Magnesium Deficiency: విటమిన్లు, ఖనిజాల కొరత మన శరీరాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. బలహీనంగా మార్చడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు, ఖనిజాలు అవసరం. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ముఖ్యంగా విటమిన్లు , A, B, C, D, జింక్, ఐరన్ పోషకాలు తప్పనిసరిగా మన శరీరానికి అందించాలి. అందులో ముఖ్యమైంది మెగ్నీషియం. ఇది మానవ శరీరానికి కావాల్సిన అత్యంత ముఖ్యమైన ఖనిజాల్లో ఒకటి. కండరాలు సరిగ్గా పనిచేయాలన్నా... శరీరంలో జీవరసాయన ప్రక్రియలు సరిగ్గా ఉండాలన్నా మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం. ఎముకలు బలంగా ఉంచడంతోపాటు శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం నాడీ వ్యవస్థను అదుపులో ఉంచుతుంది.
మానసిక స్థితిని కంట్రోల్లో ఉంచే న్యూరోట్రాన్స్మీటర్ల ఉత్పత్తిలో కూడా మెగ్నీషియం పాల్గొంటుంది. ఎప్పుడైతే శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడుతుందో అప్పుడు నియంత్రణ లేకపోవడం, నిరాశ, ఆందోళన వంటివి ఏర్పడతాయి. బీపీని కంట్రోల్ చేయడంలో కూడా మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల రక్తపోటు కంట్రోల్లో ఉండదు. గుండె చప్పుడును నియంత్రిచడంలోనూ మెగ్నీషియం పాత్ర క కీలకం. విటమిన్ డి వంటి ఇతర పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. రక్త ప్రవాహాన్ని నియంత్రించడం నుంచి కండరాల పనితీరు వరకు మెగ్నీషియం ముఖ్యపాత్ర పోషిస్తుంది.
మనశరీరంలో మెగ్నీషియం లోపించడానికి ఇవే సంకేతాలు:
1. నిరంతరం అలసట:
రక్తంలో మెగ్నీషియం లోపించినట్లయితే నీరసం, బాగా అలసిపోయినట్లు, నిస్సత్తువ ఆవరిస్తుంది. మెగ్నీషియం శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తగిన మెగ్నీషియం లేనట్లయితే శక్తి ఉత్పత్తి అవ్వదు. దాంతో అలసట, నీరసం, బలహీనంగా ఉండటం అనే లక్షణాలు కనిపిస్తాయి. వీటితోపాటు నిద్రపట్టకపోవడం, విపరీతంగా నిద్రపోవడం వంటి పరిస్థితి కూడా మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది.
2. ఆకలి లేకపోవడం:
శరీరంలో కావాల్సినంత మెగ్నీషియం లేకపోవడం వల్ల ఆకలి ఉండదు. ఇది సాధారణ సంకేతం. మెగ్నీషియం గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ ఖనిజం కొరత వల్ల ఆకలి వేయదు.
3. కండరాల తిమ్మిరి:
మెగ్నీషియం లోపిస్తే కండరాలు బలహీనంగా మారుతాయి. ఎందుకంటే కండరాలు బలంగా ఉండాలంటే మెగ్నీషియం అవసరం. మెగ్నీషియం లోపం వల్ల పొటాషియం స్థాయిలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది కండరాల తిమ్మిరి, కండరాల నొప్పులకు దారితీస్తుంది.
4. అసాధారణ గుండె రేటు:
పొటాషియం స్థాయిలు గణనీయంగా తగ్గితే, అది మీ సాధారణ హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మీ గుండె సాధారణం కంటే వేగంగా కొట్టుకుంటున్నట్లు మీకు అనిపిస్తే, అది మెగ్నీషియం లోపానికి సంకేతమని గుర్తించాలి.
5. వికారం:
తరచుగా తలనొప్పి లేదా మైకము వంటి సమస్యలు తలెత్తుతుంటే అది మెగ్నీషియం లోపమని గుర్తించాలి. ఇది తీవ్రమైన ఆందోళనకు దారి తీస్తుంది.
6. అసాధారణ కంటి సమస్యలు:
శరీరంలోని రక్తంలో సరైన మోతాదులో మెగ్నీషియం లేకపోవడం వల్ల, కొన్నిసార్లు కంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది.
Also Read : పరగడుపునే ఈ జ్యూస్ తాగితే చాలు.. అందానికి, ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply