Health Benefits of Intimacy : శారీరక శ్రమ మాదిరిగానే ఆరోగ్యకరమైన లైంగిక చర్య కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు నిపుణులు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నుంచి.. ఎన్నో దీర్ఘకాలిక సమస్యలను దూరం చేసుకోవడంలో ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. పలు అధ్యయనాలు కూడా అవి నిజమనే చెప్తున్నాయి. 

గుండె ఆరోగ్యం.. 

అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. నెలకు ఓసారి లేదా అంతకంటే తక్కువసార్లు సెక్స్ చేసేవారి కంటే వారానికి కనీసం రెండుసార్లు లైంగిక చర్యలో పాల్గొనే మగవారికి.. స్ట్రోక్ లేదా గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. మరో అధ్యయనంలో శృంగారం పూర్తిగా ఆపేసినవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఎక్కువగా పాల్గొనేవారికి గుండె జబ్బుల వల్ల కలిగే మరణాలు 35 శాతం తక్కువగా ఉన్నాయట. 

బీపీ

లైంగికచర్యలో పాల్గొంటే మానసిక స్థితిని పెంచే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయని డాక్టర్ వెటర్ తెలిపారు. అలాగే కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే సిస్టోలిక్ రక్తపోటును కంట్రోల్ చేస్తుందని సెక్సువల్ మెడిసన్​లో ప్రచురించారు.

ప్రోస్టేట్ క్యాన్సర్

ప్రాస్పెక్టివ్ కోహోర్ట్ అధ్యయనంలో భాగంగా అమెరికాకు చెందిన 32,000 మంది పురుషులపై పరిశోధనలు చేశారు. నెలకు 7సార్లు లైంగికచర్యలో పాల్గొనేవారికంటే.. 21 సార్లు పాల్గొనవారికి ప్రోస్టేట్ క్యాన్సర్ 20 శాతం తక్కువగా ఉందని తేలింది. అయితే దీనిని నిర్థారించడానికి మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. 

నిద్ర సమస్యలు దూరం

భాగస్వామితో శృంగారంలో సంతృప్తి చెందిన తర్వాత చాలా త్వరగా నిద్రపోయే అవకాశం ఉందట. ఎందుకంటే ఆ సమయంలో ఆక్సిటోసిన్, ప్రోలాక్టిన్, ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలై నిద్రను మెరుగుపరుస్తుందని డాక్టర్ వెటర్ తెలిపారు. జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసన్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. ఆ చర్యలో కళ్లు ఎక్కువగా మూసుకోవడం వల్ల లైంగిక ప్రతిస్పందన కూడా పెరుగుతుందని కనుగొన్నారు. 

పీరియడ్ నొప్పులు దూరం

భాగస్వామిని చూడడం వల్ల పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిందని మరో అధ్యయనంలో తేలింది. పరధ్యానంగా కూడా భాగస్వాములను చూడడం వల్ల ఈ రిలీఫ్ వచ్చినట్లు గుర్తించారు. ఓ సర్వేలో.. పీరియడ్స్ సమయం​లో హస్తప్రయోగం చేయడం వల్ల ఆ నొప్పి తీవ్రతపై ప్రభావం ఉంటుందని గుర్తించారు. 62 శాతం మంది క్రమం తప్పకుండా దీనిని చేయడం వల్ల పీరియడ్స్ పెయిన్ తగ్గినట్లు తెలిపారు. 

యవ్వనమైన చర్మం

శృంగారం సమయంలో హృదయ స్పందన రేటు పెరిగి.. ముఖంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుందట. రక్తనాళాలు వ్యాకోచించి.. ముఖంలో గ్లో వచ్చేలా చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. ఇది తాత్కాలిక ఫలితమే అయినప్పటికీ.. మెరుగైన నిద్ర, ఒత్తిడి తగ్గడం వల్ల ముందురోజుల్లో చర్మానికి మంచి ఫలితాలు అందుతాయట. 

మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ చర్యలో పాల్గొనడంవల్ల శారీరకంగా వచ్చే ఎన్నో సమస్యలను దూరం చేసుకోవడంతో పాటు.. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చని సూచిస్తున్నారు నిపుణులు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.