Karungali Mala Benefits : సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు ఈ మధ్య కరుంగలి మాల(Ebony Wood Mala)లో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనిని వేసుకుంటే సంపద, శాంతి, సక్సెస్ అందుతుందని చెప్తారు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో దీనిగురించి ఎక్కువ చర్చ జరగుతుంది. అయితే ఇది కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుందని చెప్తున్నారు. ఇంతకీ ఈ కరుంగలి మాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో? దానిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
కరుంగలి మాల తయారీ
కరుంగలి వృక్షం నుంచి ఈ కరుంగలి మాలను తయారు చేస్తారు. ఈ కరుంగలి వృక్షంలో ఆయుర్వేద, ఔషద గుణాలు కలిగి ఉంటుంది. ఆ వృక్షం బెరుడులోపలి కాండంతో చేసినవే కరుంగలి మాల. నర దృష్టి, చెడు దృష్టి, గ్రహ దృష్టి నుంచి తప్పించుకోవాలనుకునేవారు దీనిని వేసుకుంటారు. అయితే ఇవే కాకుండా ప్రశాంతతను, పాజిటివిటీని ఇవ్వడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఇస్తుందట. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
కరుంగలి మాల ప్రయోజనాలు
ఎముకల బలానికి : కరుంగలి చెక్క ఎముకలను బలోపేతం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది. దీనిని వేసుకుని రోజుకు నాలుగుసార్లు నడవడం వల్ల తుంటికి బలం చేకూరుతుందట. కాళ్లలో బలం పెరుగుతుందని చెప్తున్నారు.
నరాలకు విశ్రాంతి : కరుంగలి మాలను వేసుకుంటే.. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది నరాలకు విశ్రాంతిని అందిస్తుందట. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు పెరుగుతుంది. దీంతో నిరాశ, ఆందోళన తగ్గతుంది.
మానసిక ప్రశాంతత : శరీరం నుంచి అధిక వేడిని తొలగించి.. సోమరితనం, మానసిక భయాన్ని తొలగిస్తుందట. వ్యాపారంలో విజయం, కెరీర్లో పురోగతి, ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పైగా నెగిటివిటీని దూరం చేసి.. పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుందట.
చర్మ సమస్యలు దూరం : ఈ చెట్టు మూలికను నీటిలో నానబెట్టి దానితో స్నానం చేస్తే దద్దుర్లు, గాయాల మచ్చలు, మొటిమలు, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు దూరమవుతాయట.
జ్ఞాపకశక్తి పెరుగుతుందట : మీరు ముఖ్యమైన విషయాలను ఎక్కువగా మరచిపోతున్నారా? అయితే కరుంగలి మాలతో జపం చేయడం లేదా దానిని ఉపయోగించి మెడిటేషన్ చేస్తూ ఉండడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందట. మనసు ప్రశాంతంగా ఉండి చేయాల్సిన పనుల్లో ఎఫెర్ట్స్ పెట్టేలా చేస్తుందట. దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరుస్తుందట. అలాగే హెల్తీ ఫుడ్, వ్యాయామం కూడా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందట.
రోగనిరోధక వ్యవస్థ : కరుంగలి మాలను ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. ఒత్తిడి, ఆందోళన తగ్గించి.. శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెప్తున్నారు. పిత్త, కఫ, వత్త త్రిదూషాలను సమతుల్యం చేసి.. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందట.
లక్ కోసం : కరుంగలి మాలలోని 108 పూసలు ఆధ్యాత్మికంగా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. నర దృష్టి, అబద్ధాలు, అసూయ, మానసిక భయం వంటి ప్రతికూల విషయాలను ఇవి దూరం చేస్తాయి. శ్రేయస్సును, ప్రశాంతతను అందించడంతో పాటు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని చెప్తున్నారు.
మరిన్ని ప్రయోజనాలు
గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని నమ్ముతారు. ఇది ఎలక్ట్రిక్ రేడియేషన్ను గ్రహించి.. ఆ శక్తిని సానుకూల శక్తిగా బదిలీ చేస్తుంది. జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందట. ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. శరీరంలోని మంటను తగ్గిస్తుందని ఎన్నో ఆరోగ్యప్రయోజనాలకు ఇది మంచి మెడిసన్ అని చెప్తున్నారు. మధుమేహం, పెద్దప్రేగు సమస్యలు, రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా తగ్గుతాయట. ఈ మాలను వేసుకోవడమే కాదు.. చెట్టు వేళ్లను, బెరడను కషాయంగా తీసుకున్నా మంచిఫలితాలు ఉన్నాయట.
ఇది అందరికీ ఒకేలాంటి ఫలితాలు ఇవ్వదు. కొందరు పాజిటివి ఫలితాలు ఇస్తుంది. మరికొందరికి ఎలాంటి డిఫరెన్స్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు దీనిని ధరించాలనుకుంటే దానికి సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఫేక్ కరుంగలి మాలలకు దూరంగా ఉండాలి.
Also Read : కేదార్నాథ్ యాత్ర 2025 ప్రారంభ తేది ఇదే.. యాత్ర ప్రాముఖ్యత, ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే