Home Remedies for Common Problems : చిన్న ఆరోగ్య సమస్యకి కూడా చాలామంది మెడిసిన్స్ వేసుకుంటారు. ట్యాబ్లెట్స్ రెగ్యులర్​గా వేసుకుంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని.. కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మెడిసిన్ అవసరం లేదని.. ఇంటి చిట్కాలు కూడా సమస్యలనుంచి ఉపశమనం అందిస్తాయని చెప్తున్నారు. అయితే ఆ హోం రెమిడీలు ఏంటో.. ఏయే సమస్యల్ని అవి తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

గొంతు నొప్పి

సీజన్ మారుతున్నప్పుడు గొంతు నొప్పి ఎక్కువమందిని ఇబ్బంది పెడుతుంది. ఆ సమయంలో కాస్త గోరువెచ్చని నీటిలో సాల్ట్ కలపాలి. గ్లాసు నీటిలో అర టీస్పూన్ లేదా పావు టీస్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. దానిని నోటిలో వేసుకుని పొక్కులించాలి. ఇలా రోజు మొత్తంలో కొన్నిసార్లు రిపీటెడ్​గా చేస్తే ఇన్​ఫ్లమేషన్ తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం అందుతుంది. 

తలనొప్పి..

తలనొప్పి వచ్చినప్పుడు చల్లని లేదా హాట్ ప్యాక్​ని తీసుకుని నుదిటిపై కాసేపు లేదా మెడ వెనుకభాగంలో 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం అందుతుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. 

జీర్ణ సమస్యలు 

జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడుతుంటే అల్లం టీ తాగితే మంచిది. పాలు లేకుండా అల్లం నీటిలో వేసి మరిగించాలి. అల్లాన్ని ముక్కలుగా లేదా తురిమి 10 నుంచి 15 నిమిషాలు మరిగించాలి. ఇది జీర్ణ సమస్యలన్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. 

దగ్గు

తేనెలో నిమ్మరసం కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. 1 లేదా 2 టీస్పూన్ల తేనెను ఫ్రెష్​గా పిండిన నిమ్మరసంతో కలిపి గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగాలి. ఇది దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడంతో పాటు గొంతు దగ్గర ఉండే ఇరిటేషన్​ని దూరం చేస్తుంది. పిల్లలకు దగ్గ వస్తే తేనె ఇవ్వకపోవడమే మంచిది. ముఖ్యంగా ఏడాది కంటే చిన్నపిల్లలకు తేనె ఇవ్వకూడదు. 

కాలిన గాయాలకు

అలొవెరా జెల్​ను కాలిన గాయాలపై అప్లై చేయవచ్చు. ఫ్రెష్​గా కట్ చేసిన కలబంద గుజ్జును కాలిన గాయాలపై నేరుగా అప్లై చేయాలి. దీనివల్ల మంట తగ్గుతుంది. కూల్​గా ఉంటుంది. అలాగే గాయం పెద్దది కాకుండా త్వరగా తగ్గిపోయేలా చేస్తుంది. 

నిద్ర సమస్యలు

ఇన్​సోమియా వంటి నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతుంటే అశ్వగంధ పాలను రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. హెర్బల్ టీలు కూడా నిద్రను ప్రోత్సాహిస్తాయి. ప్రాణాయామా లేదా 4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ కూడా నిద్రను మెరుగుపరుస్తాయి. ఫోన్, ల్యాప్ టాప్ వంటి వాటిని నిద్రకు గంట ముందే దూరం ఉంచాలి. చెర్రీ జ్యూస్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. 

కడుపు ఉబ్బరం

పుదీనా టీని తాగితే బ్లోటింగ్, జీర్ణ సమస్యలు, కళ్లు తిరగడం వంటి ఇబ్బందులు దూరమవుతాయి. పుదీనాను నీటిలో వేసి మరిగించి నచ్చితే నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవచ్చు. 

ఇవన్నీ కామన్​గా వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించి చక్కటి ఇంటి చిట్కాలు. అయితే ఆరోగ్య సమస్యలు ఎక్కువకాలం ఉన్నా లేదా తీవ్రంగా ఉన్నా వెంటనే వైద్యసహాయంతీసుకోవాలి. అంతేకానీ తెలిసిన మెడిసన్స్ వేసుకోకూడదు. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.