Dark Mehndi Colour Tips : పెళ్లిళ్లు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో చాలామంది అమ్మాయిలు, మహిళలు చేతులకు మెహందీ పెట్టుకుంటారు. దీపావళి సమయంలో కూడా చాలామంది రకరకాల మెహందీ డిజైన్స్ వేసుకుంటారు. అందమైన డిజైన్‌తో పాటు మెహందీ రంగు ముదురు మెరూన్ లేదా గోధుమ రంగులో వస్తే చేతులు మరింత అందంగా కనిపిస్తాయి. మరి మెహందీ రంగు ముదురుగా రావాలంటే ఏలాంటి చిట్కాలు ఫాలో అవ్వాలో చూసేద్దాం.

Continues below advertisement

మెహందీ పెట్టుకునే ముందు 

మెహందీ పెట్టుకునే ముందు చేతులపై ఉన్న మురికి, నూనె, క్రీములను పూర్తిగా తొలగించడం మంచిది. చేతులను శుభ్రంగా కడుక్కొని, బాగా ఆరిన తర్వాత మెహందీ పెట్టుకోండి. చేతులపై లోషన్ లేదా నూనె ఉంటే హెన్నా రంగు చర్మానికి సరిగ్గా పండకపోవచ్చు.

Also Read : మెహందీ పెట్టుకుంటున్నారా? రంగు ముదురుగా మారి ఎర్రగా పండాలంటే ఈ చిట్కాలు పాటించండి

Continues below advertisement

తాజా, నాణ్యమైన హెన్నా

మెహందీ రంగు ఎలా వస్తుందనేది ఉపయోగించే హెన్నా నాణ్యతపై కూడా ఆధారపడి ఉంటుంది. సాధ్యమైనంత వరకు తాజా, స్వచ్ఛమైన హెన్నా పౌడర్‌ను ఉపయోగించండి. పాత హెన్నా లేదా ఎక్కువ కెమికల్స్ కలిపిన ఉత్పత్తులు మంచి రంగును ఇవ్వకపోవచ్చు.చాలా ముదురు లేదా నల్లగా కనిపించే బ్లాక్ హెన్నాలో కొన్ని రకాల రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇవి కొందరిలో స్కిన్ అలర్జీ లేదా ఇతర సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి మెహందీ కొనే ముందు మంచిది చెక్ చేసుకోవాలి.

వెంటనే తీసేయకండి

మెహందీ పెట్టుకుని.. వెంటనే తీసేయడం వల్ల రంగు సరిగ్గా పట్టకపోవచ్చు. పేస్ట్ పూర్తిగా ఆరే వరకు, వీలైతే కొన్ని గంటల పాటు చేతులపై అలాగే ఉంచడం మంచిది. ఆరిపోయిన తర్వాత నీటితో కడగకుండా మెల్లగా గీకి తీస్తే బెటర్.

Also Read : జుట్టుకు హెన్నా అప్లై చేయకూడదా? నిపుణులు ఎందుకు నో చెప్తున్నారు.. బ్లాక్ హెన్నాతో కలిగే ఇబ్బందులు ఇవే

నిమ్మరసం, షుగర్​తో..

మెహందీ కొద్దిగా ఆరిన తర్వాత కొందరు నిమ్మరసం-చక్కెర మిశ్రమాన్ని తేలికగా అప్లై చేస్తుంటారు. ఇది మెహందీ పేస్ట్ కొంతసేపు చేతులకు అంటుకుని ఉండటానికి సహాయపడుతుంది. దీనివల్ల రంగు ముదురుగా రావచ్చు. 

వెంటనే చేతులు కడగకండి..

మెహందీని గీకి తీసిన వెంటనే సబ్బుతో చేతులు కడుక్కోవడం కంటే కొంత సమయం నీటికి దూరంగా ఉంచడం మంచిది. హెన్నా రంగు వెంటనే పూర్తిగా ముదురుగా కనిపించకపోవచ్చు. సాధారణంగా రంగు కొన్ని గంటల్లో మరింత ముదురుతుంది.

Also Read : జుట్టుకు హెన్నా అప్లై చేసేముందు చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్

నూనె రాయండి

మెహందీ తీసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె లేదా ఇతర సున్నితమైన నూనెను చేతులకు రాయవచ్చు. ఇది చర్మం పొడిబారకుండా ఉండటానికి సహాయపడుతుంది. అయితే రంగు ముదురుతుందని చెప్పి ఎక్కువగా నూనె రాయాల్సిన అవసరం లేదు.

లవంగాల పొగతో రంగు ముదురుతుందా?

మెహందీ రంగును ముదురుగా చేయడానికి లవంగాల పొగను ఉపయోగించే పద్ధతి కూడా కొందరు ఫాలో అవుతారు. అయితే వేడి బాణలి లేదా పొగకు చేతులను మరీ దగ్గరగా పెట్టడం మంచిది కాదు. దీనివల్ల చర్మం కాలే అవకాశం ఉంటుంది. 

Also Read : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు