డైట్ ట్రెండ్ లో ఎక్కువగా వినిపించే మాట ప్రోటీన్ పౌడర్. జిమ్ కి వెళ్ళే వాళ్ళు వీటిని ఉపయోగిస్తు ఉంటారు. శరీరాన్ని హైడ్రేట్ చేసేందుకు, ఎలక్ట్రోలైట్స్ ని సమతుల్యం చేసేందుకు ఉపయోగపడుతుందని నమ్ముతారు. అనేక రకాల ప్రోటీన్ పౌడర్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఒక్కొక్కరూ తమ అభిరుచికి తగిన విధంగా ఎంచుకుంటారు. కానీ వాటి కంటే  బఠానీలతో చేసిన ప్రోటీన్ పౌడర్ చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పసుపు బఠానీల నుంచి ఈ ప్రోటీన్ పౌడర్ తయారు చేస్తారు. అధిక నాణ్యత కలిగి ఉంటుంది. ఇందులో ఇనుము పుష్కలంగా లభిస్తుంది.


☀ బఠానీ ప్రోటీన్ పౌడర్ తో చేసిన షేక్స్ తాగితే కొవ్వుని కాలచేస్తుందని చెబుతున్నారు. ఇందులో మొత్తం తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉన్నాయి. బ్రాంచ్ చైన్ అమైనో ఆమ్లాల గొప్ప మూలం. ఆరోగ్యకరమైన రక్తప్రసరణ అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. స్మూతీశ్, షేక్స్ లేదా నీటిలో కలుపుకుని తాగుతూ ఉంటారు.


☀ ప్రోటీన్ పౌడర్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తో తీసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ బాగా శోషించబడుతుంది.


☀ ఫిట్ నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం బఠానీ ప్రోటీన్ పౌడర్ ని రెసిస్టెన్స్ ట్రైనింగ్ తో కలిపి తీసుకోవడం వల్ల కండరాలు నిర్మించడంలో సహాయపడుతుంది.


☀ ఈ పౌడర్ లో ఉండే రిచ్ ప్రోటీన్ కంటెంట్ పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. ఇది సులభంగా జీర్ణమయ్యే మొక్కల ఆధారిత ప్రోటీన్ పౌడర్.


☀ మెనోపాజ్ మహిళలకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందిస్తుంది.


☀ ఇది గ్లూటెన్ రహితం, ఎటువంటి అలర్జీ ప్రతిచర్యలు కలిగించదు.


☀ హైపోఅలర్జెనిక్, లాక్టోస్ అసహనం ఉన్న వాళ్ళు, పాల అలర్జీ ఉన్న వారికి ఇది మంచి ఎంపిక బఠానీ ప్రోటీన్ పౌడర్ ఉత్తమ ఎంపిక.


☀ కొన్ని రకాల బఠానీ ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.


☀ ప్రోటీన్ పౌడర్ వల్ల ప్రయోజనాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు ఉన్నాయి. అందుకే ఏదైనా కొత్తగా ట్రై చేసే ముందు ప్రయోజనాల గురించి మాత్రమే కాకుండా అనార్థాల గురించి కూడా తెలుసుకుని తీసుకోవడం మంచిది.


సైడ్ ఎఫెక్ట్స్


బఠానీ ప్రోటీన్ పౌడర్ సమతుల్య సప్లిమెంట్ అని భావించినప్పటికీ తక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. సోడియం కంటెంట్ అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే వాటిని తీసుకునే ముందుగా నిపుణుల్ని సంప్రదించి తీసుకోవడం మంచిదని సూచిస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఫిష్ ఆయిల్ మంచిదా? లేదా నేరుగా చేపలు తినేయడమే బెటరా? వీటిలో ఏది బెస్ట్?