Legal Support for Men in India : మగవారు ఏడ్వకూడదని.. అబ్బాయి అంటేనే స్ట్రాంగ్​ అనే నేపథ్యంలో సొసైటీ ఉంది. అందుకే మగవారి మానసిక పరిస్థితిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. తమకి సమస్య ఉందని గుర్తించి.. ఎదుటి వ్యక్తితో దానిని పంచుకున్నా పెద్ద రిజల్ట్స్ ఉండవు. కానీ రీసెంట్ స్టడీలు ఏమి చెప్తున్నాయంటే.. మగవారిలో కూడా సెన్సిటివిటీ పెరుగుతుందట. వివిధ సమస్యలతో వారు మానసికంగా చితికిపోతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. 

మగవారు మానసికంగా ఎంతగా సఫర్ అవుతున్నారంటే.. కొన్ని దేశాల్లో మహిళల కంటే మగవారే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారట. ఇండియాలో 70 శాతం సూసైడ్ డెత్స్ ఉంటున్నాయని NCRB నివేదించింది. చాలామంది మగవారు వివిధ కారణాల వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించారు. ఈ సమస్యలతోనే ఆల్కహాల్, డ్రగ్స్​కి బానిసలవుతున్నట్లు తెలిపారు. 

పురుషుల బాధలు, వారి మానసిక సంఘర్షణలు విస్మరించడం కాదు.. దాని గురించి చర్చించాల్సిన సమయం ఇదే. ఈ విషయాన్ని గుర్తిస్తూ భారతదేశంలో మగవారికోసం కొన్ని హెల్ప్​లైన్లు, ఫౌండేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. తప్పుడు ఆరోపణలు, మానసిక ఇబ్బందులు, చట్టపరమైన వేధింపులు ఎదుర్కొనేవారికి ఇవి హెల్ప్ చేస్తాయి. మరి ఇండియాలో అందుబాటులో ఉన్న నెంబర్లు, ఫౌండేషన్లు ఏంటో.. అవి చేసే హెల్ప్ ఏమిటో చూసేద్దాం. 

SIF ఫౌండేషన్

సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే సంస్థ మగవారికోసం పని చేస్తుంది. వరకట్న వేధింపులంటూ, గృహ హింస వంటి తప్పుడు కేసులపై ఇది మగవారికి హెల్ప్ చేస్తుంది. లీగల్​గా వారి సమస్యలు దూరం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వారి వెబ్​సైట్ : saveindianfamily.org, ఫ్రీ హెల్ప్​ లైన్ నెంబర్ : +91-8882498498. మీరు వీటికి కాల్ లేదా మెయిల్ చేసి మీ సమస్యల గురించి చర్చించవచ్చు. 

Men Welfare Trust

మగవారికి లీగల్ అడ్వైస్ ఇవ్వడానికి, మానసిక ఆరోగ్యంపై అవగాహన ఇస్తూ.. సపోర్ట్ చేసే గ్రూప్స్ Men Welfare Trustలో ఉంటాయి. మీరు వీరికి menwelfare.in అనే వెబ్​సైట్ ద్వారా కాంటాక్ట్ అవ్వొచ్చు. 

వాస్తవ్ ఫౌండేషన్

వాస్తవ్ ఫౌండేషన్​ మగవారి హక్కులపై పోరాడుతోంది. 498 A, విడాకులు, కౌన్సిలింగ్ వంటి అంశాలపై ప్రధానంగా పనిచేస్తుంది. హెల్ప్​లైన్ నెంబర్ : +91-9820400165 లేదా vaatav.org వెబ్​సైట్ ద్వారా మీరు కాంటాక్​ట్ అవ్వొచ్చు. 

సహోదర్ ట్రస్ట్..

మగవారికి సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ముందుకు వెళ్తోంది. ఈ ట్రస్ట్​లో మగవారి హక్కులకు సంబంధించిన లీగల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. ఈమెయిల్ : info@sahodar.in వెబ్ సైట్ : sahodar.in ద్వారా మీరు వారి సపోర్ట్ పొందవచ్చు. 

మానసికంగా, లీగల్​గా, ఎమోషనల్ ట్రోమాలో ఉన్న మగవారు ఈ హెల్ప్​లైన్​, ట్రస్ట్​లను ఆశ్రయించవచ్చు. మీ తప్పేమి లేకుంటే వీటి ద్వారా మీరు న్యాయపరంగా గెలిచే అవకాశముంది. కాబట్టి.. మీలో మీరు కృంగిపోకుండా కాస్త ధైర్యం తెచ్చుకుని వీరిని కాంటాక్ట్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. హెల్ప్ అడగడం అంటే తప్పేమి కాదు.. అలా అడిగే ధైర్యం కూడా అందరిలో ఉండాలి.