Earn Money from Instagram Reels : ఈ రోజుల్లో Instagram కేవలం ఫోటోలు, వీడియోలు షేర్ చేసే యాప్ మాత్రమే కాదు. ఇది డబ్బు సంపాదించడానికి ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్‌గా మారింది. లక్షలాది మంది రీల్స్ చేసి ఫేమస్ అవుతున్నారు.. అలాగే మంచి ఇన్‌కమ్ కూడా సంపాదిస్తున్నారు. అయితే సరైన స్ట్రాటజీ, కంటిన్యూ ఎఫర్ట్ ఉంటే మీరు కూడా ఇన్​స్టా నుంచి డబ్బులు సంపాదించి ఫేమస్ అవ్వవచ్చు. 

Continues below advertisement

రీల్స్ వైరల్ అయ్యేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్.. 

రీల్స్ వైరల్ అవ్వడానికి ఎలాంటి మంత్రం లేదు. ఇది మొత్తం ఆల్గోరిథమ్ గేమ్. మీ కంటెంట్ జనాలకు నచ్చితే.. వారు ఎక్కువగా లైక్, షేర్ చేస్తే.. మీ వీడియో వేగంగా వైరల్ అవుతుంది. కాబట్టి ట్రెండింగ్ టాపిక్స్, మ్యూజిక్, హ్యాష్‌ట్యాగ్స్ తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.

కంటెంట్‌ స్ట్రెంత్

మీ వీడియో వైరల్ అవ్వాలంటే మీ కంటెంట్ యూనిక్‌గా, ఎంగేజింగ్‌గా ఉండాలి. మీరు కామెడీ, ఎడ్యుకేషన్, ఫిట్‌నెస్, టెక్నాలజీ లేదా మోటివేషన్ ఏదైనా టాపిక్ తీసుకోవచ్చు. కానీ వీడియోలో కొత్తదనం ఉండాలి. ముఖ్యంగా మొదటి 3 సెకన్లు చాలా కీలకమంటున్నారు.

Continues below advertisement

టైమింగ్, కంటిన్యూయిటీ 

మీరు ఇన్​స్టాలో మంచిగా గ్రో అవ్వాలనుకుంటే.. రోజూ లేదా రెగ్యులర్‌గా పోస్టులు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల గ్రోత్ వేగంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో పోస్టు చేస్తే ఎక్కువ మంది చూస్తారు. కంటిన్యూయిటీ ఉంటే ఆల్గోరిథమ్‌లో మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ అవుతుంది.

ఫాలోవర్స్ పెరిగితే డబ్బు ఎలా వస్తుందంటే..

ఫాలోవర్స్ పెరిగిన తర్వాత సంపాదన అవకాశాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. బ్రాండ్ ప్రమోషన్స్, స్పాన్సర్డ్ పోస్ట్స్, అఫిలియేట్ మార్కెటింగ్, మీ సొంత ప్రొడక్ట్స్ అమ్మడం వంటి వాటి ద్వారా డబ్బులు వస్తాయి. వీటి ద్వారానే చాలా మంది క్రియేటర్లు రీల్స్ ద్వారానే నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఈ సీక్రెట్ టిప్స్ మర్చిపోవద్దు

వీడియో వైరల్ అవ్వాలంటే కొన్ని సీక్రెట్ టిప్స్ కూడా ఫాలో అవ్వాలి. టైటిల్ చిన్నగా, క్యాచీగా ఉండాలి. వీడియో క్వాలిటీ క్లియర్‌గా ఉండాలి. ట్రెండింగ్ ఆడియో తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే కామెంట్స్‌కి రిప్లై ఇవ్వండి. దీనివల్ల వీడియోకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఈ టిప్స్ ఫాలో అయితే.. మీ రీల్స్ కూడా త్వరగా వైరల్ అయ్యే అవకాశం ఉంది.