International No Diet Day 2024 History : శరీరాన్ని కొలతలు కొలిచి.. ఐడియల్​ లుక్​ కోసం ఇలాగే ఉండాలని భావించి.. కొందరు రకరకాల డైట్​లు ఫాలో అవుతూ ఉంటారు. ఈ ఫిట్​గా ఉండడం ఏమో కానీ.. ఈ డైట్​లు యువతలో వివిధ రుగ్మతలకు దారి తీస్తున్నాయి. కొంచెం బొద్దుగా, లావుగా ఉంటే క్రిటిసైజ్ చేసేవారే ఎక్కువైపోయారు. ఆ సమయంలో వ్యాయామాలకు బదులుగా ఈ డైట్​లు ఫాలో అయి.. ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నారు. ఈ అంశాలపై అవగాహన కల్పిస్తూ.. ప్రతి సంవత్సరం మే 6వ తేదీన ఇంటర్నేషనల్ నో డైట్​ డే (No Diet Day)ను నిర్వహిస్తున్నారు. 

ఈ మధ్యకాలంలో శరీర సానుకూలత బాగా తగ్గిపోయింది. డైట్​లతో మోడల్​ లెక్క ఫిట్​గా కనిపిస్తామనే ఉద్దేశంతో వివిధ రకాల డైట్స్​ ఫాలో అవుతున్నారు. అయితే ఈ డైట్స్​ మిమ్మల్ని ఫిట్​గా మార్చడం కంటే.. మీ ఆరోగ్యాన్ని హాంఫట్ చేస్తాయి అంటున్నారు నిపుణులు. అందుకే శరీరంపై సానుకూలతను కలిగి ఉండాలని.. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నో డైట్ డే నిర్వహిస్తున్నారు. ఆహార సంస్కృతిని ప్రోత్సాహించడమే లక్ష్యంగా దీనిని జరుపుతున్నారు. 

నో డైట్ డే చరిత్ర

మేరి ఎవాన్స్ యంగ్ శరీర సానుకూలత, ఫుడ్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో 1992లో ఇంటర్నేషనల్ నో డైట్ డేని ప్రారంభించారు. శరీర ఆకారాలు, వివిధ శరీరాల్లోని వైవిధ్యం, ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి అంశాలపై అవగాహాన కల్పించాలనే ఉద్దేశంతో నో డైట్ డేని జరుపుతున్నారు. మనం సంపాదించేదే తినడానికి.. అలాంటి ఫుడ్ విషయంలో ఒత్తిడిని తెచ్చుకుని.. నోటిని కంట్రోల్ చేసుకునే డైటింగ్​లకు చెక్​ పెట్టి.. నచ్చిన ఫుడ్ తీసుకుంటూ.. ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పడమే దీని లక్ష్యం. ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేసే శరీర ప్రమాణాలకు అందరూ దూరంగా ఉండాలని ఉద్దేశంతో నో డైట్​ డేని ప్రారంభించారు. 

నో డైట్ డే ప్రాముఖ్యత

అంతర్జాతీయ నో డైట్ డే ప్రాముఖ్యత ఏమిటంటే.. నిర్దిష్ట మార్గంలో ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. నచ్చిన ఫుడ్ ఏదైనా తినొచ్చు కానీ.. దానిని పూర్తిగా మానేయడం కాకుండా.. కంట్రోల్​గా తీసుకోవాలనే అంశాన్ని తెరపైకి తీసుకువస్తుంది. అంతేకాకుండా ఇతరులు శరీరాన్ని చూసి కామెంట్స్ చేయకుండా.. మన శరీరం ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసేలా ప్రోత్సాహిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న బరువు వివక్ష, బాడీ షేమింగ్​ను అంతం చేయడమే దీని లక్ష్యం. మనం శరీరం ఎలా ఉన్నా.. ముందుగా మనల్ని మనమే యాక్సెప్ట్ చేయాలని సూచిస్తుంది. 

నో డైట్ డే వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..

నచ్చిన రుచులను రుచి చూస్తారు. ఆస్వాదిస్తారు. బరువు తగ్గడానికి లేదా శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి కొన్నిసార్లు కఠినమైన డైట్స్ తీసుకుంటారు. దీనివల్ల ఇష్టమైన ఫుడ్​కి దూరమవుతారు. అయితే ఎలాంటి ఆంక్షలు లేని టేస్టీ ఫుడ్​ని తింటూ.. లిమిట్​గా తీసుకుంటే బరువు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావు. పైగా కాస్త బొద్దుగా ఉన్నా హెల్తీగా ఉంటారు. 

కఠినమైన డైట్ చేయడం వల్ల ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. కొన్ని రోజులు తర్వాత మీరు మామూలుగా ఫుడ్ తీసుకున్నా అది జీర్ణంకాదు. కాబట్టి నో డైట్ డే రోజు మీ డైటింగ్స్​కి చెక్​ పెట్టి నచ్చినఫుడ్​ని తీసుకోండి. ఏదైనా ఎక్కువగా తీసుకుంటే హెల్త్​కి మంచిది కాదు అని గుర్తించుకుంటే సరిపోతుంది. ఇలా నచ్చిన ఫుడ్ తిన్నప్పుడు మానసికంగా కూడా సంతృప్తి కలుగుతుంది. శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. అంతేకానీ పోషకాలు కొలిచి ఫుడ్ తీసుకోకూడదని చెప్తోంది నో డైట్ డే. 

Also Read : బరువును తగ్గించే టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్.. స్ప్రౌట్స్ పోహా రెసిపీని ఇలా సింపుల్​గా చేసేయండి