ఔను, మీరు చదివింది నిజమే. ‘అక్కడ’ ఉండాల్సిన మర్మాంగం అతడి చేతికి వేలాడుతోంది. ఒకటి కాదు రెండు కాదు.. గత ఆరేళ్లుగా అతడు అలాగే జీవిస్తున్నాడు. వైద్యులే స్వయంగా అతడి చేతికి అంగాన్ని కుట్టేశారు. అయితే, ఇదేదో పొరపాటున చేయలేదు. అతడి మేలు కోసమే చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో మరే వ్యక్తికి చేయని అరుదైన శస్త్ర చికిత్సను అతడికి అందించారు. కానీ, మూత్ర ద్వారం వద్ద ఉండాల్సిన అంగాన్ని, చేతికి కుట్టేస్తే ఏం లాభం? అది దేనికి పనికి వస్తుందనేగా మీ సందేహం? అక్కడే ఉంది ట్విస్ట్.
ఇంగ్లాండులోని నార్ఫోల్క్‌లో నివసిస్తున్న మాల్కోలమ్ మెక్‌డోనాల్డ్(47) ఓ రోజు టాయిలెట్‌లో పడిపోయాడు. దీంతో అతడి అంగం నలిగిపోయింది. పెరినియం ఇన్ఫెక్షన్ సోకడం వల్ల అతడి అంగం నల్లగా మారిపోయి కుళ్లిన స్థితికి చేరుకుంది. 2014లో అతడికి వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. అంగాన్ని తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. దీంతో అతడికి గుండె జారినంత పనైంది. ఈ విషయం తెలిసి అతడి భార్య పిల్లలతో సహా అతడిని వదిలేసి వెళ్లిపోయింది. దయనీయ స్థితిలో ఉన్న అతడికి ప్రొఫెసర్ డెవిడ్ రాల్ఫ్ దేవుడిలా కనిపించాడు.
విరిగిన, ఊడిన మర్మాంగాలకు మరమ్మత్తులు చేయడంలో రాల్ఫ్ నేర్పరి. కొద్ది రోజులు మాల్కోలమ్ పరిస్థితిని గమనించి.. అది పూర్తిగా కుళ్లిపోయే లోపే తొలగించాలని, లేకపోతే ఇన్ఫెక్షన్ ఇతర భాగాలకు సోకే ప్రమాదం ఉందని చెప్పారు. అయితే, తీసేసిన అంగాన్ని మళ్లీ అతికిస్తామని, ఆందోళన చెందవద్దని అతడికి భరోసా ఇచ్చారు. అయితే, వారు దాన్ని అతికించిన ప్లేస్ మాత్రం వేరు.
అంగాన్ని తిరిగి అతికిస్తామని రాల్ఫ్ చెప్పిన వెంటనే అతడు చాలా సంతోషించాడు. కానీ, దాన్ని చేతికి అతికించనున్నామని చెప్పగానే షాకయ్యాడు. నవ్వాలో.. ఏడ్వాలో తెలియని పరిస్థితి. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో చెప్పిన తర్వాత అతడు కాస్త లైట్‌గా ఊపిరి పీల్చుకున్నాడు. ఎందుకంటే.. ఇప్పటివరకు వైద్యులు అలాంటి చికిత్స చేయలేదు. అది సక్సెస్ అవుతుందో లేదో కూడా తెలీదు. అందుకే, మాల్కోలమ్ సంతోషంగా ఉండలేకపోయాడు.
చేతికి ఎందుకు అతికించారు?: ఇన్ఫెక్షన్ వల్ల మాల్కోలమ్ అంగంపై ఉన్న చర్మం పూర్తిగా పనికి రాకుండా పోయింది. కేవలం కండరాలు మాత్రమే మిగిలాయి. అందుకే, వైద్యులు సెలైన్ వ్యవస్థతో అంగాన్ని తయారు చేశారు. ఇందుకు అతడి చేయ్యి, తొడ నుంచి సేకరించిన చర్మాన్ని ఉపయోగించారు. అలా తయారు చేసిన అంగాన్ని 2016లో అతడి ఎడమ చేయికి అమర్చారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కనిపించాలని చెప్పారు.
Also Read: భూమి తిరగడం ఆగిపోతే అంత భయానకంగా ఉంటుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన ఖగోళ శాస్త్రవేత్త
అనివార్య కారణాల వల్ల అతడికి శస్త్ర చికిత్స ఆలస్యమైంది. ఆ తర్వాత కోవిడ్-19 వచ్చింది. అలా అతడు సుమారు ఆరేళ్లుగా చేతికి వేలాడుతున్న అంగంతో తిరుగుతున్నాడు. అయితే, అది సాధారణ అంగంలా పనిచేయదు. అందులో హ్యాండ్ పంప్ ఉంటుంది. చిన్న ట్యాంక్‌లో సెలైన్ ఉంటుంది. పంప్ నొక్కినప్పుడు అంగంలోని ట్యూబ్‌లోకి సెలైన్ వెళ్లి.. అంగస్థంభన జరుగుతుంది. అంటే, అంగాన్ని అతికించిన తర్వాత ఎప్పటిలాగానే అంగం నుంచి మూత్రం పోయవచ్చు. శృంగారంలో కూడా పాల్గోవచ్చు. ఎట్టకేలకు వైద్యులు అతడి చేతికి ఉన్న అంగాన్ని తొలగించారు. దాన్ని అతడి కాళ్ల మధ్యలో అమర్చారు. ఇప్పుడు అతడు మళ్లీ తన మగతనాన్ని పొందాడు. కానీ, సాధారణ పురుషులకు ఉండే అంగానికి, దానికి ఎంతో తేడా ఉంటుంది. ఇది దాదాపు చర్మంతో తయారైన కృత్రిమ అంగం.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?