Leap Year 2024 : నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చే లీప్​ ఇయర్​ ఈ(2024) సంవత్సరం వచ్చింది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. అయితే లీప్ ఇయర్​లో మాత్రం ఈ నెలలో 29 రోజులు ఉంటాయి. దీనినే లీప్​డ్ అంటారు. ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి వస్తుంది. అయితే ఏదో అనుకుంటాము కానీ.. ఈ లీప్​ ఇయర్​ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి. అసలు లీప్​ ఇయర్​ని ఎందుకు చేసుకుంటాము? ప్రపంచవ్యాప్తంగా దీనిని ఏవిధంగా జరుపుకుంటారో? ఎప్పటినుంచి ఈ లీప్​ ఇయర్​ని ఫాలో అవుతున్నారో వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


సూర్యుని చుట్టూ భూమి తిరగడానికి 365.242190 రోజులు పడుతుంది. అయితే 365 రోజులకంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ఇది గ్రెగోరియన్ క్యాలెండర్​ను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా 44 నిమిషాలు ముందుగా సీజన్​లు ప్రారంభమయ్యేలా చేస్తుంది. కాబట్టి ఈ అదనపు రోజును ఫిబ్రవరికి జోడించారు. ఈ లీప్​ డే మన క్యాలెండర్​ను భూమి కక్ష్యతో సమతుల్యం చేస్తుంది. సీజన్​లు నుంచి బయటకు వెళ్లకుండా.. వార్షిక ఈవెంట్​లు, వాటి షెడ్యూల్​ను అనుకరించేలా చేస్తుంది. 


లీప్ డే 2024 (Leap Day 2024) చరిత్ర


ఈ లీప్​ ఎరా అనేది రోమన్ల కాలం నుంచి ప్రారంభమైనట్లు చరిత్ర చెప్తుంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక అదనపు రోజును జోడించడం అప్పుడే జరిగింది. అయితే ఈ అదనపు రోజు క్యాలెండర్​లో కొన్ని తప్పులకు దారి తీసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి గ్రెగోరియన్ క్యాలెండర్​ను ప్రవేశ పెట్టారు. ఈ క్యాలెండర్​ సూర్యుని చుట్టూ భూమి వాస్తవ కక్ష్యతో మరింత దగ్గరగా ఉండేలా చేసింది. దీనిలోనే లీప్​ డేని ప్రవేశపెట్టారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నాలుగు సంవత్సరాలకు లీప్ ఇయర్ వస్తుంది. ఈ లీప్​ ఇయర్​ వల్ల మిగిలిన సంవత్సరాలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా.. భూమి కక్ష్యకు తగ్గట్లు రూపొందించారు. 


కొన్ని ప్రాంతాల్లో ఈ లీప్​ డేని బ్యాచిలర్స్​ డే (Bachelor Day)గా జరుపుకుంటారు. కొందరు ఫిబ్రవరి 29న పుట్టినరోజు చేసుకుంటారు. ఇలాంటి వారు ఫన్నీగా తమ వయసును 4 సంవత్సరాలను ఏడాదిగా లెక్కేసి చెప్తారు. లీప్​డే రోజు పుట్టిన జరుపుకునేవారిని Leaplings or Leapers అంటారు. అయితే లీప్​ రోజు పుడితే మార్చి 1వ తేదీన లేదా ఫిబ్రవరి 28వ తేదీన కొందరు పుట్టినరోజులు జరుపుకుంటారు. మరికొందరు స్పెషల్​గా ఉండాలని.. ఫిబ్రవరి 29వ తేదీన డెలీవరి డేట్​ వచ్చేలా ప్లాన్ చేసుకుంటారు. సో తమ పిల్లలు స్పెషల్​గా ఫీల్ అవుతారని భావిస్తారు. పైగా లీప్​ డే పుట్టిన వారికి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. లీప్​డే రోజు కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకుంటారు. తమ స్పెషల్​ డే మరింత స్పెషల్​గా ఉండాలని చూస్తారు. మరికొందరు లీప్​ డో రోజు మంచిది కాదని భావిస్తారు. ఆ రోజు ఎలాంటి మంచిపనులు చేయరు. 


Also Read : మహిళలు రోజుకు ఇన్ని గంటలు కచ్చితంగా నిద్రపోవాలట.. లేదంటే అంతే