తెలుగురాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాతావరణం చల్లగా మారుతోంది. వానలు పడుతున్నప్పుడు, వాతావరణ చల్లగా ఉన్నప్పుడు కొన్ని రకాల కూరగాయలు తినకపోవడమే మంచిది. కానీ చాలా మందికి ఏ కూరగాయలు తినకూడదో, ఎందుకు తినకూడదో మాత్రం తెలియదు. వాతావరణాన్ని బట్టి ఆహారం తినమని వైద్యులు కూడా చెబుతారు. ఎందుకంటే వాతావరణం వేడిగా ఉన్నప్పడు చలువ చేసే ఆహారాన్ని, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరంలో వేడి పుట్టించే ఆహారాన్ని తినమని వైద్యులు చెబుతుంటారు. అంటే వాతావరణం మీదే మనం తినే ఆహఆరం ఆధారపడి ఉంది. అందుకే చినకులు పడుతున్న సమయంలో, చల్లగాలులు వీస్తున్నప్పుడు కొన్ని రకాల కూరగాయలను దూరంగా పెట్టాలి. 


ఆకుకూరలు
ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా అవసరం. కానీ వానలు పడుతున్నప్పుడు, వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు వీటిని తినడం తగ్గిస్తే మంచిది.  పచ్చని ఆకుకూరలపై సూక్ష్మజీవులు, బ్యాక్టిరియా త్వరగా పెరుగుతాయి. ఆకులపైనే సంతానోత్పత్తి చేస్తాయి. దీనికి ఆకులు కలుషితమయ్యే ప్రమాదం అధికం. కడుగుతున్నాం కదా అనుకుంటారు కానీ, ఆ సూక్ష్మమైన జీవులు ఆకులను పట్టే ఉంటాయి. కొన్ని కడిగినా పోవు. వాటిని అలానే తినడం వల్ల ఆరోగ్యసమస్యలు వస్తాయి.  


కాలీఫ్లవర్
దీన్ని ‘ఫూల్ గోబి’ అని పిలుస్తారు. దీనికి భారతీయ వంటకాల్లో విరివిగా వాడతారు. వెజ్ బిర్యానీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కూరలు, వేపుళ్లు, గోబి మంచూరియా, గోభి పకోడి, ఇలా దీనితో రకరకాల వంటకాలు చేస్తారు. అయితే దీన్ని వర్షాకాలంలో మాత్రం తినకండి. వాటిలో గ్లూకోసినోలేట్స్ అనే రసాయన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అలెర్జీలు వచ్చేలా చేస్తాయి. అలాగే పురుగులు కూడా అధికంగా పడతాయి. కాలీఫ్లవర్ మీదే అవి సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. 


క్యాప్సికం
చాలా తక్కువ ఖరీదుతో పేదవారికి అందుబాటులో ఉండే కూరగాయ ఇది. తింటే చాలా మంచిది. కానీ వానాకాలంలో తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వీటిల్లో కూడా గ్లూకోసినోలేట్లు ఉంటాయి. అవి నమిలినప్పుడు ఐసోథియోసైనేట్లుగా మారుతాయి. వీటి వల్ల కొందరిలో అతిసారం,  వాంతులు, వికారం, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూరగాయని చినుకులు పడుతున్న సమయంలో తినకపోవడమే మంచిది.  


వీటికి బదులు పొట్లకాయలు, దోసకాయలు, బెండకాయలు, టోమాటోలు, బీన్స్ వంటి కూరగాయలను అధికంగా తీసుకోవడం మంచిది. ఈ కూరగాల్లో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి పేగులను శుభ్రపరిచేందుకు, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇవి సహకరిస్తాయి. 


Also read: మీ శరీరం నుంచి వచ్చే వాసన మీకు డయాబెటిస్ ఉందో లేదో చెప్పేస్తుంది, ఎలాగంటే


Also read: గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టే రక్త పరీక్ష ఇది, 40 ఏళ్లు దాటితే చేయించుకోవడం

































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.