు

పసుపు కాలేయ ఇన్​ఫ్లమేషన్ని తగ్గించి దానిని సహజంగా డీటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. కాబట్టి దీనిని పాలల్లో కలిపి లేదా కూరల్లో కలిపి తీసుకోవచ్చు. రెగ్యులర్​గా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 

కూరగాయలు

పాలకూర, కాలే వంటి ఆకుకూరలు లివర్​లోని టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తాయి. వీటిలోని క్లోరోఫిల్ సహజంగా శరీరం డీటాక్స్ చేసేలా చేస్తుంది. దీనివల్ల పూర్తి శరీరం డీటాక్స్ అవుతుంది. గ్రీన్ స్మూతీల రూపంలో లేదా సలాడ్స్ రూపంలో ఉడికించి తీసుకోవచ్చు. 

నిమ్మరసం

నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలోని ఆల్కలైజింగ్ శరీరంలోని టాక్సిన్లను బయటకి పంపి.. లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి ఉదయాన్నే తీసుకుంటే మంచిది. 

అవకాడో.. 

హెల్తీ ఫ్యాట్స్​తో నిండిన అవకాడోలో గ్లూటాథైన్ ఉంటుంది. ఇది లివర్​ని డీటాక్స్ చేసి.. హెల్తీగా ఉంచుతుంది. కాబట్టి అవకాడోను టోస్ట్​తో కలిపి లేదా స్మూతీల రూపంలో తీసుకోవచ్చు. 

వాల్​నట్స్

వాల్​నట్స్​లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి లివర్​ని క్లెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. మెటబాలీజం పెంచి.. కాలేయం దగ్గర పేర్కొన్ను కొవ్వును కరిగిస్తాయి. కాబట్టి వీటిని హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు. 

లివర్​ని డీటాక్స్ చేయాలని మీరు ఎలాంటి డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లివర్​కి సహజంగా క్లెన్స్ చేసుకునే లక్షణం ఉంటుంది. సరైన ఆహారాన్ని అందిస్తే.. దాని పని అది చేసుకుంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.