మాల్పువా స్వీటు చూడగానే నోరూరేలా ఉంటుంది. దీన్ని చాలా మంది షాపుల నుంచి కొనితెచ్చుకుంటారు కానీ ఇంట్లో చేసుకునేందుకు ఇష్టపడరు. మాల్పువా చేయడం చాలా కష్టం అనుకుంటారు. నిజానికి దీన్ని చేయడం చాలా సులువు. ఎలా చేయాలో కింద వివరించాం. దీన్ని చదివితే మీరు ఇట్టే మాల్పువా చేసేస్తారు.
కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
బేకింగ్ సోడా - చిటికెడు
పెరుగు - రెండు స్పూన్లు
నెయ్యి - రెండు స్పూనులు
యాలకుల పొడి - పాలు స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
బాదం, పిస్తా, జీడిపప్పులు - గుప్పెడు
తయారీ ఇలా
1. ఒక గిన్నెలో గోధుమ పిండి ఉండల్లేకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి.
2. పిండిలో రెండు స్పూన్ల చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు వేసి బాగా కలపాలి.
3. నీళ్లు పోసి బాగా కలపాలి. జారుడుగా అయ్యే కలుపుకోవాలి. పెనంపై అట్లు పోయడానికి ఎంత జారుడు కావాలో, అంతే ఇక్కడా ఉండాలి.
4. అలా కలుపుకున్నాక ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టాలి.
5. ఇప్పుడు వేరే గిన్నెలో నీళ్లు, పంచదార పోసి పాకం తీయాలి. అందులో యాలకుల పొడి కూడా కలిపి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి రుబ్బుని అట్టులా వేసి రెండు వైపులా బాగా కాల్చాలి. రంగు బంగారు వర్ణం వచ్చేలా కాల్చుకోవాలి.
7. ఆ కాల్చిన రొట్టెలను పంచదార పాకంలో వేయాలి. పాకాన్ని రొట్టెలు పీల్చుకుంటాయి. పైన జీడిపప్పులు, బాదం పప్పులు , పిస్తా రేకులు చల్లుకోవాలి. టేస్టీ మాల్పువా రెడీ అయినట్టే.
8. మీకు కావాలనుకుంటే కోవా ముద్దని మాల్పువా మధ్యలో పెట్టి ఫ్రాంకీలా మడతబెట్టి తినవచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది.
Also read: ఇలాంటి పెళ్లి చూసుండరు, పాములనే పూల దండల్లా భావిస్తూ పెళ్లి చేసుకున్న జంట, పాత వీడియో వైరల్
Also read: ఇరాక్‌ను వణికిస్తున్న వింత జ్వరం, జంతువుల ద్వారా సోకుతున్న వైరస్