Mental Health in 2025 : మానసిక ఆరోగ్యంపై అవగాహన, నిర్వహణలో 2025 ఒక కీలక మలుపుగా చెప్తున్నారు ఎందుకంటే ఇండియాలో ఒకప్పుడు మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టలేదని.. ఇప్పుడిప్పుడే దానిపై అవగాహన పెరుగుతుందని చెప్తున్నారు నిపుణులు. మెంటల్ హెల్త్‌పై మారుతున్న వైఖరి, చికిత్సలు, భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మార్పులకు 2025 వేదికగా మారింది. దీనిలో సాధించిన విజయాలు, ఆందోళన కలిగించే కొత్త అంశాలు ఏంటో చూసేద్దాం.
మానసిక ఆరోగ్యంలో ప్రధాన విజయాలు
2025లో మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెరిగింది. ఒత్తిడి, ఆందోళన, బర్న్‌అవుట్, భావోద్వేగ అలసటతో తమ కష్టాలను పంచుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. పాఠశాలలు, ఆఫీస్‌లు, కమ్యూనిటీ సంస్థలు.. మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పిస్తున్నాయి. కౌన్సెలింగ్ సేవలు కూడా అందిస్తున్నాయి.
ఈ మార్పు నెమ్మదిగా ఉన్నప్పటికీ.. చాలా చోట్ల మాత్రం సక్సెస్‌ఫుల్‌గా జరుగుతుంది. మానసిక ఆరోగ్యం అనేది "వ్యక్తిగత బలహీనత" లేదా వ్యక్తిగత సమస్య కాదని, శారీరక దృఢత్వంతో పాటు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన రంగమని అందరూ గ్రహించేలా చేసింది. డిజిటల్ థెరపీ, టెలికన్సల్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా వృత్తిపరమైన సహాయాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఒత్తిడి క్లినికల్ లెవెల్‌కి వెళ్లకుండా.. ఆందోళన లేదా డిప్రెషన్‌గా మారడానికి ముందే ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశాన్ని ఇచ్చింది.
2025లో ఎదుర్కోన్న సవాళ్లు
ఓ రకంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరిగినప్పటికీ.. కొందరు మగవారు, వృద్ధులు ముందుకు రాలేకపోతున్నారు. తమని జడ్జ్ చేస్తారని, ఎమోషనల్ అనే ముద్ర పడతారనే భయంతో సహాయం తీసుకోవడం లేదు. అలాగే ఈ ఏడాది పట్టణాల్లో బర్న్‌అవుట్ ఆందోళనకరమైన స్థాయికి చేరుకుంది. వర్కింగ్ హవర్స్ పెరగడం, డిజిటల్ ఓవర్‌లోడ్, ఆందోళన, నిద్ర సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలుగా మారాయి. "హస్టిల్" ఒత్తిడి యువతను ఎక్కువగా ప్రభావితం చేసింది. బాడీ షేమింగ్ వల్ల కూడా డిప్రెషన్ పెరుగుతున్నాయని పరిశోధకులు నివేదించారు.
2026 ఎలా ఉండబోతుందంటే..
2026 సంవత్సరం మానసిక ఆరోగ్య పరిశ్రమను ప్రభావితం చేస్తున్న అనేక కొత్త వాస్తవాలను పరిచయం చేస్తుంది. ఆహారం, వ్యాయామంతో పాటు జీవనశైలి ప్రణాళికలో.. మానసిక సంరక్షణకు పునాది వేస్తుంది. కుటుంబాలు చికిత్స తీసుకోవడాన్ని నార్మల్ చేయనున్నాయి. మానసిక ఆరోగ్యం ఒక అవసరమైన విషయంగా మారింది. కాబట్టి.. ప్రతి వ్యక్తి తమ దైనందిన జీవితంలో మానసిక ఆరోగ్యం పరిగణించాల్సిన విషయంగా మారింది. కాబట్టి ఇది మరి కొందరు తమ మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్‌గా చర్చించగలిగే వేదికగా నిలుస్తుందని చెప్తున్నారు నిపుణులు.