మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా తాగడం ఆపరు. దానికి బానిసలుగా మారిన వారు ఎంతోమంది. అయితే కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు మాత్రం కచ్చితంగా మద్యపానానికి దూరంగా ఉండాలి.ముఖ్యంగా యాంటీ బయోటిక్స్ తీసుకునేటప్పుడు మద్యపానం దూరంగా ఉంచాల్సిందే. లేకుంటే ఇతర ఆరోగ్యసమస్యలు రావడం ఖాయం. యాంటీబయోటిక్స్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఆల్కహాల్‌ వల్ల బలమైప ప్రతిచర్యను చూపించే కొన్ని యాంటీ బయోటిక్ లు ఉన్నాయి. ఈ మందులు తీసుకునేటప్పుడు ఆల్కహాల్‌ను తాగకూడదు.  


మెట్రోనిడాజోల్ (ఫ్లాగిల్)
ఇది పొట్ట, కాలేయం,మెదడు, యోనిలో బ్యాక్టిరియాలను చంపేందుకు ఇచ్చే యాంటీ బయోటిక్ ఇది. దీన్ని వేసుకుంటున్నప్పడు ఆల్కహాల్ తాగకూడదు. 


టినిడాజోల్ (టిండామేక్స్)
పేగుల్లో ఇన్ఫెక్షన్లకు, యోనిలో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేసేందుకు అధికంగా ఈ యాంటీ బయోటిక్‌ను సూచిస్తారు.


Sulfamethoxazole-trimethoprim:
చర్మ వ్యాధులకు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సూచించే యాంటిబయోటిక్ ఇది. 


సెఫోటెటాన్
ఇది ఊపిరితిత్తులు, చర్మం, ఎముకలలో బాక్టిరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గించేందుకు చికిత్స చేస్తారు. 


Linezolid: 
చర్మానికి వచ్చే అంటువ్యాధులు, నిమోనియా వంటి సమస్యలకు దీన్ని సూచిస్తారు. ఈ మందులు వాడేటప్పుడు  మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. 


ఈ యాంటీ బయోటిక్స్ తీసుకునేటప్పుడు మద్యం, వైన్ లేదా బీర్ కు దూరంగా ఉండాలి. అలాగే దగ్గుకు ఇచ్చే సిరప్‌లలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. ఈ యాంటీ బయోటిక్ వేసుకునేటప్పుడు ఆ దగ్గు మందులకు కూడా దూరంగా ఉండాలి. 


ఏం జరుగుతుంది?
యాంటీబయోటిక్స్ మింగేటప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పొత్తికడపులో తిమ్మిరి, వికారం, తలనొప్పి, వాంతులు, గుండె దడ పెరగడం వంటి సమస్యలు పెరుగుతాయి. యాంటీబయోటిక్స్ తీసుకున్నాక మద్యం తాగితే కొన్ని గంటల్లోనే దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఈ ప్రభావాలు తీవ్రంగా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. 


ఎందుకు తాగకూడదు
ఆల్కహాల్ తాగడం వల్ల మీ శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గుతుంది. యాంటీబయోటిక్స్ తో మద్యం కలిస్తే వాంతులు, విరేచనాలు,వికారం వచ్చే ప్రమాదం ఉంది.  ఆల్కహాల్ మీ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తుంది. ఈ పరిస్థితి మిమ్మల్ని ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవడాన్ని ఆలస్యం చేస్తుంది. ఒక్కోసారి సమస్యను పెంచేస్తుంది కూడా. 


Also read: భోజనం చేశాక కాసేపు నడిస్తే మధుమేహం అదుపులో ఉండడం ఖాయం, చెబుతున్న పరిశోధకులు


Also read: టెస్టోస్టెరాన్ హార్మోనుకు మెంతులు ఎంత ఉపయోగమో తెలుసా? అందుకే మగవారు వాటిని మెనూలో చేర్చుకోవాల్సిందే














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.