Male Condom vs Female Condom : లైంగిక జీవితం సురక్షితంగా లేకుంటే.. STI, HIV, STD వంటి రోగాలు వ్యాపిస్తాయి. అందుకే ప్రభుత్వం కూడా కండోమ్స్ ఉపయోగించాలనే ప్రకటనలు చేస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ వద్దు అనుకునేవారు కూడా వీటిని ఉపయోగిస్తారు. అయితే కండోమ్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి మగవారు ఉపయోగించేందుకు.. రెండు ఆడవారికి. అయితే ఈ రెండిటిలో ఏవి ప్రభావవంతంగా ఉంటాయి. నిపుణులు ఏమంటున్నారో చూసేద్దాం.
మేల్ కండోమ్.. ఫీమేల్ కండోమ్
కండోమ్ మగవారు ఉపయోగిస్తే ప్రభావంతంగా ఉంటుందా? ఆడవారు ఉయోగిస్తే ఎక్కువ ఎఫెక్టివ్‌గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మగవారు ఉపయోగించే నిరోధ్‌లు లాటెక్స్ లేదా పాలియురేతేన్‌తో తయారు చేస్తారు. ఇది లైంగిక సమయంలో పురుషాంగంపై ధరిస్తారు. అలాగే ఫీమేల్ కండోమ్ యోనిలో ముందుగానే ఉంచుతారు. దీనిని పాలియురేతేన్ లేదా నైట్రైల్తో తయారు చేస్తారు.
కండోమ్ మగవారు ధరిస్తే సేఫా? ఆడవారు వేసుకుంటే మంచిదా?
మగవారు కండోమ్ సరైన పద్ధతిలో ఉపయోగిస్తే గర్భధారణను 98 శాతం నివారించవచ్చని శాస్త్రీయంగా చెప్తున్నారు. కాస్త తప్పుగా అటు, ఇటుగా వేసుకుంటే 85 శాతం వరకు ప్రెగ్నెన్సీ నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పైగా ఇవి సులభంగా అందుబాటులో ఉంటాయి. తక్కువ ఖర్చు. లైంగిక వ్యాధులు సంక్రమించకుండా మంచి రక్షణ ఇస్తాయి.
ఫిమేల్ కండోమస్ 95 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటాయి. సాధారణ వినియోగంలో 79-82 శాతం ఎఫెక్టివ్‌గా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే లైంగిక చర్యకు ముందే వీటిని పెట్టుకోవచ్చు. దీనిపై మహిళకు పూర్తి నియంత్రణ ఉంటుంది. లాటెక్స్ అలెర్జీ ఉండేవారికి మంచి ఆప్షన్‌గా చెప్తున్నారు.
వీటిలో ఏది మంచిది?
గైనకాలజిస్ట్ డాక్టర్ అనితా శర్మ ప్రకారం.. మగవారు కండోమ్ సరిగ్గా వాడితే అది గోల్డ్ స్టాండర్డ్ అని.. ఆడవారికి కంట్రోల్ అవసరమైతే ఫీమేల్ కండోమ్ మంచిదని చెప్తున్నారు. అయితే రెండింటిలో ఏది మంచిది అనే దానికన్నా.. ఏది సరిగ్గా వాడాలో తెలుసుకోవాలంటున్నారు. సరైన విధంగా వాడితే రెండూ మంచివేనని చెప్తున్నారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
