ఉదయం లేవగానే టీ పొట్టలో పడనిదే పనిచేయలేరు చాలా మంది. టీతో పాటూ పక్కన రస్కులు కూడా ఉండాల్సిందే. అలాగే పిల్లలకు చిరుతిళ్లుగా కూడా రస్కులు అందిస్తారు. అవి చాలా ఆరోగ్యకరమైనవని అనుకుంటారు. నిజానికి రస్కుల గురించి మీకు తెలియని నిజాలు ఎన్నో ఉన్నాయి. బిస్కెట్ల కంటే ఇవి చాలా బెటర్ అనుకుంటారు కానీ, ఇవి చాలా అనారోగ్యకరమైనవి. 


ఆహారం తయారయ్యే పదార్థం, విధానాన్ని బట్టి ఆ ఆహారం మంచిదో కాదో నిర్ణయిస్తారు. రస్క్ మైదా వంటి వాటవితో తయారుచేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. అదే గోధుమ పిండితో చేసిన రస్కులైతే కొనుక్కోవచ్చు. ప్యాకెట్ పై వేటితో తయారు చేశారో రాసి ఉంటుంది. అది చూసి కొనుక్కోవాలి.  కాకపతే మార్కెట్లో అధికంగా శుద్ధి చేసిన పిండి, నూనెతో తయారు చేస్తారు. అందుకే వీటిని రోజూ తినడం అనారోగ్యం. ఆహార నిపుణులు అభిప్రాయం ప్రకారం బ్రెడ్డు కంటే రస్క్‌లు అధికంగా కేలరీలను కలిగి ఉంటాయి. 100 గ్రాములకు 407 కిలో కేలరీలు లభిస్తాయి రస్క్‌ల వల్ల. అదే వైట్ బ్రెడ్డులో అయితే 258-281 నుంచి కిలో కేలరీలు ఉంటాయి. 


రస్క్ తయారీ ఇలా...
రస్క్ అనేది కేవలం డీహైడ్రేటెడ్ బ్రెడ్. బ్రెడ్ లోంచి తేమను పూర్తిగా తొలగిస్తే అది రస్క్ కింద మారుతుంది.  దీనికి చక్కెరను జోడించడం వల్ల రుచికరంగా చేస్తారు. మిగిలిపోయిన బ్రెడ్డుతో వీటిని తయారుచేస్తారు.  వీటి తయారీలో అధికంగా వాడేది మైదా, చక్కెర, ఈస్ట్, నూనె. గడువు తేదీ దాటిన బ్రెడ్డులో బూజు, విషపూరితమైన పదార్థాలు ఉంటాయి. 


వాడే నూనె...
రస్క్‌ల తయారీలో వాడే నూనె కూడా మంచిది కాదు. ఆ నూనె అధికంగా శరీరంలో చేరడం వల్ల రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల గుండెపోటు రావచ్చు. అలాగే దీని తయారీలో పంచదారను అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇది మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.  మధుమేహం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, చర్మ సమస్యలు, పగుళ్లు వంటివి వచ్చే ప్రమాదం పెంచుతుంది. 


రస్క్‌ల్లో యాంటీ న్యూట్రియెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం పోషకాలు సంగ్రహించకుండా అడ్డుకుంటుంది. ఇందులో ఫైటిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఇనుము, జింక్, మెగ్నీషియం, కాల్షియం శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది. 


మధుమేహులకు ప్రమాదం
డయాబెటిక్ రోగులు బ్రెడ్డులు, రస్క్‌లు దూరం పెట్టడం మంచిది. వీటిలో అధిక స్థాయిలో గ్లూటెన్ ఉంటుంది. ఇది ఒక రకమైన ప్రొటీన్. అధికంగా పిండి పదార్థం తయారయ్యేందుకు సహాయపడుతుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు వీటిని అధికంగా తినకపోవడమే మంచిది. 


Also read: భవిష్యత్తులో ల్యాబ్‌లోనే కృత్రిమ గర్భాశయాలు, ఏడాదికి 30,000 పిల్లల ఉత్పత్తి - బిడ్డల రంగు, ఎత్తు కూడా ఎంచుకోవచ్చు










































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.