Kalyani Priyadarshan Fitness & Diet Secrets : కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) 'కొత్త లోక(kotha Lokah)' సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. మలయాళంలో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసి.. దానిలో భాగంగా ముందుగా 'లోక'ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సూపర్ పవర్స్ ఉండే హీరోయిన్గా కనిపించింది కళ్యాణి. సూపర్ పవర్స్ ఉన్న హీరోయిన్గా ఆమె చేసిన ఫైట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా హిట్ టాక్ని సొంతం చేసుకోగా.. కళ్యాణి ఫిట్నెస్ (Kalyani Priyadarshan Fitness) గురించిన చర్చ కూడా మొదలైంది.
తెలుగు నుంచి కెరీర్ మొదలు పెట్టి..
మలయాళ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ టాలీవుడ్ నుంచే కెరీర్ మొదలు పెట్టింది. తెలుగులో 'అఖిల్(Akkineni Akhil)' సరసన 'హలో(Hello)' సినిమాతో హీరోయిన్గా సినీ కెరీర్ ప్రారంభించింది. తర్వాత సాయి దుర్గా తేజ్(Sai Durgha Tej)తో 'చిత్రలహరి(Chitralahari)' చేసింది. టాలీవుడ్లో ఈమె కూడా ఓ హీరోయిన్గా నిలిచిపోతుందనుకునే తరుణంలో తమిళ్, మలయాళం సినిమాలు మొదలెట్టి.. వాటినే కంటిన్యూ చేస్తుంది. తాజాగా లోక సినిమాతో అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది.
లోక (కొత్త లోక) సినిమాలో సూపర్ పవర్స్ ఉన్న హీరోయిన్గా కళ్యాణి చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే హీరోయిన్స్‌కి ఇలాంటి క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదుగా జరుగుతుంది. పైగా వీటికోసం చాలా ఫిట్‌గా ఉండాలి. ప్రోపర్ డైట్ తీసుకోవడంతో పాటు ఫిట్నెస్ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కళ్యాణి ప్రియదర్శని ఫాలో అయినా డైట్(Kalyani Priyadarshan Diet Routine), ఫిట్నెస్ రొటీన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
వ్యాయామం..
కళ్యాణి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని ఆకృతిలో ఉంచేందుకు హెల్ప్ అవుతుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. అందుకే ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేస్తుందట ఈ బ్యూటీ. స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఫంక్షనల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంది. మెషీన్లతో కాకుండా కోర్ స్ట్రెంగ్త్ పెంచుకునేలా కార్డియో చేస్తుందట. ఫిట్‌నెస్‌లో భాగంగా కేవలం జిమ్‌కే కాకుండా గేమ్స్ కూడా ఆడుతుందట కళ్యాణి. గోల్ఫ్‌లో మంచి ప్రావీణ్యురాలు ఈ బ్యూటీ.
ఫుడ్ విషయంలో..
ఎంత బిజీగా ఉన్నా అల్పాహారం ఎప్పుడూ స్కిప్ చేయదట. ఉదయాన్నే శరీరానికి కావాల్సిన పోషకాలు అందిస్తే రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండడంతో పాటు.. మెటబాలీజం పెరుగుతుందని చెప్తుంది. ప్రతి మీల్లో ప్రోటీన్లు, పోషకాలతో నిండిన సమతుల్యమైన ఆహారం ఉండేలా చూసుకుంటుందట. సరైన సమయానికి తినడం, సరైన మోతాదులో తీసుకోవడంపై దృష్టి పెడుతుందట. అలాగే క్రేవింగ్స్ తీర్చుకునేందుకు చీట్ డే కూడా ఫాలో అవుతుందట ఈ భామ. మెటబాలీజంను మెరుగ్గా ఉంచుకునేందుకు హైడ్రేటెడ్‌గా ఉంటుందట. దానిలో భాగంగా పుష్కలంగా నీరు తాగడమే కాకుండా ఇతర జ్యూస్‌లు, హైడ్రేషన్ కోసం కొన్ని ఫుడ్స్ తీసుకుంటుందట.
ఇవన్నీ ఆమె ఫిట్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తాయని తెలిపింది. ఫిట్నెస్ అనేది అందరికీ ఓ రొటీన్‌లా మారాలని చెప్తోంది ఈ సూపర్ హీరోయిన్. దీనికోసం జిమ్‌కి వెళ్లకపోయినా.. ఓ పర్ఫెక్ట్ రొటీన్ సెట్ చేసుకోవాలని.. ఫుడ్ మాత్రం శరీరానికి కావాల్సింది ఇస్తే మంచిదని టిప్స్ ఇస్తోంది.