చాలా మందికి లక్కీ నెంబర్ ఉంటుంది. మరి కొంతమంది తమ పుట్టిన తేదీలు, పిల్లల పుట్టిన తేదీలు ఇష్టంగా తమకి కలిసొచ్చే నెంబర్స్ అనుకుంటారు. అలా అతడు కూడా తన పుట్టిన నెల, సంవత్సరం లక్కీ అనుకున్నాడు. అతడు అనుకున్నట్టే అది నిజమయ్యింది. అతడి లక్ ఫలించి.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 కోట్లు గెలుచుకున్నాడు. అదెలా.. అని ఆశ్చర్యపోతున్నారా? ఇదిగో ఇలా.


లాటరీ అంటే నిజంగా లక్ ఉండాలి. మనం కొన్న నెంబర్ కి లాటరీ తగలడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి లక్ ఇతగాడి వశమైంది. అలెగ్జాండ్రియాకు చెందిన అలీ అనే వ్యక్తి సెప్టెంబర్ 6న వర్జినియాలోని ఓ దుకాణం దగ్గర లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఆ లాటరీలో గెలిస్తే $1 మిలియన్ గెలుచుకోవచ్చు. అతను ఒక లాటరీ టికెట్ కొని సరిపెట్టుకోలేదు. ఒకేసారి 200 టికెట్లను కొనుగోలు చేశాడు. ఆ లాటరీ టికెట్లు అతనికి జాక్ పాట్ తెచ్చిపెట్టాయి. ఊహించని విధంగా అతనికి ఆ లాటరీ ద్వారా ఏకంగా రూ.8.1 కోట్లు వచ్చాయి. అలీ కొనుగోలు చేసిన టికెట్లన్నింటిలో 0-2-6-5 సంఖ్యలే ఉన్నాయి. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే అవి అతని పుట్టిన నెల, సంవత్సరం అని లాటరీ అధికారులు తెలిపారు. లాటరీ డ్రా తీయగా అతనికి $5000 విలువైన 200 టాప్ ప్రైజెస్ వచ్చాయి. వాటి విలువ సుమారు రూ.8 కోట్లు ఉంటుంది.


ఇంకేముంది అన్నీ టికెట్లు కొన్నందుకు అతను ప్రస్తుతం తెగ సంతోషపడిపోతున్నాడు. తను కొన్న లాటరీ టికెట్లు తనకి అదృష్టం తెచ్చి పెట్టాయని ఉబ్బితబ్బిబవుతున్నాడు. చాలా మందికి లాటరీ టికెట్లు కొనడం అంటే పిచ్చి. కొన్నేళ్లుగా వాటి మీద డబ్బులు తగలేస్తారు. అదృష్టం వరించకపోతుందా అని కొన్ని సంవత్సరాల పాటు ఎదురు చూస్తారు. అలా ఇటీవల మిస్సోరి కి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా ఇలాగే ఎదురు చూశారు. దాదాపు 30 సంవత్సరాల పాటు తమకి ఎంతగానో అచ్చోచ్చిన నెంబర్ తీసుకుంటూ ఉన్నారు. వారికి అదృష్టం కలిసి రాకపోదా అని ఒకటి కాదు రెండు కాదు ముప్పై సంవత్సరాల పాటు ఎదురు చూశారు. వారి ఎదురు చూపులు ఫలించాయి.


ఒకరోజు గ్యాస్ సెంటర్లో ఆ ఇద్దరు మళ్ళీ తమకి ఇష్టమైన నెంబర్లతోనే లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. డ్రా తీసిన దాంట్లో నాలుగు నెంబర్లు వీరి లాటరీతో కలిశాయి. ఇంకేముందు వారి ఎదురు చూపులు ఫలించాయి. కొన్నేళ్ళ పాటు వాళ్ళు ఎదురు చూసిన దానికి ప్రతిఫలం దక్కింది. డ్రా తీసిన దాంట్లో నాలుగు నెంబర్లు కలవడంతో 50 వేల డాలర్ల విలువైన బహుమతిని వాళ్ళు గెలుచుకున్నారు. అంటే మన కరెన్సీలో రూ.39 లక్షలు గెలుచుకున్నారన్న మాట. వారి ఎదురు చూపులు ఫలించినందుకు తెగ సంబరపడిపోయారు. 


Also Read: డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?


Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు