Brahmamudi Serial Today Episode:  స్వప్న నెక్లెస్ మార్చి రోల్డ్‌ గోల్డ్‌ నెక్లెస్‌ పెడతాడు రాహుల్‌. అప్పుడే స్పప్న రూంలోకి వస్తుంది. రాహుల్ ను చూసి అనుమానిస్తుంది. తనను చూసి ఎందుకు టెన్షన్‌ పడుతున్నాడు అని డౌటుగా తన నగలన్నీ చెక్ చేసుకుంటుంది.

స్వప్న:  మళ్లీ ఏం తప్పు చేశావు

రాహుల్:  చీచీ నేనేం చేస్తాను..?

స్వప్న: అన్ని కరెక్టుగానే ఉన్నాయి

రాహుల్:  అంటే నీ నగలు కొట్టేయడానికి వచ్చాను అనుకుంటున్నావా..?

స్వప్న: అని నేను ఎక్కడ అన్నాను

రాహుల్‌: అనాల్సిన అవసరం లేదు.. నువ్వు రాగానే నగలు చెక్ చేసుకుంటున్నావు కదా అయినా నన్ను అనుమానించడానికి నీకు మనసు ఎలా వచ్చింది..?

స్వప్న:  నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు కాబట్టి అనుమానిస్తున్నాను.

రాహుల్:  సిటీ మొత్తం తిరిగి నీకోసం ఒకటి తీసుకొచ్చాను

 పూలు చూపిస్తాడు రాహుల్‌.

స్వప్న: ఇవి నిజంగా నా కోసమే తీసుకొచ్చావా..? వేరే వాళ్లకు తీసుకొచ్చి మిగిలిపోయినవి నాకోసం తీసుకొచ్చావా..?

అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి హాల్లో రాజ్‌ కోసం ఎదురు చూస్తుంటారు.

ప్రకాష్‌: ఎందుకు వదిన టెన్షన్‌ పడతావు.  రాజ్‌ తప్పకుండా వస్తాడు. ముందు వచ్చి ఇలా కూర్చుని కావ్య పెట్టిన వేడి వేడి కాఫీ తాగు

అపర్ణ:  నీకేం బాబు అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉంటావు. కానీ నా పరిస్తితి అలా కాదు కదా

ప్రకాష్‌:  అలా అస్తమానం మర్చిపోతానని నా మీద నిందలు వేయకండి వదిన.. రాజ్‌ ఇక్కడికి వచ్చి యామిని పెళ్లి విషయం మాట్లాడతాడు అంతే కదా

అపర్ణ, ఇందిరాదేవి, సుభాష్‌ తలలు పట్టుకుంటారు.

ప్రకాష్‌: ఏంటి అందరూ అలా తలలు పట్టుకున్నారు. రాజ్‌ పెళ్లి విషయం మాట్లాడటానికి రావడం లేదా..? ఏదైనా ఫ్రోగ్రాం మారిందా

అపర్ణ:  నీలాంటొడు ఒక్కడు చాలు నా కొడుకు గతం మర్చిపోవడానికి.. నీ మతిమరుపు కలిసి దగ్గరుండి యామిని పెళ్లి కూడా చేసేస్తావు

ఇందిరాదేవి: రాజ్‌ వస్తుంది యామిని పెళ్లి విషయం మాట్లాడటానికి కాదు.. కావ్య ప్రేమ విషయం మాట్లాడటానికి

రాజ్‌ వస్తాడు. వెనకాలే పంతులు వస్తుంటాడు.

ఇందిరాదేవి: వీడేంటి పంతులును తీసుకొస్తున్నాడు.. కొంపదీసి వీడికి కూడా ప్రకాషం లాగా మతిమరుపు వచ్చిందా ఏంటి..?

అపర్ణ: నాకు కూడా అదే అనుమానంగా ఉంది అత్తయ్యా వీడు ప్రేమ విషయం చెప్పడానికి వచ్చాడా..? లేక పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి వస్తున్నాడా..?

ఇందిరాదేవి: ఓరేయ్‌ ఎందుకురా పంతులును వెంబడి తీసుకొచ్చావు..?

రాజ్‌: అయ్యో నాన్నమ్మ నాకు ఆ పంతులుకు ఏ సంబంధం లేదు.

ఇందిరాదేవి: మరి ఎవరు పిలిపించారు..?

ధాన్యం: నేనే పిలిపించాను

అప్పు: అత్తయ్యా నేను  స్టేషన్‌కు వెళ్తున్నాను.

ధాన్యలక్ష్మీ:   హలో మీ కోసం పంతులును పిలిపిస్తే నువ్వు వెళ్తానంటావేంటి..?

కల్యాణ్‌: మాకోసమా

ధాన్యం: అవును మీ ఇద్దరి శోభనానికి ఈ రోజు ముహూర్తం పెట్టమని పంతులు గారికి చెప్పాను (అందరూ షాక్‌ అవుతారు.) పంతులు గారు మీరు  ముహూర్తం చూడండి.

పంతులు: (పంచాంగం చూసి) ఈరోజు రాత్రి 11 గంటలకు మంచి ముహూర్తం ఉంది.

ధాన్యలక్ష్మీ:  అదే కాయం చేయండి

కళ్యాణ్‌:  అమ్మా ఒక్క నిమిషం.. మేము చెప్పేది వింటావా..?

ధాన్యలక్ష్మీ: ఇక ఏదీ మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పటి వరకు మీరు చెప్పింది విన్నాను.. ఈ రోజు మాత్రం ఆ ముహూర్తానికి మీ శోభనం జరగాల్సిందే.. ఇదే ఫైనల్‌..

రాజ్‌: ఎస్‌ ఇదే ఫైనల్‌.. పిన్ని గారు చెప్పాక ఇక అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇదే ఫైనల్‌.. కళావతి గారు మీరు నాతో వచ్చారంటే శోభనానికి  కావాల్సిన లిస్ట్‌ అంతా పైనల్ చేద్దాం

ఇందిరాదేవి: ఓరేయ్‌ దానికంటే ముందు మేము నీతో ఒక విషయం మాట్లాడాలి ఇటురా..?

రాజ్‌: నాన్నమ్మ అది

అపర్ణ, ఇందిరాదేవి  రాజ్‌ను పక్కకు లాక్కెళ్లతారు. నువ్వు ఇవాళ చేయాల్సిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి అంటూ తిడతారు. దీంతో శోభనం రూం డెకరేషన్‌ పూర్తి అయ్యే లోపు కావ్యకు ప్రపోజ్‌ చేస్తాను అంటూ రాజ్‌ వెళ్లిపోతాడు. తర్వాత రుద్రాణి, యామినికి ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ను మళ్లీ ఇక్కడకు ఎందుకు పంపించావు అంటూ తిడుతుంది. అయితే తన ప్లాన్‌ తనకు ఉందని యామిని చెప్తుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

  

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!