National Best Friend Day 2024 Wishes in Telugu: స్నేహితులు అందరికీ ఉంటారు. కానీ, బెస్ట్ ఫ్రెండ్ మాత్రం.. కొందరికి మాత్రమే ఉంటారు. జీవితాంతం మీకు తోడుగా.. నీడగా ఉండేవారే మీ బెస్టీ. సింపుల్‌గా చెప్పాలంటే.. బెస్ట్ ఫ్రెండ్ అంటే.. మన రెండో ప్రాణం. మరి, అలాంటి ప్రాణ మిత్రుడికి ఈ రోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఉండగలమా? 


బెస్ట్ ఫ్రెండ్ ఉన్నవారే నిజమైన ధనవంతులు. ఏ కష్టమొచ్చిన వారికి చెప్పుకుంటే కాస్త రిలీఫ్. వీలైతే ఆ కష్టాన్ని వారు తీర్చేస్తారు కూడా. మనదేశంలో బెస్ట్ ఫ్రెండ్షిప్ డేను జూన్ 8న శనివారం నిర్వహిస్తున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్‌ను విష్ చేయాలని అనుకుంటున్నారా? ఇదిగో ఈ కింది కోట్స్‌తో తెలుగులో విష్ చేయండి.


స్నేహితులు లేని జీవితం ఎడారిలాంటిది, 
మీ బెస్టీ ఎప్పుడూ పక్కన ఉంటే తెలుస్తుంది
జీవితం ఎంత అందంగా ఉంటుందో. 
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే


రక్తసంబంధం లేకున్నా..
అంతకన్నా ఎక్కువగా పెనవేసుకునే బంధం మనది.
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే మిత్రమా


నా నవ్వుని రెట్టింపు చేసేందుకు, 
బాధని పంచుకునేందుకు దేవుడు 
నా కోసం పుట్టించిన ఫ్రెండ్‌వి నువ్వు...
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే మిత్రమా. 


నువ్వు నోరు విప్పి ఒక్క మాట చెప్పకపోయినా... 
మనసులోని బాధను అర్థం చేసుకునేవారే నిజమైన బెస్టీ
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే మిత్రమా


మీకు ఎంతమంది స్నేహితులుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది.
వారిలో ఒకరు జీవితాంతం బెస్టీగా ఉంటే.. మీ అంత లక్కీ మరొకరు ఉండరు.
Happy Best Friends Day


నలుగురిలో నువ్వు ఉన్నా 
నీలో నిన్ను లేకుండా చేసేది ప్రేమ
నీలో నువ్వు లేకున్నా
నీకంటూ ఒకరు ఉన్నారూ అని చెప్పే ధైర్యం స్నేహం
హ్యాపీ  బెస్ట్ ఫ్రెండ్షిప్ డే నేస్తమా


ప్రపంచమంతా మిమ్మల్ని దూరం పెట్టినా... 
మీ పక్కన నిల్చునే వాడే అసలైన బెస్టీ. 
అలాంటి బెస్టీ ఉన్న ప్రతిఒక్కరు అదృష్టవంతులే. 
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే


నీకు తెలియని నిన్ను, నీకు పరిచయం చేసేందుకే ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వారిలో బెస్టీ మరింత ప్రత్యేకం.
Happy Best Friends Day


వెలుగుజిలుగులలో ఒంటరిగా నడిచే కన్నా... 
చీకటిలో ప్రాణ మిత్రుడితో కలిసి నడవడం ఎంతో ఉత్తమం  - హెలెన్ కెల్లర్


నా కష్టసమయాల్లో నువ్వెప్పుడూ నా పక్కనున్నావ్, 
నీలాంటి నిజమైన స్నేహితుడిని నాకు ఇచ్చినందుకు 
ప్రతి రోజు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను. 
నువ్వెప్పుడు నా బెస్ట్ బడ్డీవే!
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే


స్నేహం చేయడమే మీ బలహీనత అయితే
 ప్రపంచంలో మీ అంత బలవంతులు లేరు - జార్జ్ బెర్నార్డ్ షా


నువ్వు ఓడిపోయినా సరే... 
నీ నేస్తం గెలవాలని కోరుకునే స్వచ్ఛమైన మనసు నీది.. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా లక్.
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే మిత్రమా


తల్లిదండులకు, తోడబుట్టిన వారికి కూడా చెప్పుకోలేని ఎన్నో విషయాలు 
స్నేహితులకు మాత్రమే చెప్పుకోగలం. 
అలాంటి నాకు నీ రూపంలో దొరికింది. 
హ్యాపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే మిత్రమా


డబ్బు లేని పేదవాడు కాదు, స్నేహితుడు లేని వాడే పేదవాడు. 
అందుకే నేనెంతో ధనవంతుడిలా ఫీలవుతారు. 
నాకు నువ్వున్నావు కదా. హ్యపీ బెస్ట్ ఫ్రెండ్స్ డే డియర్.


Also read : Anger Management Tips: కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఇదిగో ఇలా చేస్తే.. కూల్ కూల్.. సూపర్ కూల్!