Influencer Misha Agrawal Suicide : సోషల్ మీడియా ఎందరికో మంచి లైఫ్‌ని, అవకాశాలను ఇస్తుంది. కానీ దానికి ఓ డార్క్ సైడ్ ఉంది. మరెందరో సోషల్ మీడియా ద్వారా తమ మెంటల్ హెల్త్‌ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు. కొందరి బిజినెస్ గ్రోత్‌కి హెల్ప్ చేస్తుంటే.. మరికొందరికి నెగిటివిటితో బిజినెస్ మూసుకునేలా చేస్తుంది. ఫాలోవర్స్‌ని పెంచుకోవడం కోసం ఇన్ఫ్లూయెన్సర్లు ఎలాంటి వీడియోలు అయినా చేసే స్థాయికి దిగజారిపోతున్నారు. అదే ఫాలోవర్స్ తగ్గుతుంటే మెంటల్‌గా డిస్టర్బ్ అవుతున్నారు. చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్లిపోతున్నారు.
మిష్ కాస్మోటిక్స్..
మిశా అగర్వాల్ (Misha Agrawal) అనే ఇన్ఫ్లూయెన్సర్ (themishaagrawalshow) అనే ఇన్‌స్టా ఐడీతో కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండేది. కెరీర్ గ్రోత్‌కి ఇన్‌స్టాని, యూట్యూబ్‌ని ఉపయోగించుకోవాలనుకుంది. మిష్ అనే పేరుతో కాస్మొటిక్ బ్రాండ్‌ని లాంచ్ చేసింది. దానికి సంబంధించిన వీడియోలు, ప్రమోషన్లు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమెకి 359కె ఫాలోవర్లు ఉన్నారు. అంతా బాగానే ఉంది. కానీ సడెన్‌గా ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది.
కారణమిదే..
మిశాకి సోషల్ మీడియాలో 359కె ఫాలోవర్లు ఉన్నారు. అయినా సరే ఆమెకు వారు సరిపోలేదు. ఆమె టార్గెట్ 1 మిలియన్ మీదనే ఉంది. ఆమె తన ఫోన్ వాల్ పేపర్‌పై కూడా 1 మిలియన్ ఫాలోవర్స్‌నే అనే కవర్నే పెట్టుకుంది. దానికోసం ఆమె చాలా వీడియోలు చేసింది. కానీ ఫాలోవర్స్ పెరగకపోగా.. తగ్గిపోవడాన్ని గమనించింది. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. నా ఫాలోవర్స్ ఎందుకు తగ్గిపోతున్నారు.. ఇంకా నా లైఫ్ ముగిసినట్టేనా అంటూ కుమిలిపోయిందట మిశా.
లాయర్ అవ్వాల్సింది.. చివరికి చనిపోయింది..
''మిశా ఇన్‌స్టాగ్రామ్‌నే తన ప్రపంచంగా మార్చుకుంది. తన గోల్ ఏంటి అంటే 1 మిలియన్ ఫాలోవర్స్. ఆమె తన ఫాలోవర్స్‌ని చాలా ఇష్టపడేది. కానీ సడెన్‌గా వారు తగ్గిపోవడం చూసి.. ఆమె చాలా బాధపడింది. తనని తాను వర్త్లెస్గా ఫీల్ అయింది. ఏప్రిల్ నుంచి ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. కొన్నిసార్లు నన్ను హగ్ చేసుకుని ఏడ్చేది. నా ఫాలోవర్స్ పెరగడానికి నేను ఏమి చేయాలంటూ బాధపడేది. తనని సముదాయించడానికి ప్రయత్నించినా.. ఆమె మాత్రం వినలేదు. ఆమె ఎల్ఎల్బీ కూడా చేసింది. కానీ అటువైపు వెళ్లకుండా కేవలం ఇన్‌స్టానే ప్రపంచంగా బతికింది. తను సోషల్ మీడియా వద్దు అనుకుంటే లాయర్ అయ్యేది. కానీ చివరికి ఫాలోవర్స్ తగ్గిపోతున్నారనే బాధతో సూసైడ్ చేసుకుంది'' అంటూ ఆమె ఇన్‌స్టా పేజ్‌లో మిశా సిస్టర్ పోస్ట్ చేసింది. ఏప్రిల్ 26తో ఆమెకు 25 ఏళ్లు వస్తాయి. కానీ దానికి రెండ్రోజుల ముందే డిప్రెషన్‌తో సూసైడ్ చేసుకుని చనిపోయింది.
ఆ రెండూ వేరు.. వేరు..
సోషల్ మీడియాను ఉపయోగించుకునేవిధంగా వాడుకుంటే సక్సెస్ అవుతారు. అలాగే అక్కడ వచ్చేంత నెగిటివిటీని తీసుకోగలిగితేనే సక్సెస్ అవుతారు. మీరు సున్నితంగా ఉండేవారు అయితే వీలైనంత దూరంగా ఉండండి. లేదంటే మీరు ప్రైవేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ.. హ్యాపీగా అయినా ఉండాలి. పర్సనల్ లైఫ్‌ని లీడ్ చేస్తూ.. ఇన్ఫ్లూయెన్సర్గా లైఫ్‌ని లీడ్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. రెండిటీని ముడిపెడితే మాత్రం ఎప్పటికైనా ఇబ్బంది పడాల్సిందే. ఫాలోవర్స్‌ని పెంచుకోవాలి, ఫేమస్ అయిపోవాలి అనే గోల్‌తో మీరు సోషల్ మీడియాని ఉపయోగిస్తే చివరికి మిశా మాదిరే అయిపోతారు.
అడిక్ట్ అయిపోకండి..
సోషల్ మీడియాను చూస్తూ కొందరు అడిక్ట్ అయిపోతుంటే.. ఫాలోవర్స్‌ని పెంచుకోవాలనే ఉద్దేశంతో మరికొందరు అడిక్ట్ అయిపోతున్నారు. ఈ రెండూ ఎక్స్ట్రీమ్ లెవెల్‌కి వెళ్తే పర్సనల్ లైఫ్ కచ్చితంగా నాశనం అయిపోతుంది. మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారనిపిస్తే వీలైనంత త్వరగా సోషల్ మీడియాను డిటాక్స్ చేసేయండి. అక్కడ కనిపించేదంతా నిజం కాదని గుర్తిస్తే సరిపోతుంది. ఈ క్షణం మిమ్మల్ని పొగిడేవారు.. మరుక్షణం మిమ్మల్ని తిట్టొచ్చు. కాబట్టి పర్సనల్ లైఫ్ ఎప్పుడూ సోషల్ మీడియాపై డిపెండ్ అవ్వకూడదని గుర్తించుకోవాలి. అప్పుడే కెరీర్లో పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా సక్సెస్ అవుతారు.