Whiskey Drinking Rules for Liver Safety : ఫ్రెండ్స్​తో ఉన్నప్పుడు లేదా పండుగల సమయంలో చాలామంది మందుబాబులు ఆల్కహాల్ తీసుకుంటారు. మరికొందరికి మందు తాగడానికి రీజనే అవసరం లేదు. అలా సిట్టింగ్ వేసినప్పుడు కొందరు బీర్ తాగితే మరికొందరు కిక్​ కోసం విస్కీ తాగుతారు. ఫ్రెండ్స్​తో మాట్లాడుకుంటూ విస్కీని ఎంజాయ్ చేసేవారు పెగ్​కి పెగ్​కి మధ్య కాస్త గ్యాప్ తీసుకుంటారు. కానీ కొందరు కక్కుర్తితో గ్యాప్​ లేకుండా విస్కీని గట గటా తాగేస్తూ ఉంటారు. 

విస్కీని తాగేప్పుడు అలా గ్యాప్​ లేకుండా తాగేస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ విషయాలు తెలుసుకోకపోతే మీ లివర్​ హెల్త్ మటాష్ అయిపోతుంది అంటున్నారు నిపుణులు. విస్కీని హెల్తీగా ఎంజాయ్ చేయాలనుకుంటే లిమిటెడ్​గా తీసుకోవడమే కాదు.. గ్యాప్ కూడా తీసుకోవాలంటున్నారు. ఇంతకీ పెగ్​కి పెగ్​కి మధ్య ఎంత తేడా ఉండాలో.. లేకుంటే లివర్​ ఏ విధంగా నష్టపోతుందో ఇప్పుడు చూద్దాం. 

లివర్​పై విస్కీ ప్రభావం.. 

ఆల్కహాల్ మితంగా కాకుండా ఎక్కువగా తాగితే లివర్ ఆరోగ్యం కచ్చితంగా దెబ్బతింటుంది. అయితే గ్యాప్​ లేకుండా వెంట వెంటనే పెగ్ తీసుకోవడం వల్ల దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే.. విస్కీని స్మాల్ పెగ్ (45మి.లీ) తీసుకుంటే.. దానిని ప్రాసెస్ చేయడానికి లివర్ దగ్గరగా గంట సమయం తీసుకుంటుంది. గ్యాప్ తీసుకోకుండా మరో పెగ్ తాగేస్తే లివర్ రెండు పెగ్​లను ప్రాసెస్ చేయడానికి మరింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కాలేయంపై ప్రభావం ఎక్కువ పడుతుంది. దీనివల్ల లివర్ సమస్యలు మరింత పెరుగుతాయి. 

లివర్ హెల్తీగా ఉండాలంటే కనీసం గంట కాకపోయినా అరగంట నుంచి 45 నిమిషాలు అయినా మరో పెగ్​ తీసుకోవడానికి గ్యాప్ ఇవ్వాలి. దీనివల్ల ఆల్కహాల్ ప్రాసెస్ అవ్వడం సులభమవుతుంది. మెటబాలీజం దెబ్బతినకుండా ఉంటుంది. ఒత్తిడి పెరగకుండా.. బ్లడ్​ ఫ్లోలో ఆల్కహాల్ శోషణ తక్కువ ఉండేలా చేస్తుంది. కాబట్టి విస్కీ తాగేప్పుడు కచ్చితంగా గ్యాప్ తీసుకోవాలని చెప్తున్నారు. 

గ్యాప్ మాత్రమే కాదు.. 

లివర్ హెల్తీగా ఉండాలంటే పెగ్​కి పెగ్​కి మధ్య గ్యాప్ తీసుకోవడమే కాదు.. దానిని తీసుకునే మోతాదును కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గ్యాప్ తీసుకోకుండా ఎక్కువసార్లు.. ఎక్కువ మోతాదులో విస్కీ తాగితే అది పూర్తి ఆరోగ్యంతో పాటు లివర్​ను తక్కువ సమయంలోనే డ్యామేజ్ చేస్తుంది. ఫ్యాటీ లివర్, హెపటైటిస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఆల్కహాల్ తీసుకునే మోతాదును తగ్గించుకోవాలి. వైద్యుల సూచనలు, సలహాలు ఫాలో అయితే మంచిది. ముఖ్యంగా మీకు ఆరోగ్య సమస్యలున్నప్పుడు కచ్చితంగా ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే కచ్చితంగా సలహాలు తీసుకోవాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మగవారు రోజుకు రెండు పెగ్​లు ఆడవారు అయితే ఒక పెగ్ తీసుకోవచ్చని తెలిపింది. అలాగే పెగ్​కి పెగ్​కి మధ్య నీటిని ఎక్కువ తీసుకుంటే హైడ్రేషన్ సమస్యలు రావు. ఆల్కహాల్ తీసుకునేప్పుడు లేదా ముందు అయినా ఆల్కహాల్ శరీరానికి అందకుండా ఉండేందుకు ఫుడ్ తీసుకోవాలి. దీనివల్ల లివర్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. లివర్​ హెల్త్​ కోసం ఆల్కహాల్​ని పూర్తిగా మానేస్తే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.