బరువు తగ్గాలనుకున్నప్పుడు చాలామంది పాలు మానేస్తారు. పాలు మానేస్తే కాదు పాలు తాగితే బరువు తగ్గుతారు అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలనుకున్నప్పుడు పాల వినియోగం తగ్గించాలనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు. కొవ్వు తక్కువ ఉన్న పాలు కేలరీలు లేకుండా కాల్షియం, విటమిన్ డి , ప్రోటీన్లు వంటి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయంటున్నారు. ఇంతకీ బరువు తగ్గడంలో పాలు ఏ విధంగా సహాయం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గాలనుకునేవారు లో ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడే అనేక అధ్యయనాలు నిరూపించాయి. అయినా సరే పాలు బరువు పెరిగేలా చేస్తాయనే అపోహాలో పాలను దూరం పెట్టేస్తారు. పాలను దూరం చేసుకోవడం అంటే.. బరువు తగ్గడానికి అవసరమైన పోషకాలను పక్కన పెట్టేయడమే. స్కిమ్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల బరువు కంట్రోల్లో ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తించాలి.
కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది
కొందరు పాలను దూరం పెడతారు కానీ.. కంట్రోల్ లేకుండా సోడా, టీ, ఎనర్జీ డ్రింక్స్ తాగేస్తారు. వారికి తెలియని విషయం ఏంటంటే.. స్కిమ్డ్ మిల్క్ ఇతర పానీయాల కంటే తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో ఉండే ప్రోటీన్ కంటెంట్ కారణంగా ఎక్కువ సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీనివల్ల మీరు చిరుతిళ్లకు దూరంగా ఉంటారు. తినే మీల్ కూడా తగ్గిస్తారు.
మెరుగైన వ్యాయామం కోసం
బరువు తగ్గాలనుకునే వారు చేయాల్సింది వ్యాయామం. కానీ చాలామంది అది చేసే ఓపిక లేక మధ్యలోనే ఆపేస్తారు. సమయంలో లేదు అంటే ఓకే కానీ.. ఓపిక లేక జిమ్ మానేస్తే బరువు పెరుగుతారు. అందుకే శరీరానికి అవసరమైన పోషకాలు అందించాలి. ఇది శరీర బలాన్ని పెంచుతుంది. మీరు శరీర కొవ్వును వ్యాయామం ద్వారా తగ్గించుకోగలుగుతారు. లేదు కాదు కూడదు అని శరీరానికి అవసరమైన పోషకాలు ఇవ్వకుండా వ్యాయామం కోసం కష్టపడితే ఉన్న ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
శరీరానికి అవసరమైన పోషకాలు అందించి.. బరువు తగ్గడానికి ప్రయత్నించాలనే విషయం గుర్తించుకోండి. పోషకాలు అందించి శరీరాన్ని కష్టపెట్టకపోతే బరువు సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. వ్యాయామం చేసిన వెంటనే కొందరు ఎనర్జీ డ్రింక్స్ తాగుతారు. దానికంటే పాలు తీసుకుంటే మీ శరీరానికి మంచిది. కండరానికి బలం చేకూరి.. కొవ్వు తగ్గుతుంది.
పాలు ఎంచుకునే విషయంలో జాగ్రత్త
బరువు తగ్గాలనే సమయంలో కేలరీలు తగ్గించడం చాలా ముఖ్యం. కానీ శరీరానికి అవసరమైన కేలరీలు మాత్రం కచ్చితంగా అందివ్వాలని నిపుణులు చెప్తున్నారు. కొందరు బరువు తగ్గాలని పూర్తిగా కేలరీలు తగ్గించేస్తారు. ఇది చాలా తప్పని హెచ్చరిస్తున్నారు. అయితే పాలు తీసుకునే సమయంలో కేలరీలు గురించి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కేలరీలు తక్కువగా ఉండే పాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
బాదం పాలు వద్దు..
డైరీ మిల్క్‌ని ఎంచుకునే సమయంలో కొవ్వులేని పాలు తీసుకోండి. డైరీ ఉండకూడదనుకుంటే సోయా పాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు. ఇవి ప్రోటీన్‌తో నిండి ఉంటాయి కాబట్టి.. బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. బాదం పాలు ఆరోగ్యానికి మంచివే అయినా.. వాటిని తాగిన వెంటనే ఆకలి వేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు బాదం పాలు తీసుకోవడం అవాయిడ్ చేస్తే మంచిది.
బరువు తగ్గాలనుకునేవారు ఏ రకమైన పాలను ఎంచుకున్నా సరే.. దానిని మితంగా తాగాలి. బరువును తగ్గిస్తాది కదా అని ఎక్కువ తాగకూడదు. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి దానిని ఇతర పానీయాలతో భర్తీ చేయకుండా.. నీరు బాగా తాగండి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయం చేస్తుంది. బరువు తగ్గడానికే కాకుండా.. ఆరోగ్యానికి కూడా మంచిది.
Also Read : 'టీ'ని మళ్లీ మళ్లీ వేడిచేసి తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!