Get Glowing Skin with Multani Mitti : బతుకమ్మ (Bathukamma 2024), దసరా(Dussehra 2024) వచ్చేస్తున్నాయి. ఆ వెంటనే దీపావళి. ఇలా పండుగలన్నీ వరుసలో ఉన్నాయి. ముఖ్యంగా బతుకమ్మ, దసరా మహిళలను రిప్రెజెంట్ చేస్తాయి. ఈ సమయంలో అందంగా కనిపించేందుకు అందరూ ప్రయత్నిస్తారు. దానికి తగ్గట్లు ముస్తాబవుతారు. అయితే ముఖం నిర్జీవంగా ఉండి ఎంత రెడీ అయినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. కాబట్టి స్కిన్ కేర్‌పై ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు బ్యూటీ నిపుణులు.
హెల్తీ స్కిన్, మెరిసే చర్మం కోసం ముల్తానీ మిట్టిని ఉపయోగించవచ్చు. ఎన్నో ఏళ్లుగా చర్మాని శుభ్రం చేసే క్లీనింగ్ ఏజెంట్‌గా దీనిని ఉపయోగిస్తున్నారు. ఇది మొటిమలను నివారించడంతో పాటు.. చర్మాన్ని హెల్తీగా ఉంచుతుంది. డర్ట్ని పోగొట్టి మెరిసే స్కిన్‌ని అందించడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి మెరిసే చర్మం కోసం దీనిని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి బెనిఫిట్స్ పొందవచ్చు? ఫేస్ మాస్క్ ఎలా వేసుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ముల్తానీ మిట్టి వల్ల కలిగే ప్రయోజనాలు
ముల్తానీ మిట్టి సహజమైన శోషక పదార్థంగా పనిచేస్తుంది. డీప్ క్లెన్సింగ్, స్కిన్ డిటాక్స్ చేయడం కోసం దీనిని ఉపయోగిస్తారు. ఇది చర్మం నుంచి అదనపు నూనను తీయడంతో పాటు మలినాలను తొలగిస్తుంది. బ్లాక్ హెడ్స్, మొటిమలు కంట్రోల్లో ఉంటాయి. అదనపు సెబమ్‌ని గ్రహించి గేమ్ ఛేంజర్‌గా పని చేసి.. మంచి మెరుపును అందిస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించడంతో పాటు.. వాటిని దూరం చేస్తాయి. చర్మం బిగుతుగా ఉండేలా.. ఫైన్ లైన్స్, ముడతలను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్
పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మిట్టితో ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 టేబుల్ స్పూన్ పాలు కలిపి తీసుకోవాలి. దీనిని పేస్ట్‌గా చేసి ముఖానికి, మెడపై అప్లై చేయాలి. దీనిని పదిహేను నిమిషాలు ఉంచి.. డ్రై అయిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. అనంతరం మాయిశ్చరజైర్ అప్లై చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా పోషణ అందించి.. హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.
ఆయిల్ స్కిన్ కోసం..
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి,1 టేబుల్ స్పూన్ వేప పొడి, 1 టేబుల్ స్పూన్ పెరుగును కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. దీనిని ముఖానికి మెడకు అప్లై చేసి 15 నిమిషాలు ఉంచాలి. ఈ ప్యాక్ మొటిమలను కూడా కంట్రోల్ చేస్తుంది. క్లియర్ స్కిన్‌ని అందిస్తుంది.
సెన్సిటివ్ స్కిన్ ఉంటే..
కొందరికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది. అలాంటివారు ముందుగా ప్యాచ్ టెస్ట్ వేసుకోవాలి. పడుతుంది అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల ముల్తానీ మిట్టి, 1 టేబుల్ స్పూన్ గంధపు పొడి, 1 టేబుల్ స్పూన్ కీరదోస రసాన్ని పేస్ట్‌గా చేయాలి. దీనిని అప్లై చేసి పావు గంట ఉంచుకోవాలి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. ఇది సెన్సిటివ్ స్కిన్‌ను కూల్ చేస్తుంది. రెడ్నెస్, చికాకును తగ్గిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చర్మం బాగా పొడిగా లేదంటే బాగా సెన్సిటివ్‌గా ఉంటే ముల్తానీ మిట్టిని ఉపయోగించడం మానేస్తే మంచిది. లేదంటే స్కిన్ మరింత డ్రై అవుతుంది. అలాగే దీనిని పావుగంటకు మించి ఎక్కువ సమయం ఉంచుకోకపోవడమే మంచిది. లేదంటే స్కిన్ ఇరిటేషన్ వచ్చే అవకాశాలున్నాయి. రెడ్నెస్, దురద ఇంకేమైనా అసౌకర్యాలు ఉంటే వెంటనే దానిని కడిగేయండి. నిపుణుల సలహాలు తీసుకుని దీనిని ఉపయోగిస్తే మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
Also Read : మీ వయసుకంటే పెద్దవారిగా కనిపిస్తున్నారా? ఇవి ఫాలో అయితే యంగ్‌గా కనిపిస్తారు