National Kiss and Make Up Day 2025 : నేషనల్ కిస్ అండ్ మేక్ అప్ డేని న్యూయార్క్​లో ప్రతి సంవత్సరం ఆగస్టు 25వ తేదీన జరుపుకుంటారు. జాక్వెలిన్ మిల్గేట్ అనే అమెరికన్ రచయిత ఈ స్పెషల్​ డేని ప్రారంభించారు. అయితే దీనివెనుక ఓ బలమైన కారణమే ఉంది. అది తెలిస్తే మీరు కూడా ఈ స్పెషల్​ డేని సెలబ్రేట్ చేసుకోకపోయినా.. మీ అవసరానికి అనుగుణంగా స్పెషల్​ డేగా మార్చుకోగలుగుతారు.


జంతర్ మంతర్ చూమంతర్ ఖాళీ..


నేషనల్ కిస్ అండ్ మేక్ అప్ డే తెలుగులో చెప్పాలంటే.. "శంకర్​ దాదా ఎంబీబీఎస్" స్టైల్​లో జంతర్ మంతర్ చూమంతర్​ ఖాళీ.. అందర్ దరత్ దెబ్బకు ఖాళీ అనొచ్చు. అంటే ఏదైనా రిలేషన్​లో గొడవలు జరగడం అనేది కామన్. కానీ కొన్నిసార్లు ఎంత ప్రేమ ఉన్నా.. ఇష్టం ఉన్నా.. కోపం, ఇగోలతో దానిని బయటపెట్టకుండా గొడవతోనే దూరం పెంచుకుంటారు. అలాంటి తగాదాలను, అపార్థాలను ఎక్కువకాలం కొనసాగించకూడదనే ఉద్దేశంతో నేషనల్ కిస్ అండ్ మేక్​ అప్​ డేని ప్రారంభించింది జాక్వెలిన్. 


కలిసుంటే కలదు సుఖం.. 


చిన్న చిన్న కారణాలతో విడిపోయినవారి కలపాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. అయితే ఈ స్పెషల్ డేని ఇప్పటికీ చాలామంది ఫాలో అవుతున్నారు. ఏదో గొడవను మనసులో పెట్టుకుని మంచి రిలేషన్​ని దూరం చేసుకోకూడదనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డేని తెరపైకి తెచ్చి.. సమస్యను ఒక ముద్దు లేదా హగ్​తో పరిష్కరించుకునేలా చేశారు. ఈ నేషనల్ కిస్ అండ్ మేక్​ అప్​ డేకి ఎలాంటి సెలవు ఉండదు కానీ.. సోషల్ మీడియాలో బాగా ప్రాచూర్యం పొందింది. అలాగే రిలేషన్​లో ఉన్నవారు బహిరంగంగా క్షమాపణ అడుగుతూ తిరిగి ఒక్కటవుతారు. 


ఇండియన్ కల్చర్ కాదు కానీ.. 


కిస్ అండ్ మేక్​ అప్​ అనేది ఇండియన్ కల్చర్ కాదు కానీ.. ఈ స్పెషల్ డే మనకి కూడా చిన్న హోప్ ఇస్తుంది. మనం ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలని రూల్ కూడా లేదు. కానీ మీకు నచ్చినవారితో ఏదైనా గొడవజరిగి.. వారు ఏదో అన్నారనో లేదా కోపంతోనే వారికి దూరంగా ఉంటే కనుకు దీనిని మీరు స్పెషల్​ డే మార్చుకునేందుకు.. వారితో మళ్లీ మాట్లాడేందుకు అవకాశంగా తీసుకోవచ్చు. 


పంతం ఎందుకు దండగా..


ఈ స్పెషల్ డే కోపం, అహంకారాన్ని వదిలి.. మళ్లీ కలిసిపోవడాన్ని సూచిస్తుంది. క్షమించడాన్ని నేర్పిస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, లైఫ్​ పార్టనర్​తో ఉండే సంబంధాలు మరింత స్ట్రాంగ్ అవుతాయి. వారి మీద ఉన్న ప్రేమని మీరు మళ్లీ చూపించగలుగుతారు. కాబట్టి మీరు ప్రేమించే వ్యక్తికి మీద మీరు కోపంతో లేదా ఏదైనా విషయంలో హర్ట్ అయి దూరంగా ఉంటే వారితో మాట్లాడేందుకు ఇదే సరైన సమయం. 


ఏ రిలేషన్​కి అయినా ఇది బెస్టే


ఈ స్పెషల్ డే కేవలం లవర్​, పార్టనర్​తోనే అనుకునేరు. మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడకపోయినా.. సోదరులతో గొడవ పడినా.. ఫ్రెండ్స్​తో దూరం పెరిగినా.. ఇలా ఏ రిలేషన్​కి అయినా వర్తిస్తుంది. మీరు కిస్ ఇవ్వలేకపోవచ్చు. కానీ హగ్ ఇవ్వొచ్చు. హగ్ ఇవ్వలేని రిలేషన్ ఉంటే ఓ చిన్న గ్రీటింగ్ కార్డు లేదా పువ్వు ఇచ్చి సారీ చెప్పేయండి. దూరంగా ఉంటే కనీసం టెక్స్ట్ ద్వారా అయినా మీరు మీ ఫీలింగ్స్ కన్వే చేసేయొచ్చు. 


మొత్తంగా చెప్పాలంటే.. నేషనల్ కిస్ అండ్ మేక్ అప్ డే అనేది ఒక చిన్న రిమైండర్ లాంటిది. కోపం, అహంకారం, అపార్థాలు పక్కన పెట్టి… మళ్లీ కలిసిపోవడానికి ఓ అవకాశం. మనం దాన్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది మన ఇష్టం కానీ.. రిలేషన్​ను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఇది బెస్ట్.