రువు తగ్గే విషయంలో వచ్చే ప్రతీ ట్రెండ్ ఫాలో అయిపోతారు. కీటో డైట్, ఫ్యాడ్ డైట్ ఆ కోవకి చెందినవే. ఇప్పుడు మరొక కొత్త ట్రెండ్ వైరల్ గా మారింది. అడె వాటర్ ఫాస్టింగ్. ఒక సమయంలో చాలా రోజుల పాటి నీటిని మాత్రమే తీసుకుంటారు. ఈ ట్రెండ్ ని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ చికాగో నుంచి వచ్చిన ఒక కొత్త అధ్యయనం కూడా సమర్దిస్తుంది. ఇటువంటి ఉపవాసాల నుంచి వేగంగా బరువు తగ్గుతారని సూచిస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోవడం, మెరుగైన జీవక్రియ ఉంటుందని చెబుతున్నారు.


వాటర్ ఫాస్టింగ్ చేసే వారిలో ఎటువంటి తీవ్రమైన ప్రతికూల పరిణామాలు కనిపించలేదట. ఇది చక్కగా పని చేస్తుందని న్యూట్రిషన్ ప్రొఫెసర్ క్రిస్టా చెప్పుకొచ్చారు. వాటర్ ఫాస్టింగ్ మీద పరిశోధనా బృందం అధ్యయనం చేసింది. వాటర్ ఫాస్టింగ్, బుచింగర్ ఫాస్టింగ్ మీద ఉన్న ఎనిమిది అధ్యయనాలు విశ్లేషించారు. బుచింగర్ అనేది ఒక ప్రసిద్ధ యూరోపియన్ ఫాస్టింగ్ వేరియంట్. ఇందులో ప్రతిరోజూ తక్కువ మొత్తంలో జ్యూస్, సూప్ తీసుకుంటారు. బరువు తగ్గడం, ఇతర జీవక్రియ కారకాలపై ఈ ఉపవాసాలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయనే దాని తెలుసుకునేందుకు ప్రతి ఒక్క అధ్యయనం నిశితంగా పరిశీలించారు. వేగంగా బరువు తగ్గడం, వాటర్ ఫాస్టింగ్ పద్ధతులు స్వల్పకాలిక బరువు తగ్గడంలో కీలకంగా పని చేస్తున్నాయి. ఐదు రోజుల ఉపవాసాలు సాధారణంగా శరీర బరువుని 4 శాతం నుంచి 6 శాతం వరకు కోల్పోతాయి. ఏడు నుంచి 10 రోజుల పాటి వాటర్ ఫాస్టింగ్ చేస్తే 2 శాతం నుంచి 10 శాతం వరకు బరువు తగ్గుతారు.


15-20 రోజుల పాటు వాటర్ ఫాస్టింగ్ చేస్తే శరీర బరువులో 7 శాతం నుంచి 10 శాతం మధ్య కోల్పోయారు. కొన్ని అధ్యయనాలు ఉపవాసం పూర్తయిన తర్వాత వారి బరువును పర్యవేక్షించారు. అటువంటి వాళ్ళు మూడు నెలలలోపు కోల్పోయిన బరువు తిరిగి పొందారు.


వాటర్ ఫాస్టింగ్ వల్ల మెటబాలిక్ ప్రభావం ఎలా ఉంది?


నీటి ఉపవాసం వల్ల జీవక్రియ ప్రయోజనాల్లో ఒక తాత్కాలిక ప్రభావాన్ని గుర్తించారు. రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిల్లో మెరుగుదలని గమనించారు. కొన్ని అధ్యయనాలు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ తో ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వీళ్లలో ఎటువంటి చెడు ప్రభావాలు కనిపించలేదు. దీర్ఘకాలిక ఉపవాసం వల్ల తలనొప్పి, నిద్రలేమి, ఆకలి ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదురువుతాయి. ఇవే అప్పుడప్పుడు ఉపవాసం చేసే వారిలోనూ కనిపించాయి. ఈ నీటి ఉపవాసం బరువు తగ్గాలని కోరుకునే వారికి మంచి ఫలితాలు ఇస్తుందని సిఫార్సు చేస్తున్నారు.


వాటర్ ఫాస్టింగ్ ఇప్పటిది కాదు


ఎన్నో ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉపవాసం వివిధ రూపాల్లో ఆచరించబడుతుంది. నీటి ఉపవాసం అంటే ప్రత్యేకంగా కొంత కాలం పాటు నీరు తప్ప మరేమీ తీసుకోకుండా ఉండటమే. దీని చరిత్ర ఆధ్యాత్మిక, శారీరక వైద్య పద్ధతుల్లోనూ ఉంది. ఇటువంటి ఉపవాసాలు తరచుగా మతపరంగా చేస్తారు. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం, బౌద్ధమతంతో సహా అనేక ప్రధాన మతాలు ఈ సంప్రదాయాలని కలిగి ఉన్నాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: పిడికిలి వేళ్ళు విరుచుకుంటే కీళ్ల నొప్పులు వస్తాయా?