డయాబెటిస్ వ్యాధి.. ఏది తిననివ్వదు, తాగనివ్వదు. డయాబెటీస్ వచ్చిందంటే ఆహార నియమాలను తప్పకుండా పాటించి తీరాలి. లేకపోతే.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేం. నచ్చిన ఆహారాన్ని చూసి టెంప్ట్ అయ్యి తినేస్తే.. ఏ అవయవం పాడైపోతుందో చెప్పలేం. అది వెంటనే ప్రభావం చూపకపోయినా.. స్లోపాయిజన్‌లో క్రమేనా ఆయుష్సును తగ్గించేస్తుంది. ఇప్పటివరకు డయాబెటిస్‌కు మందులు లేవు. డయాబెటిస్ వస్తే కేవలం ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి. తగిన ఆహార నియమాలు పాటించడం ద్వారా టైప్-2 డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. అయితే, ‘విటమిన్-డి’ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా కూడా డయాబెటిస్‌ను అరికట్టవచ్చని, పూర్తిగా ఉపశమనం పొందవచ్చని వార్తలు వస్తున్నాయి. మరి, ఇందులో నిజమెంత? నిపుణులు ఏం తేల్చారు?
❄ విటమిన్-డి సప్లిమెంట్లు టైప్-2 డయాబెటిస్‌ను నివారిస్తాయనే విషయం అధ్యయనాలు అస్పష్టమైన వివరణ ఇచ్చాయి. తాజా అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 480 మిలియన్ల మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. 2045 నాటికి ఈ సంఖ్య 700 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. 500 మిలియన్ ప్రజలు ఇప్పటికే ‘గ్లూకోస్ టాలరెన్స్’, ‘ప్రీ-డయాబెటిస్’ సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో సాధారణ రక్తంలో ఉండాల్సిన చక్కెర స్థాయిలు మోతాదుకు మించి ఉన్నాయి.
❄ ‘విటమిన్ డి’ లోపం వల్ల భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని మరికొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ‘విటమిన్ డి’ సప్లిమెంట్లతో ఉపశమనం పొందవచ్చని పేర్కొన్నాయి. ఈ సప్లిమెంట్ల పరిశోధనలో అస్పష్టమైన ఫలితాలు వచ్చాయి. BMJ ప్రచురించిన కొత్త అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్‌తో ఎక్కువ రిస్క్ ఎదుర్కొంటున్న పెద్దలపై ‘విటమిన్-డి’ సప్లిమెంట్లు ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది. అయితే, తక్కువ స్థాయిలో ఇన్సులిన్ సమస్యలు ఎదుర్కొంటున్న బాధితులకు ప్రయోజనం ఉండవచ్చని పేర్కొంది.
❄ జపాన్‌లో బోలు ఎముకల వ్యాధి(osteoporosis) చికిత్సకు ఉపయోగించే విటమిన్-డి ఔషదం ‘ఎల్డెకాల్సిటోల్’ను బలహీనమైన గ్లూకోజ్ టాలరెన్స్ ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉందని అని బృందం అంచనా వేసింది. ఈ సందర్భంగా జపాన్‌లోని మూడు ఆసుపత్రుల సాయంతో గ్లూకోజ్ టాలరెన్స్‌తో బాధపడుతున్న 1,256 మందిని రెండు గ్రూపులుగా విభజించి.. సప్లిమెంట్ల పనితీరును పరిశీలించారు.
Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!
❄ అధ్యయనంలో భాగంగా 630 మందికి ‘ఎల్టెకాల్సిటోల్’, మరో 626 మందికి ప్లేసిబో ఔషదాలు ఇచ్చారు. వారిని మూడేళ్లపాటు వారి ఆరోగ్యాన్ని సమీక్షించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వారికి డయాబెటిస్ పరీక్షలు నిర్వహించారు. అయితే వారిలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిల్లో తగిన వ్యత్యాసాలను కనుగోలేకపోయారు. అయితే, ప్లెసిబోతో పోలిస్తే ఎల్డెకాల్సిటోల్ తీసుకునే వారిలో వెన్ను, తుంటి ఎముక ఖనిజ సాంద్రతలలో గణనీయమైన పెరుగుదలను బృందం కనుగొంది. ఎల్డెకాల్సిటోల్‌తో చికిత్స ప్రీ-డయాబెటిస్ ఉన్నవారిలో డయాబెటిస్ సంభవాన్ని గణనీయంగా తగ్గించినట్లు తెలుసుున్నారు. అలాగే, స్వల్ప ఇన్సులిన్ సమస్యలు కలిగిన వ్యక్తులపై కూడా ‘ఎల్డెకాల్సిటాల్’ సానుకూల ఫలితాలు ఇచ్చినట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రి-డయాబెటిస్ బాధితులకు ఒక రకంగా ‘విటమిన్-డి’ మేలు చేస్తుందనే చెప్పుకోవాలి. ఇప్పటికే డయాబెటిస్ ముదిరిపోయి, తీవ్రమైన ఇన్సులిన్ సమస్యలు ఎదుర్కొనేవారికి మాత్రం ఇది బ్యాడ్ న్యూసే. అయితే, డాక్టర్ సలహా, సూచనలు లేకుండా ‘విటమిన్-డి’ సప్లిమెంట్లు ఉపయోగించకూడదు.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!
గమనిక: ఈ కథనం మీ అవగాహన కోసమే అందించాం. వివిధ పాత, కొత్త అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇందులో ప్రస్తావించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.