Festive Glowup for Diwali : దసరా అయిపోయింది. దీపావళి వచ్చేస్తుంది. ఈ సమయంలో మీరు అందంగా కనిపించాలనుకుంటే మేకప్ మాత్రమే కాదు.. ఇప్పటి నుంచి మీ చర్మాన్ని కూడా సిద్ధం చేసుకోండి. ఎందుకంటే మీరు సహజమైన, ఎక్కువకాలం ఉండే గ్లో(Festive Glow) కోసం ఎదురు చూస్తుంటే.. కొన్ని సహజమైన ఇంటి చిట్కాలు(Festive Glow Skincare and Home Remedies) వాడాలి అంటున్నారు. ఇంతకీ ట్యాన్‌ని వదిలిస్తూ.. నోటి దుర్వాసనను దూరం చేసే హోం రెమిడీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
బాడీ స్క్రబ్..
కాఫీ పౌడర్‌లో తేనె కలిపి బాడీ స్క్రబ్‌గా ఉపయోగించాలి. గట్టిగా రుద్దకూడదు.. స్మూత్‌గా మురికిపోయేలా చేయాలి. లేదంటే కాఫీలోని గట్టిపదార్థం చర్మంపై గీతలకు కారణం అవుతుంది.
పొడిచర్మాన్ని దూరం చేసే టిప్
మీరు పొడిచర్మంతో ఇబ్బంది పడుతూ.. స్మూత్, హైడ్రెటెడ్ చర్మం కావాలనుకుంటే.. 1 కప్పు పాలు తీసుకుని దానిలో 2 టీస్పూన్ల తేనే వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు దానిని మీరు స్నానం చేసే బకెట్లో గోరువెచ్చని నీళ్లు వేసుకుని.. దానిలో పాల మిశ్రమాన్ని వేసి కలపాలి. ఈ నీటితో స్నానం చేస్తే పొడిచర్మం దూరమవుతుంది.
బేబి సాఫ్ట్ స్కిన్
మీ చర్మం చిన్న పిల్లల మాదిరిగా సాఫ్ట్‌గా మారాలనుకుంటే.. కొబ్బరినూనెను మీ మోచేతులకు అప్లై చేయాలి. అలాగే మోకాళ్లకు, పాదాలకు కూడా అప్లై చేసి.. సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇది కాకుండా మీరు పంచదార పొడిని తీసుకుని దానిలో ఆలివ్ ఆయిల్ వేసి కలపాలి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది.
ట్యాన్ ఇలా తొలగించుకోండి
పెరుగులో పసుపు, తేనె వేసి కలిపి.. ఈ మిశ్రమాన్ని ట్యాన్ అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది ఒకేసారి పోదు. కానీ రెగ్యులర్‌గా ఉపయోగిస్తే చాలా మంచి ఫలితాలు చూడగలుగుతారు. అలాగే సన్‌స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాలి.
లోపలి నుంచి గ్లో రావాలంటే..
రోజూ రాత్రి పడుకునే ముందు చియాసీడ్స్ నానబెట్టుకోవాలి. ఓ గ్లాసు నీటిలో వాటిని కలిపి ఉదయాన్నే తాగేయాలి. ఇది జీర్ణసమస్యలను దూరం చేయడంతోపాటు.. సహజంగా ముఖం మెరిసేలా చేస్తుంది.
మంచి వాసన కోసం..
శరీరం నుంచి చెడు వాసన రాకుండా.. మంచి స్మెల్ రావాలనుకుంటే.. స్ప్రే బాటిల్ తీసుకుని దానిలో నీళ్లు వేయాలి. అలాగే గ్లిజరిన్, రోజ్ వాటర్ కూడా వేసి మిక్స్ చేయాలి. దీనిని శరీరం మీద స్ప్రే చేసుకోవాలి.
ఒత్తిడి మాయం
బకెట్లో గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో రాళ్ల ఉప్పు, కొన్ని చుక్కల ఎసెన్సియల్ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ వేసి.. మీ పాదాలను దానిలో ఉంచాలి. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. పండుగవేళల్లో మంచి నిద్రను ఇది అందిస్తుంది.
మరిన్ని టిప్స్
లిక్విడ్ హైలెటర్, మాయిశ్చరైజర్‌ను తక్కువ మోతాదులో తీసుకుని.. మీ లుక్‌ని హైలెట్ చేయాలనుకున్న ప్రాంతాల్లో దీనిని అప్లై చేయవచ్చు. అలాగే కలబంద గుజ్జును ఐస్ ట్రేలలో వేసి.. ముఖానికి, శరీరానికి ఉపయోగించవచ్చు. ఇవన్నీ మీరు పండుగ సమయంలో సహజంగా అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే ముఖంలో మంచి గ్లోని అందిస్తాయి. మరి మీరు కూడా ఈ దీపావళికి ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేసేయండి.