Health Care Tips in Telugu: శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు రక్తంలోని వ్యర్థాలను బయటకు పంపించడంలో కీ రోల్ పోషిస్తుంది. కాలేయం సరిగా పని చేయకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వాటిలో జాండిస్ ఒకటి. రక్తంలో ఉండే బిలురుబిన్ కొవ్వు పదార్థాల్లో కరిగిపోతుంది. చర్మం, కళ్లు పసుపు వర్ణంలోకి మారిపోతాయి. పిల్లలతో పాటు పెద్దలలోనూ ఈ సమస్య తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కామెర్లు సోకిన వాళ్లు ముఖ్యంగా పెద్దవాళ్లు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ వాళ్లు ఏ ఫుడ్ తీసుకోవాలి? ఏ ఫుడ్ తీసుకోకూడదు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..  


చక్కటి ఆరోగ్య ప్రణాళిక అనేది గుండె జబ్బులు, మధుమేహం, జాండిస్, క్యాన్సర్ లాంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కామెర్లతో బాధపడే వాళ్లు సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. తాజాగా పండ్లు, కూరగాయాలు, తృణ ధాన్యాలు, లీన్ ప్రొటీన్లు తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. పోషకాహారం కామెర్ల వ్యాధిని తగ్గించే అవకాశం ఉంటుంది.   


జాండిస్ పేషెంట్లు తీసుకోవాల్సిన ఫుడ్


మనం తీసుకునే ఫుడ్, డ్రింక్స్ కాలేయ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపిస్తాయి.


1. జాండిస్ తో బాధపడే వాళ్లు వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి. కామెర్ల సమస్యను అదుపు చేయడంలో నీళ్లు కీలకపాత్ర పోషిస్తాయి.


2. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం జాండిస్ ను అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది.  


3. ముఖ్యంగా ద్రాక్ష, బొప్పాయి, దానిమ్మ, మామిడి పండ్లు, బ్రకోలీ లాంటి ఆకు కూరలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.


4. పప్పులు, బ్రౌన్ రైస్ లాంటి తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.  


5. లీన్ ప్రొటీన్ ఎక్కువగా ఉండే చేపలు తీసుకోవడం వల్ల కామెర్లు కంట్రోల్ అవుతాయి.


జాండిస్ పేషెంట్లు తీసుకోకూడని ఫుడ్స్


కామెర్లతో బాధపడుతున్నప్పుడు, రోగులు కాలేయాన్ని మరింత దెబ్బతీసే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


1. తక్కువ ఐరన్, ప్రొటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్ లివర్ సిర్రోసిస్ కు కారణం అవుతుంది. 


2. ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ ను పూర్తిగా మానేయాలి. లేదంటే కాలేయంలో కొవ్వులు పేరుకుపోయి కొత్త సమస్యలకు కారణం అవుతుంది.


3. ఫ్రై చేసిన ఆహారం, ముఖ్యంగా మాంసం, పాల ఉత్పత్తులలో ఉండే సంతృప్త కొవ్వులు జీర్ణం కావడం కష్టం. వీటిని వీలైనంత వరకు తీసుకోకపోవడం మంచిది.   


4. చక్కెర, ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.


5. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వులు పేరుకుపోయి జాండిస్ మరింత తీవ్రం అవుతుంది.


Read Also: నాన్​వెజ్​ ఎక్కువగా తింటున్నారా? అయితే మీ లివర్ మటాషే.. న్యూ స్టడీలో షాకింగ్ విషయాలు