Instant Breakfast : బ్యాటర్ ఒకటే రెసిపీలు రెండు.. ఇన్​స్టాంట్​ ఇడ్లీలు, దోశలు ఇలా చేసేయండి

Healthy Breakfast : ఇంట్లో ఇడ్లీలు వేస్తే.. మాకు దోశలు కావాలి అంటూ పేచీ పెట్టేవారు ఎవరో ఒకరు ఉంటారు. అయితే మీరు ఇన్​స్టాంట్​గా ఇడ్లీ, దోశలు వేసే రెసిపీ తయారు చేసుకోగలిగితే..

Continues below advertisement

South Indian Breakfast Recipes : కొందరు ఇడ్లీలు ఇష్టంగా తింటే.. మరికొందరు దోశలు ఇష్టంగా తింటారు. అయితే ఈ రెండు ఒకేరోజు చేయాలంటే.. కాస్త కష్టంగానే ఉంటుంది. అంతేకాకుండా రెండు విధాలుగా పిండి సిద్ధం చేసుకోవాలి. అలా కాకుండా ఒకే పిండితో దోశలు, ఇడ్లీలు చేసుకోగలిగితే అంతకుమించి ఏమి కావాలి. పైగా ఇన్​స్టాంట్​గా ఈ రెసిపీని తయారు చేసుకోగలిగితే మీకు టైమ్​ కూడా సేవ్ అవుతుంది. అంతేనా ఇది మీకు టేస్ట్​తో పాటు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తే దానికి నో ఎలా చెప్తాము? ఇంతకీ దోశలు, ఇడ్లీలు తయారు చేసుకోగలిగే ఆ రెసిపీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దాని కావాల్సిన పదార్థాలపై కూడా ఓ లుక్​ వేసేయండి.

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

రాగి పిండి - అరకప్పు

బొంబాయి రవ్వ - అర కప్పు

పెరగు - అరకప్పు

ఉప్పు - తగినంత

నీళ్లు - తగినంత

బేకింగ్ సోడా - చిటికెడు

తయారీ విధానం

ముందుగా మిక్సింగ్ బౌల్​లో రాగి పిండి తీసుకోండి. దానిలో పెరుగు, బొంబాయి రవ్వ వేసి బాగా కలపండి. చిటికెడు ఉప్పు వేసి మరోసారి కలిపి.. పిండి ఇడ్లీ పిండి మాదిరిగా అయ్యేవరకు నీరు వేసి బాగా కలపండి. నీళ్లు మరీ ఎక్కువగా అయ్యేలా పోయకండి. ఇప్పుడు దానిలో కాస్తంత బేకింగ్ సోడా వేసుకుని కలిపి ఓ పది నిమిషాలు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల రవ్వ కూడా బాగా నానుతుంది. లేదు మీకు సమయం లేదు అనుకున్నా అలాగే వేసేసుకోవచ్చు. కానీ ఓ పది నిమిషాలు పక్కన పెడితే.. పెరుగు రాగి పిండికి, బొంబాయి రవ్వకి బాగా పడుతుంది.

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఇడ్లీ కుక్కర్ పెట్టండి. దానిలో కాస్త నీరు వేసి.. ఇడ్లీ రేకుకి నూనె అప్లై చేయండి. తయారు చేసి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలోకి వేయాలి. అన్ని ప్లేట్లలో పిండి వేశాక.. మీరు ఇడ్లీ కుక్కర్ మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇడ్లీలు ఉడికిన తర్వాత వాటిని ప్లేట్లలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అయితే ఇదే పిండితో దోశలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.

దోశల కోసం

తయారు చేసుకున్న ఇడ్లీ పిండిలో కాస్త నీరు పోసుకుని.. దోశల పిండిలాగ తయారు చేసుకోవాలి. దానిలో మీకు నచ్చితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి బాగా కలపాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత స్టౌవ్ వెలిగించి దోశ పాన్ పెట్టుకోవాలి. అది వేడి అయ్యాక నూనె వేసి.. పిండిని దోశలుగా పోసుకోవాలి. అంతే టేస్టీ, క్రిస్పీ దోశలు రెడీ. వీటిని మీకు నచ్చిన చట్నీతో లాగించేయవచ్చు. ఇవి కేవలం రుచిని మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో కూడా టాప్​లో ఉంటాయి. 

పిల్లల నుంచి పెద్దలవరకు ఈ రెసిపీలు ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అంతే కాకుండా మధుమేహమున్నవారు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వీటిని హ్యాపిగా తినవచ్చు. హెల్తీ స్కిన్, హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా మంచి డైట్. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరానికి ప్రయోజనాలు అందిస్తుంది. రక్తపోటును కంట్రోల్​లో ఉంచి.. గుండె సమస్యలను దూరం చేస్తుంది. మీరు హెల్తీ, టేస్టీ బ్రేక్​ఫాస్ట్ కోసం కచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయవచ్చు. 

Also Read : రోజూ ఉదయాన్నే బాదం, వాల్​నట్​ తింటున్నారా? అయితే ఇది మీకోసమే

Continues below advertisement
Sponsored Links by Taboola