Karnataka Tourist Places: కర్ణాటకలో ప్రకృతి ప్రేమికుల కోసం రెండు అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవి జోగ్ ఫాల్స్, హొన్నావర. ఒక్క రోజులో ఈ రెండు ప్రదేశాలను చూడవచ్చు.   


జోగ్ ఫాల్స్:
జోగ్ ఫాల్స్ కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లాలో ఉన్న జలపాతం. ఇది భారతదేశంలో అత్యంత ఎత్తైన జలపాతాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.  




జోగ్ ఫాల్స్ లో 830 అడుగుల ఎత్తు నుండి నీరు కిందకి జారుతుంది. ఇది భారతదేశంలో మూడవ అతిపెద్ద plunge waterfall గా గుర్తింపు పొందింది. శరావతి నది లో కలిసే ఈ జలపాతం నాలుగు భాగాలుగా విభజించబడింది: రాజా, రాణి, రాకెట్, మరియు రోర్. వర్షాకాలంలో జోగ్ ఫాల్స్‌ను చూడటానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు.   


జోగ్ జలపాతం చూశాక అక్కడి నుండి కేవలం 70 km ప్రయాణం చేస్తే సముద్ర తీర ప్రాంతానికి చేరుకోవచ్చు. కర్ణాటక లో నే UNTOUCHED HEAVEN గా పిలువ బడే హొన్నవర ప్రక్రుతి ప్రేమికులు తప్పక సందర్శించ వలిసిన ప్రదేశం.   




హొన్నావర:
జోగ్ ఫాల్స్ నుండి కేవలం 65 కిమీ దూరంలో ఉన్న హొన్నావర ఉంటుంది. శరావతి నది తీరాన ఉన్న  హొన్నావర్ కోస్టల్ టౌన్ కర్ణాటక లోనే ఒక laid-back కోస్టల్ టౌన్ గా ప్రసిద్ధి చెందింది.   


హొన్నావరలో చూడదగిన ప్రదేశాలు:
1. శరావతి నది బ్యాక్ వాటర్ బోటింగ్:  హోన్నావర్ లోని బ్యాక్ వాటర్ బోటింగ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. కేరళను తలపించే ఈ ప్రాంతంలో బోటింగ్ చేస్తూ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి దృశ్యాలు, తీర ప్రాంత పక్షులు చూడడం ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది. బ్యాక్ వాటర్ బోటింగ్‌కు గంటకు 1600 నుండి 2000 రూపాయలు ఛార్జ్ చేస్తారు.   


2. ఎకో బీచ్:
హొన్నావరలోని సముద్రతీరాలు భారతదేశంలోనే అత్యంత శుభ్రంగా ఉన్న బీచ్‌లలో ఒకటిగా గుర్తించబడ్డాయి. ఎకో బీచ్, India's Blue Flag Beachesలో ఒకటిగా పేర్కొనబడింది. పర్యావరణ పరిరక్షణ, విద్యా ప్రమాణాలు, భద్రత, మరియు యాక్సెసిబిలిటీ ప్రమాణాలను పాటిస్తూ ఈ గుర్తింపు పొందింది. సాయంత్రం ఎకో బీచ్‌పై సూర్యాస్తమయం చూస్తూ తీరంలో ఈవెనింగ్ వాకింగ్ చేయడం ఒక అద్భుత అనుభవం.




3. అప్సరకొండ జలపాతం:
హొన్నావర సమీపంలో ఉన్న అప్సరకొండ జలపాతం చిన్నదైనా, ప్రకృతి నడుమ ఉండటం వల్ల పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. పచ్చని అడవుల మధ్యలో ఉన్న ఈ జలపాతం లో స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది. జలపాతం పక్కన ఉన్న గుహలు కూడా సందర్శకులకు ఆకర్షణీయంగా ఉంటాయి.




4. బసవరాజ దుర్గ కోట:
 చరిత్ర గురించి ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం బసవరాజ దుర్గ కోట. విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ కోట, హొన్నావర తీరప్రాంతంలో ఉంది. పడవ ప్రయాణం ద్వారా ఈ కోటకు చేరుకోవచ్చు.




ఈ విధంగా, హొన్నావర, జోగ్ ఫాల్స్ నేచర్ లవర్స్‌కి జీవితాంతం గుర్తుండిపోయే అనుభవాన్ని ఇస్తాయి. ఒక్క రోజులోనే ఈ ప్రదేశాలను సందర్శించి, వీటి అందాలను ఆస్వాదించవచ్చు.