కరోనా తర్వాత ప్రపంచ దేశాలను అంతగా వణికిస్తుంది మంకీపాక్స్. ఐరోపా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఈ వైరస్ వ్యాప్తి వేగంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తుంది.  అయితే ఐరోపా దేశాలలో వచ్చిన మంకీపాక్స్ సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్‌ వేరియంట్ కి భారతదేశంలో వచ్చిన వేరియంట్ పూర్తి భిన్నంగా ఉందని పూణేకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ICMR) పరిశోధకుల బృందం చెప్పుకొస్తుంది. దాదాలు 70 దేశాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది. మన దేశంలోని కేరళలో నమోదైన రెండు కేసుల జన్యు క్రమాలను పరిశీలించింది ఆ బృందం. 


దేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్ జాతి A.2 అని ఇది ఇటీవల మధ్యప్రాచ్యం నుండి భారతదేశానికి దిగుమతి చేయబడింది. ఇది అంతకుముందు 2021 వ్యాప్తి సమయంలో థాయిలాండ్ మరియు యుఎస్‌లో ఉంది. అయితే, ఐరోపాలో సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్‌లకు కారణమైన స్ట్రెయిన్ మాత్రం B.1 అని పరిశోధకుల బృందం చెప్పుకొచ్చింది. మంకీపాక్స్ వైరస్ ప్రస్తుత వేరియంట్ ఐరోపాలోని సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్‌ల ద్వారా జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. సుమారు 70 కి పైగా దేశాల్లో 16 వేల కేసులకి పైగా నమోదయ్యాయి. అది 2022 లో వచ్చిన స్ట్రెయిన్ B.1 అని ఓ శాస్త్రవేత్త అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న స్ట్రెయిన్ B.1 కి A.2 విరుద్ధంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. భారత్ లో కనిపించే A.2 స్ట్రెయిన్ సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్‌ ను సూచించదు. అంటే దీని అర్థం ఐరోపాలో వ్యాప్తి చెందుతున్న సూపర్‌స్ప్రెడర్ కి దీనికి పోలిక ఉండకపోవచ్చని సదరు శాస్త్రవేత్త అభిప్రాయపడ్డారు. 


దేశంలో ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నందున జన్యుపరమైన నిఘాను పెంచి ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన సూచించారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో అవగాహన కల్పించాలని, మరిన్ని పరీక్షలు చెయ్యడం వల్ల కేసులు బయటపడే అవకాశం ఉందని సదరు శాస్త్రవేత్త సూచిస్తున్నారు. 


మాంసాహారం తినేవారిలో అధికంగా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంది. సరిగా ఉడకని మాంసం తినడం వల్ల లేదా ఈ వైరస్‌ను మోస్తున్న జంతువులను ముట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటివి చేయడం వల్ల కూడా మంకీపాక్స్ వైరస్ శరీరంలో చేరుతుంది. ఈ వైరస్ సోకాక రెండు నుంచి నాలుగు వారాల్లో పోతుంది. ప్రాణాలు తీసేంత ప్రమాదకరమైనది కాదని ఆరోగ్యినిపుణులు నిర్ధారించారు. ఈ వైరస్‌ను 1958లో తొలిసారి గుర్తించారు. కోతులలో ఈ వైరస్ మొదటిసారి బయటపడడంతో దీనికి మంకీ పాక్స్ అని పేరు వచ్చింది.  


Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!


Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!