పండుగ సీజన్‌ లో రైలు టిక్కెట్లు పొందడం చాలా కష్టం. అయినప్పటికీ, సమస్యను పరిష్కరించడానికి రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రారంభించడం లేదా ఫ్రీక్వెన్సీని పెంచడం చేస్తారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. టిక్కెట్ కన్ఫామ్ కానప్పటికీ ప్రయాణికులు రైలు జర్నీ చేయవచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో ప్రయాణికులు పండుగ సీజన్‌లో రిజర్వేషన్ లేకుండా రైళ్లలో వెళ్లే అవకాశం ఉంటుంది. చేయాల్సిందల్లా మీరు  రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గర టికెట్ కొనుగోలు చేయడమే.   


ఆన్ లైన్ లో అవకాశం లేదు


రైల్వేశాఖ తాజా ప్రకటనతో  కౌంటర్‌లో కొనుగోలు చేసే టికెట్ కచ్చితంగా టీటీ ద్వారా జెనరేట్ చేసినదే అయి ఉండాలి. అలాంటి టికెట్ ఉంటేనే  టీసీ మిమ్మల్ని ప్రయాణం చేసేందుకు అనుమతిస్తారు. అయితే, ఆన్‌ లైన్‌ లో టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి ఈ సర్వీస్ అందుబాటులో లేదు. ఆన్‌ లైన్‌ లో టిక్కెట్లు కన్ఫర్మ్ కాకపోతే, ప్రయాణికులను రైలు ఎక్కేందుకు అనుమతించరు. టికెట్ ధర తిరిగి చెల్లిస్తారు.


దీపావళి, ఛాత్ పూజా కు ప్రత్యేక రైళ్లు


పండుగల సీజన్ కావడంతో  ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని కల్పించే దిశగా రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తున్నది.  ఇందుకోసం 179 ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది.  ఛత్ పూజ, దీపావళి మధ్య ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వే ప్రకటించింది. వీటిలో చాలా రైళ్లు పూర్వాంచల్‌ కు ప్రయాణిస్తాయి. ఛత్ వేడుకలు బీహార్‌ తో సహా పూర్వాంచల్ ప్రాంతాల్లో జరుగుతాయి. ఈ సందర్భంగా  ఢిల్లీలో నివసించే పూర్వాంచల్ వాసులు ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవుల సీజన్‌లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైల్వే అధికారులు.


Also Read: డిసెంబర్లో భూమ్మీదకు గ్రహాంతరవాసులు, మార్చిలో మెగా సునామీ! టైమ్ ట్రావెలర్ సంచలన అంచనాలు నిజమయ్యేనా?


టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే?


వినియోగదారులు తమ టిక్కెట్లను క్విక్ తత్కాల్, న్యూ ఆథరైజ్డ్ తత్కాల్ బుకింగ్ యాప్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. రైలు రిజర్వేషన్లను అందించడానికి, క్విక్ తత్కాల్ IRCTC ప్రీమియం బుకింగ్ భాగస్వాములలో ఒకరైన రైలోఫీతో జట్టుకట్టింది.  ఈ సాఫ్ట్‌వేర్ మొత్తం సమాచారాన్ని ముందే పూరించడం ద్వారా తత్కాల్ టిక్కెట్‌ ను వేగంగా బుక్  చేసుకోవడానికి అవకాశం కలిగిస్తోంది. ఆన్‌లైన్ బుకింగ్‌లో కన్ఫార్మ్ టికెట్ పొందితే బీమాను పొందే అవకాశం ఉంటుంది. ఆ వివరాలను కింద చూడండి. 


IRCTC ప్రయాణ బీమా పథకం గురించి 10 కీలక విషయాలు:


1. IRCTC వెబ్‌సైట్ లేదా దాని మొబైల్ యాప్ ద్వారా తమ ఇ-టికెట్‌లను బుక్ చేసుకునే భారతీయ పౌరులకు మాత్రమే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. కాబట్టి, మీరు కౌంటర్‌లో కాకుండా IRCTCలో టికెట్ బుక్ చేసుకోవడమే ఉత్తమం. 


2. ఒక ప్రయాణీకుడు బీమాను ఎంచుకుంటే.. క్లెయిమ్/బాధ్యత బీమా చేసిన వ్యక్తి, బీమా కంపెనీ మధ్యే ఉంటుంది.


3. రైలు ప్రమాదం లేదా అవాంఛనీయ సంఘటనల్లో ప్రయాణీకుడు చనిపోయినా? శాశ్వత పూర్తి వైకల్యం పొందినా? శాశ్వత పాక్షిక వైకల్యం బారిన పడ్డా? లేదంటే గాయపడినా? ఆసుపత్రిలో చేరే ఖర్చుల విషయంలో PNR కింద ప్రతి ప్రయాణీకునికి IRCTC ప్రయాణ బీమా పథకం కవరేజ్ వర్తిస్తుంది. రైల్వేలు అందించే బీమా రక్షణ వివరాలు ఇక్కడ ఉన్నాయి:


⦿ మరణం- రూ.10,00,000


⦿ శాశ్వత, పూర్తి వైకల్యం- రూ. 10,00,000


⦿ శాశ్వత పాక్షిక వైకల్యం- రూ. 7,50,000


⦿ గాయపడిన వారికి ఆసుపత్రి ఖర్చుల కోసం- రూ. 2,00,000


4. ప్రయాణ బీమా పథకం అన్ని తరగతులకు ప్రయాణీకులకు ఒకేలా ఉంటుంది.


5. బీమా పాలసీని ఎంచుకున్నప్పుడు, వినియోగదారుడు పాలసీ సమాచారాన్ని SMS ద్వారా, రిజిస్టర్డ్ ఇమెయిల్ IDల ద్వారా నేరుగా బీమా కంపెనీల నుంచి నామినేషన్ వివరాలను పూరించడానికి లింక్‌ అందుతుంది. IRCTC పేజీ నుంచి టికెట్ బుక్ చేసినప్పుడు కూడా పాలసీ నంబర్‌ చూసే అవకాశం ఉంటుంది.  


6. టికెట్ బుకింగ్ తర్వాత, నామినేషన్ వివరాలను సంబంధిత బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో నింపాలి. ఒకవేళ నామినేషన్ వివరాలు పూరించనట్లయితే, IRCTC ప్రకారం, క్లెయిమ్ వస్తే.. వారి వారసులకు ఆ మొత్తాన్ని అందిస్తారు.


7. ఏదైనా కారణంతో రైళ్లను నిలిపివేసినట్లయితే, ప్రయాణీకుడు గమ్యస్థాన స్టేషన్ వరకు రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ రవాణా విధానాన్ని ఎంచుకుంటే, ప్రయాణీకుల ప్రయాణంలో ఈ భాగం కూడా తీసుకున్న పాలసీ కింద కవర్ అవుతుంది.  


8. ఏదైనా కారణం వల్ల రైలు మళ్లింపు జరిగితే, మళ్లించిన మార్గానికి కవరేజ్ వర్తిస్తుంది.


9. ప్రయాణీకులు ప్రీమియం చెల్లించిన తర్వాత క్యాన్సిల్ చేయడం కుదరదు.


10. IRCTC పోర్టల్ ప్రకారం ప్రయాణ బీమా ఐదేళ్లలోపు పిల్లలకు అందించబడదు.


మొత్తంగా రైల్లో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణీకుడు తప్పకుండా ట్రావెల్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. జరగకూడని  సంఘటనలు జరిగితే బీమాను అందుకోవచ్చు.