Lakshadweep Trip Complete Guide: సినీ తారలతో పాటు డబ్బున్న వాళ్లు సాధారణంగా మాల్దీవుల వెకేషన్ కు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లే పర్యాటకులలో ఎక్కువగా భారతీయులే ఉంటారు. ఆ ప్రాంతం పూర్తిగా పర్యాటకం మీదే ఆధారపడి మనుగడ కొనసాగిస్తోంది. గత కొంత కాలంగా మాల్దీవులు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ లక్షద్వీప్ లో ఫోటో షూట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు మోడీ టార్గెట్ గా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పలువురు సెలబ్రిటీలు బాయ్ కాట్ మాల్దీవ్స్ క్యాంపెయిన్ చేపట్టారు. ఈ దెబ్బతో పర్యాటకులు మాల్దీవుల పర్యటనను క్యాన్సిల్ చేసుకుని లక్షద్వీప్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అక్కడికి వెళ్లాలి అనుకున్న వాళ్లు ఫ్లైట్ టికెట్స్ తో పాటు హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.

  


లక్షద్వీప్‌ ఎక్కడ ఉంది?


లక్షద్వీప్ దీవులు భారతదేశంలోని అత్యంత అందమైన పర్యాటక ప్రాంతం. చక్కటి బీచ్ లు, చల్లని గాలులు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అరేబియా సముద్రంలో ఉంటుంది. సెలవులలో వెకేషన్ కు వెళ్లాలి అనుకునే వాళ్లు ఇక్కడికి వెళ్లవచ్చు. అదీ కూడా మాల్దీవుల కంటే తక్కువ ఖర్చుతో. భారతదేశంలోని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ ఒకటి. 1956లో ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించింది.


36 ద్వీపాల సముదాయం


లక్షద్వీప్ లో మొత్తం 36 దీవులు ఉంటాయి. వాటిలో 10 దీవులు మాత్రమే మానవ నివాసానికి అనుకూలంగా ఉంటాయి. మినీకాయ్ ద్వీపం, కల్పేని దీవులు, కద్మత్ దీవులు, గోల్డెన్ ద్వీపం, తిన్నకర ద్వీపం బాగా ఫేమస్.


లక్షద్వీప్‌కు ఎలా వెళ్లాలి?


కేరళలోని కొచ్చి నుంచి లక్షద్వీప్ కు వెళ్లవచ్చు. కొచ్చి నుంని లక్షద్వీప్‌కు విమానాలు, నౌకల్లో వెళ్లే అవకాశం ఉంది.  ఎయిర్ ఇండియా వారానికి ఆరు రోజులు లక్షద్వీప్‌కు విమానాలను నడుపుతోంది.


లక్షద్వీప్‌కు వెళ్లాలంటే ముందు కేరళలోని కొచ్చిన్ కు చేరుకోవాలి. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లక్షద్వీప్ అగట్టి ఐలాండ్ కు ఫ్లైట్ అవైలబుల్ ఉంటాయి. ఎంత ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాం.. ఏ వెబ్ సైట్స్ ఆర్ ఫ్లాట్ ఫామ్స్ నుంచి చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి రేట్స్ ఉంటాయి. తక్కువ రేట్ అయితే రూ.5 వేల నుంచి ఎక్కువ రేట్ అంటే రూ.10 వేల - రూ.15 వేల వరకూ వన్ సైడ్ జర్నీకి ఖర్చవుతుంది. టూ అండ్ ఫ్రో చేసుకుంటే రూ.10 వేలు నుంచి రూ.20 వేల వరకూ ఖర్చవుతుంది. ఈ రేట్స్ సీజన్ బట్టి మారుతూ ఉంటాయి. అక్టోబర్ నుంచి మే వరకూ చాలా మంచి సీజన్ లక్షద్వీప్‌కు వెళ్లటానికి. ఫ్లైట్‌లో గంటన్నర జర్నీ ఉంటుంది. 


షిప్‌లోనూ వెళ్లొచ్చు 


ఫ్లైట్ ఖర్చు పెట్టుకోలేం అంటే కొచ్చిన్ నుంచి లక్షద్వీప్ వెళ్లటానికి ఏడు ప్యాసింజర్ షిప్స్ ఉంటాయి. ఎంవీ కవరత్తి, ఎంవీ అరేబియన్ సీ, ఎంవీ లక్షద్వీప్ సీ అనే పేర్లతో ఉంటాయి. వీటిలో వెళ్లొచ్చు. మనిషికి సెకండ్ క్లాస్ అయితే రూ.2 వేలు, డీలక్స్ అయితే రూ.3 వేలు, ఫస్ట్ క్లాస్ అయితే రూ.5 వేల వరకూ టికెట్ రేట్ ఉంటుంది. ముందుగానే బుక్ చేసుకుంటే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. ఇండియన్ ఐలాండ్స్ డాట్ కామ్ లాంటి సైట్స్ లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. జర్నీ టైమ్ వచ్చి 14-18  గంటల వరకూ ఉంటుంది మనం వెళ్లాలనుకునే ఐలాండ్ బట్టి. 


లక్షద్వీప్‌కు ప్రవేశం


లక్షద్వీప్‌లోకి అనుమతి లేకుండా వెళ్లడం నిషేధం. కొచ్చిలో ఉన్న లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. అనుమతిని పొందడానికి, మీరు ముందుగా క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఎలాంటి నేర చరిత్ర లేదని సర్టిఫికేట్ తీసుకోవాలి. గుర్తింపు పత్రాలకు మూడు పాస్‌పోర్ట్ ఫోటోలు యాడ్ చేయాలి.    


ముందు కొచ్చికి వెళ్లండి


క్లియరెన్స్ సర్టిఫికేట్ తర్వాత, మీరు ఎంట్రెన్స్ పర్మీషన్ డాక్యుమెంట్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. లేదంటే కొచ్చిలోని విల్లింగ్‌డన్ ఐలాండ్‌లో ఉన్న లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్లి అనుమతి తీసుకోవచ్చు. లక్షద్వీప్‌కు చేరుకున్న తర్వాత, మీరు ఈ ఎంట్రెన్స్ పర్మీషన్ ను లక్షద్వీప్‌లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ అందించాల్సి ఉంటుంది. 


తక్కువ లగేజీ తీసుకు వెళ్లండి


విమానల్లో లక్షద్వీప్‌కు వెళ్లాలి అనుకుంటే తక్కువ లగేజీ తీసుకెళ్లడం మంచిది. ఇక్కడికి వెళ్లే విమానాలు చిన్నవిగా, తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ లగేజీతో వెళ్లడం మంచింది.


Read Also: వామ్మో.. లక్షద్వీప్‌లో అన్ని అద్భుతాలా, ప్రతి దీవి ప్రత్యేకమే!