✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Knee Replacement : మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి

Advertisement
Geddam Vijaya Madhuri   |  27 Dec 2025 07:20 AM (IST)

Knee Replacement Cost : మోకాలి మార్పిడి ఖర్చు ఆసుపత్రి రకం. ఒక మోకాలి లేదా రెండు మోకాళ్ల శస్త్రచికిత్స, ఇంప్లాంట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటో చూసేద్దాం.

మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలంటే తెలుసుకోవాల్సిన విషయాలు

Knee Transplant Surgery in India : ఈ రోజుల్లో మోకాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. వయసు పెరగడం, ఊబకాయం, గాయాలు, ఆర్థరైటిస్, కీళ్ల వ్యాధుల వల్ల ప్రజలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రారంభంలో వచ్చే స్వల్ప నొప్పిని పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుని.. మందులు, నూనెలు, వ్యాయామాలతో కూడా ఉపశమనం లభించనప్పుడు.. డాక్టర్లు మోకాలి మార్పిడి (knee transplant) చేయించుకోవాలని సూచిస్తారు. అయితే మోకాళి మార్పిడి అనేది ఒక పెద్ద నిర్ణయం. కాబట్టి శస్త్రచికిత్సకు ముందు పూర్తి సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మోకాలి మార్పిడికి ఎంత ఖర్చవుతుంది? మార్పిడికి సంబంధించిన ఐదు ముఖ్యమైన విషయాలు ఏమిటో? ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

మోకాలి మార్పిడి ఎప్పుడు అవసరం?

మోకాళ్లలో నిరంతర నొప్పి, వాపు ఉండి.. నడవడం, మెట్లు ఎక్కడం లేదా కూర్చోవడం వంటి రోజువారీ పనులు కష్టంగా మారినప్పుడు.. ఇది మార్పిడికి సంకేతం కావచ్చు. ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో మందులు, థెరపీతో ఉపశమనం లభించకపోతే, ఎక్స్-రే లేదా MRIలో కీలు దెబ్బతిన్నట్లు కనిపిస్తే.. శస్త్రచికిత్స అవసరం అవుతుంది.

మోకాలి మార్పిడికి ఎంత ఖర్చవుతుంది?

భారతదేశంలో మోకాలి మార్పిడి ఖర్చు ఆసుపత్రి రకం.. ఒక మోకాలు లేదా రెండు మోకాళ్లకు శస్త్రచికిత్స జరుగుతుందా? ఉపయోగించే ఇంప్లాంట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులలో మోకాలి మార్పిడి ఖర్చు తక్కువగా ఉంటుంది. అయితే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో ఇది ఎక్కువగా ఉండవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మోకాలి మార్పిడికి సుమారు 60 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది. రెండు మోకాళ్లకు ఈ ఖర్చు సుమారు 1.2 లక్షల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. దీనితో పాటు మధ్య-శ్రేణి ప్రైవేట్ ఆసుపత్రులలో ఒక మోకాలి శస్త్రచికిత్సకు 1.5 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు.. రెండు మోకాళ్ల శస్త్రచికిత్సకు 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. హై-ఎండ్ కార్పొరేట్ ఆసుపత్రులలో ఒక మోకాలి మార్పిడికి 3 నుంచి 5 లక్షల రూపాయలు, రెండు మోకాళ్లకు 6 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది.

Continues below advertisement

మోకాలి మార్పిడికి ముందు తెలుసుకోవాల్సిన ఐదు విషయాలు 

  • నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శస్త్రచికిత్సకు ముందు సరైన ఆర్థోపెడిక్ డాక్టర్, నమ్మకమైన ఆసుపత్రిని ఎంచుకోవడం చాలా ముఖ్యం.
  • ఆ తర్వాత అనుభవజ్ఞులైన సర్జన్ నుంచి సలహా తీసుకోండి. రక్త పరీక్షలు, ఎక్స్-రే, MRI వంటి అవసరమైన పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోండి.
  • శస్త్రచికిత్స ఫలితాల గురించి వాస్తవిక అంచనాలను కలిగి ఉండాలి. మోకాలి మార్పిడి నొప్పిని తగ్గిస్తుంది. నడకను మెరుగుపరుస్తుంది. కానీ పాత మోకాలి వలె పూర్తి సామర్థ్యం ఎల్లప్పుడూ లభించదు.
  • శస్త్రచికిత్స తర్వాత ఫిజియోథెరపీ, రికవరీ ప్లాన్‌ను సరిగ్గా పాటించడం ముఖ్యం.
  • అలాగే మీ మందులు, ఏదైనా అలెర్జీల గురించి డాక్టర్‌కు ముందుగానే తెలియజేయాలి.

 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Published at: 27 Dec 2025 07:19 AM (IST)
Tags: Health News knee pain Knee replacement Lifestyle news Knee Replacement Cost Severe Knee Pain
  • హోమ్
  • లైఫ్‌స్టైల్‌
  • Knee Replacement : మోకాలి మార్పిడి చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.