Instagram Subscription Eligibility and Earnings : ఈ మధ్యకాలంలో ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ అనే ఆప్షన్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. బిగ్​బాస్ బ్యూటీలు ఈ ఫీచర్​లో అసభ్యకర పోస్టులు పెట్టి.. డబ్బులు సంపాదిస్తున్నారంటూ రోజుకో వార్త బయటకు వస్తుంది. ఈ ఆప్షన్ ఇప్పుడు వైరల్ అవుతుంది కానీ.. Instagram Subscription వచ్చి చాలా రోజులే అవుతుంది. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఆప్షన్​ కావాలంటే ఎంతమంది ఫాలోవర్లు ఉండాలి? డబ్బులు ఎంత సంపాదించవచ్చో చూసేద్దాం. 

Continues below advertisement

ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ 

ఇన్​స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ అనేది ఒక మానీటైజేషన్ ఫీచర్. దీని ద్వారా మీ ఫాలోవర్లు ప్రతి నెలా ఒక చిన్న ఫీ చెల్లించి మీరు షేర్ చేసే ఎక్స్​క్లూసివ్ కంటెంట్ చూడవచ్చు. దీనివల్ల మీకు నెలకు మంచి ఆదాయం వస్తుంది. కాబట్టి బ్రాండ్ డీల్స్ కోసం వేచి చూడనవసరం లేదు. 

అర్హత, నిబంధనలు ఇవే 

సబ్​స్క్రిప్షన్  ఫీచర్ పొందాలంటే తప్పనిసరిగా కనీసం 10,000 ఫాలోవర్లు ఉండాలి. వయసు 18 సంవత్సరాలు పైన ఉండాలి. ఇన్​స్టాగ్రామ్ పార్టనర్ మానిటైజేషన్ పాలసీలు పాటించాలి. ఇండియా కూడా సబ్​స్క్రిప్షన్ అందుబాటులో ఉన్న దేశాల జాబితాలో ఉంది.10K ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన సబ్​స్క్రిప్షన్ ఆటోమేటిక్​గా రాదు. ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ గ్రాడ్యువల్​గా క్రియేటర్లను సెలెక్ట్ చేస్తుంది. ఆప్షన్ కనిపించకపోతే మీరు ఇంకా వెయిట్ లిస్ట్​లో ఉన్నారని అర్థం. 

Continues below advertisement

సబ్​స్క్రిప్షన్ ఆప్షన్ ఎలా వర్క్ చేస్తుంది?

ప్రొఫెషనల్ డ్యాష్ బోర్డ్​లోని మానిటైజేషన్ ట్యాబ్​లో Subscriptions అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ నెలవారీ ధరను సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీ ప్రొఫైల్ మీద సబ్​స్క్రైబర్ బటన్ కనిపిస్తుంది. ఫాలోవర్లు దాన్ని నొక్కి ఇన్-యాప్ పర్చేజ్ ద్వారా సబ్​స్క్రైబ్ అవుతారు. అలా సబ్​స్క్రైబ్  అయిన వారికి పర్పుల్ బ్యాడ్జ్ వస్తుంది. కామెంట్స్, DMs లో అది కనిపిస్తుంది. 

సబ్​స్క్రైబర్లను ఎలా ట్రీట్ చేయాలి?

క్రియేటర్లు తమ సబ్​స్క్రైబర్లకు ఎక్స్ క్లూసివ్ పోస్ట్స్, రీల్స్, లైవ్ వీడియోలు, స్టోరీస్, పర్సనలైజ్డ్ అప్డేట్స్ ఇవ్వొచ్చు. ఇన్స్టాగ్రామ్ ప్రీసెట్ ప్రైస్ లాడర్ ఇస్తుంది. కస్టమ్ అమౌంట్ పెట్టడానికి వీలు లేదు.

నెలకు ఎంత సంపాదించవచ్చు?

ఇన్స్టాగ్రామ్ సబ్​స్క్రిప్షన్ రెవెన్యూ నుంచి ఎలాంటి కమీషన్ తీసుకోదు. కానీ యాపిల్, గూగుల్ 30 శాతం తీసుకుంటాయి. అంటే 10 డాలర్ల సబ్స్క్రిప్షన్​కి మీకు 7 డాలర్లు వస్తుంది. 10,000 ఫాలోవర్లతో కేవలం 2% కన్వర్షన్ రేట్​తో కూడా నెలకు 699 డాలర్ల నుంచి 848 డాలర్ల వరకు సంపాదించవచ్చు. అయితే నెలకు కనీసం 25 డాలర్ల ఆదాయం వచ్చాక ఇన్​స్టాగ్రామ్ పేమెంట్ ప్రాసెస్ చేస్తుంది.

సక్సెస్ టిప్స్

సబ్​స్క్రిప్షన్ ఆప్షన్​ లాంచ్​కి ముందే కంటెంట్ రెడీ చేసుకోండి. కనీసం 2 నుంచి 4 వారాల మెటీరియల్ దగ్గర ఉంచుకోండి. వీక్లీ వర్కవుట్, డైట్ ప్లాన్ అనేవి క్లియర్​గా చెప్పండి. సబ్​స్క్రైబర్లను స్పెషల్​గా ట్రీట్ చేయండి. రెగ్యులర్ పోస్ట్​లు చేయకండి. మిమ్మల్ని సబ్​స్క్రైబ్ చేసిన వారు నిరాశపడకూడదు.