Morning Mistakes That Can Impact Your Weight : నిద్రలేవగానే చేసే కొన్ని పనులు మన బరువును డిసైడ్ చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మార్నింగ్ రొటీన్​లో తెలియకుండా చేసే పనుల వల్ల తెలియకుండానే బరువు పెరుగుతామని చెప్తున్నారు. అలాగే ఈ పొరపాట్ల వల్ల బరువు తగ్గడం కూడా కష్టమవుతుందని చెప్తున్నారు. బరువు తగ్గుతామనే భ్రమలో చేసే మిస్టేక్స్ బరువు పెరగడానికి కారణమవుతున్నాయని.. అందుకే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ ఉదయాన్నే కామన్​గా చేసే మిస్టేక్స్ ఏంటి..


బ్రేక్​ఫాస్ట్


చాలామంది ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్ మానేసి బరువు తగ్గిపోవాలని చూస్తారు. కానీ రాత్రంతా కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి.. హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్​తో కూడా బ్రేక్​ఫాస్ట్ చేయాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. బ్రేక్​ఫాస్ట్ మానేయడం వల్ల మెటబాలీజం తగ్గి.. బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తుందట. అందుకే ఉదయాన్నే శరీరానికి శక్తిని అందించడానికి కాస్త ఫుడ్ ఇవ్వాలని చెప్తున్నారు. 


స్వీట్స్


ఉదయాన్నే కొందరు తమ రోజును స్వీట్స్​తో ప్రారంభించడం లేదా స్వీట్, షుగర్ నిండిన జ్యూస్​లు తాగడం చేస్తారు. టీ, కాఫీలలో కూడా షుగర్ వేసుకుని తాగుతారు. ఇది రక్తంలో షుగర్ లెవెల్స్ పెంచి బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే ఈ టీ, కాఫీలను.. హెర్బల్ టీ, బ్లాక్ టీగా కన్వర్ట్ చేసుకుని.. షుగర్​ లేకుండా తీసుకుంటూ డేని ప్రారంభించవచ్చు. 


నీళ్లు తాగకపోవడం


రాత్రి శరీరానికి ఎక్కువ నీరు అందదు కాబట్టి.. ఉదయాన్నే మంచి నీటిని తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్​కు గురికాకుండా యాక్టివ్​గా మారుతారు. మెటబాలీజం పెరుగుతుంది. మలాసనంలో గోరువెచ్చని నీరు తాగితే మరీ మంచిది. కానీ ఉదయాన్నే నీరు తాగకపోతే మెటబాలీజం తగ్గిపోతుంది. క్యాలరీలు బర్న్ కావు. దీనివల్ల బరువు తగ్గడం కష్టతరం అవుతుంది. 


బ్రేక్​ఫాస్ట్ అలా వద్దు


కొందరు బ్రేక్​ఫాస్ట్ పూర్తిగా మానేస్తే.. మరికొందరు కార్బోహైడ్రేట్స్​తో నిండి ఫుడ్ తీసుకుంటారు. ఉదయాన్నే వైట్ బ్రెడ్, కేక్స్, షుగర్ సెరెల్స్ వంటివి తీసుకోకపోవడమే మంచిది. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్​ని అమాంతం పెంచుతాయి. దీనివల్ల బరువు పెరిగిపోతారు. 


ఉదయం నిద్ర


నిద్ర ఆరోగ్యానికి మంచిది. కానీ అది రాత్రి అయితేనే మంచిది. రాత్రంతా మెలకువగా ఉండి ఉదయాన్నే దానిని కవర్ చేసేందుకు ఎక్కువ సేపు పడుకుంటారు. దీనివల్ల శరీరంలో సహజమైన బాడీ రిథమ్ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మీరు డే అంతా యాక్టివ్​గా లేకుండా నిద్రమత్తులోనే ఉంటారు. దీనివల్ల బరువు తగ్గడం కష్టమవుతుంది. 


ఫిజికల్​ యాక్టివిటీ లేకపోవడం


ఉదయాన్నే యాక్టివ్​గా లేకుండా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెటబాలీజం తగ్గుతుంది. జీవక్రియ తక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి ఉదయాన్నేశరీరాన్ని యాక్టివ్​ చేసేందుకు వ్యాయామం, వాకింగ్​ లాంటివి చేస్తే కేలరీలు బర్న్ అవుతాయి.


ఇవన్నీ చాలామంది తమ రొటీన్​లో తెలియకుండానే ఫాలో అవుతారు. ఈ మిస్టేక్స్ క్రమంగా బరువు పెంచుతాయి. అంతేకాకుండా మీరు ఎంత జిమ్ చేసినా.. బరువు తగ్గడాన్ని ఆలస్యం చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే ఎంత యాక్టివ్​గా, ప్రొడెక్టివ్​గా ఉంటే.. బరువు తగ్గడం అంత సలుభమవుతుందని చెప్తున్నారు నిపుణులు. 



Also Read : 2025 ఫిట్​నెస్ గోల్స్.. బరువును తగ్గించి, ఫిట్​గా ఉంచగలిగే సింపుల్ టిప్స్ ఇవే