Miss World India representative Nandini Gupta : ప్రపంచ సుందరి 2025 పోటీల(72nd Miss World competition)కు హైదరాబాద్ వేదికైంది. పలు దేశాల నుంచి అందమైన భామలు తమ దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ పోటీల్లో పాల్గొననున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ఇండియాకు నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ భామ గెలవాలని భారతీయులు కోరుకుంటున్నారు. అయితే అసలు ఈ నందిని గుప్తా ఎవరు? ఆమె బ్యాక్​ గ్రౌండ్ ఏంటి? ఆమె వరల్డ్ పోటీల వరకు ఎలా వచ్చిందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

నందిని గుప్తా స్టడీ

నందిని గుప్తా రాజస్థాన్​కి చెందిన యువతి. ఈ భామ చిన్న నాటి నుంచి ఫ్యాషన్ ఇండస్ట్రీ పట్ల ఆసక్తిని పెంచుకుంది. తండ్రి సహకారంతో ఫ్యాషన్​పై తనకున్న మక్కువను పెంచుకుంటూ.. దానికి తగ్గట్టు తనని తాను మార్చుకుంది. అలా అని చదువును నెగ్లెక్ట్ చేయలేదట ఈ భామ. ప్రస్తుతం ముంబైలో ఉన్న లాలా లజ్​పత్ రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్​మెంట్ చేస్తుంది. 

మిస్ వరల్డ్ డ్రీమ్ వెనక రీజన్.. 

ఓ సందర్భంలో నందిని తన తల్లితో కలిసి ఐశ్వర్య రాయ్​ని చూసిందట. ఐశ్వర్య అందానికి నందిని ఫిదా అయిపోయి.. ఆమె ఎవరు అంటూ తల్లిని అడిగిందట. ఆమె ఐశ్వర్య రాయ్. మిస్ వరల్డ్ అని చెప్పిందట. అప్పుడే నేను కూడా మిస్ వరల్డ్ అవుతానని చెప్పిందట నందిని. అప్పటి నుంచి తనకు మిస్​ వరల్డ్ అవ్వాలనే కోరిక మొదలైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నందిని. 

ప్యాషన్​తో ఫ్యాషన్ రంగంలోకి.. 

చిన్నతనంలోనే మొదలైన మిస్​ వరల్డ్ సీడ్​.. ఆమెను ఫ్యాషన్ ఇండస్ట్రీ వైపునకు నడిపించింది. 10 ఏళ్ల నుంచి తనకి దీనిపై ఆసక్తి ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్లు సిద్ధమై.. 19వ ఏట ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. రాజస్థాన్​ను రిప్రజెంట్ చేస్తూ 2023లో ఈ అవార్డును గెలుచుకుంది. ఇదే క్రమంలో 72వ మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తుంది. 

ప్రాజెక్ట్ ఏకతా.. 

మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే భామలు.. కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో కచ్చింతగా యాక్టివ్​గా ఉండాలి. దీనిలో భాగంగా నందిని ప్రాజెక్ట్ ఏకతా పేరుతో వికలాంగులకు సేవ చేస్తుంది. వికాలంగులకు సమానతను అందించడమే దీని లక్ష్యం. ప్రతి ఒక్కరిని వారి ప్రత్యేకతల ద్వారా గుర్తించాలి కానీ.. లోపాల ద్వారా కాదు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈ భామ. 

మిస్ వరల్డ్ ఈవెంట్.. 

మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్​లో మే 7వ తేదీన మొదలై.. మే 31వరకు కొనసాగనున్నాయి. ప్రపంచ సుందరి పోటీలకు వరుసగా రెండోసారి ఆతిథ్యం ఇస్తోంది భారత్. ఈ ఈవెంట్​లో ఇండియాకు నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పటివరకు 6 ఇండియన్ బ్యూటీలు మిస్ వరల్డ్ టైటిల్​ను సొంతం చేసుకున్నారు. నందిని గుప్తా ఈ టైటిల్​ గెలవాలని ఇండియన్స్ కోరుకుంటున్నారు.