Millets: చిరుధాన్యాల్లో అరికెలు కూడా ఒకటి. వీటిని ఒకప్పుడు విపరీతంగా వాడేవారు. ఎప్పుడైతే తెల్లన్నం వాడకం పెరిగిందో... అప్పటి నుంచి చిరుధాన్యాలు మూలన పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వాటి వాడకం పెరుగుతోంది. చిరుధాన్యాల్లో చాలా ముఖ్యమైనవి అరికలు. వీటిని కోడో మిల్లెట్స్ అని అంటారు. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ నిండుగా ఉంటుంది. వీటిని తినడం వల్ల మనకి మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అరికెలతో అన్నంలా వండుకోవడమే కాదు. ఉప్మా, దోశలు, ఇడ్లీలు వంటివి కూడా తయారు చేసుకోవచ్చు. అరికలను ఎలాగైనా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. 


అరికెలను తరచూ తినడం వల్ల జీర్ణ సమస్యలైనా గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటివి రాకుండా ఉంటాయి. అరికల్లో ఉండే ఫైబర్ ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. మధుమేహంతో బాధపడేవారు అరికెలను కచ్చితంగా తినాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. దీనివల్ల మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి జ్వరం, జలుబు, దగ్గు వంటివి త్వరగా రాకుండా కాపాడతాయి. శరీరంలోని కణాలు దెబ్బతికుండా రక్షిస్తాయి. మహిళలు అరికెలను తరచూ తింటూ ఉండాలి. నెలసరి సమయంలో వచ్చే కొన్ని రకాల నొప్పులు, సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. గుండె జబ్బులు కూడా అరికెల వల్ల దూరంగా ఉంటాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు కచ్చితంగా అరికెలను తినాలి. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.


కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే అరికలను తినడం వల్ల ఆ కొలెస్ట్రాల్ కరిగే అవకాశం ఉంటుంది. అరికెలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోదు. దీనివల్ల గుండె సురక్షితంగా ఉంటుంది. గుండెపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మహిళలు, పిల్లలు తరచూ రక్తహీనత బారిన పడుతూ ఉంటారు. ఇలాంటివారు అరికెలను తినడం వల్ల రక్త ఉత్పత్తి పెరుగుతుంది. ఆ సమస్య రాకుండా ఉంటుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి కూడా అరికలు సహాయపడతాయి. రాత్రిపూట తెల్లని అన్నం, చపాతీలకు బదులు అరికెలతో చేసిన ఆహారాన్ని తినాలి. అరికలు నిద్ర పట్టేలా చేస్తాయి. క్యాన్సర్‌ను నిరోధించే శక్తి కూడా అరికెలకు ఉంది. శరీరంలో క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కాకుండా అవి వ్యాప్తి కాకుండా అడ్డుకునే శక్తి అరికెల్లో ఉంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలతో బాధపడుతున్న వారు ఆహారంగా అరికలను తీసుకుంటే ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడతారు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా అరికలను తినడం మంచిది.


Also read: డయాబెటిస్ రోగులు కచ్చితంగా తినాల్సిన పండ్ల జాబితా ఇదే










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.