ప్రాణాంతకమైన ఎన్నో వ్యాధులు ప్రపంచంలోని ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. వాటిలో క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటివి కూడా ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లను, ఆర్థరైటిస్‌ను క్రయోథెరపీ చికిత్స ద్వారా తగ్గించవచ్చని చెబుతారు. వైద్యులు చెబుతున్న ప్రకారం క్రిస్టియానో రోనాల్డో వంటి అనేకమంది ప్రముఖులు, క్రీడాకారులు ఈ క్రయోథెరపీ పద్ధతిని అనుసరించారని, సర్జరీ లేకుండానే కొన్ని రకాల సమస్యలను తగ్గించుకున్నారని అంటారు.


క్రయోథెరపీ అంటే కొన్ని రకాల వ్యాధులకు చికిత్స చేసే విధానం. దీనిలో చేయాల్సిందల్లా ఒక్కటే, మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉన్న చల్లటి నీళ్లలో మునకలు వేయాలి. ఇలా మునకలు వేయడం వల్ల అనేక రకాల సమస్యలు తగ్గుతాయి. చర్మ సమస్యలు తగ్గడానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. దీన్నే క్రయో అబ్లికేషన్ అని కూడా అంటారు. నటి రకుల్ ప్రీత్ సింగ్ విదేశాలలో ఈ చల్లని చికిత్స తీసకుంది. చర్మం మెరుపు కోసం ఆమె ఇలా చేసింది. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మొటిమలు సమస్యలు పోతాయి.


క్యాన్సర్, ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు క్రయోథెరపీని పాటించడం వల్ల ఫలితం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బోన్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్లు, పిల్లల్లో వచ్చే రెటీనా క్యాన్సర్, ముఖం మీద మొటిమలు, మచ్చలు, ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు ఉన్నవారు... ఈ సమస్యలు ఉన్నవారు  క్రయోథెరపీని పాటించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


ఇది ఎలా పనిచేస్తుంది?
క్రయోథెరపీ పద్ధతిలో రక్తం మరింత ఆక్సిజన్‌‌ను పొందుతుందని, పోషకాలతో సమృద్ధిగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఎప్పుడైతే క్రయోథెరపిలో మైనస్ డిగ్రీల నీటిలో మునుగుతారో అప్పుడు శరీరంలోని అసాధారణ కణజాలం గడ్డ కడుతుంది. అలా అది నాశనం అవుతుంది. ఆ నీటిలోంచి బయటికి వచ్చాక శరీరం మళ్ళీ వేడెక్కడం ప్రారంభమవుతుంది. అప్పుడు రక్తనాళాలు విస్తరించడం మొదలవుతుంది. రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలోని ఇన్ఫ్లమేషన్ పోతుంది. 


విదేశాల్లో గడ్డకట్టిన చెరువుల్లో ఎక్కువమంది ఈ క్రయోథెరపీని ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే క్రయోథెరపీ చాంబర్లను కూడా వీటి కోసం ఏర్పాటు చేస్తారు. అందులో శీతలీకరణం కోసం ద్రవ నత్రజని ఉపయోగించే చిన్న ఛాంబర్లోకి వ్యక్తిని పంపిస్తారు. ఆ ఛాంబర్ లోని ఉష్ణోగ్రత మైనస్ 200 నుంచి 300 డిగ్రీల వరకు ఉంటుంది. శరీరాన్ని కనీసం మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అందులో ఉంచాలి.


ఎన్నో ప్రయోజనాలు 
సాధారణ వ్యక్తులు ఈ క్రయోథెరపీని ప్రయత్నిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చర్మం ఆరోగ్యవంతంగా మారుతుంది. ఇన్ఫ్లమే  తగ్గుతుంది. నిద్ర సమస్యలు పోతాయి. కండరాలు బలంగా మారుతాయి, గాయాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో అసాధారణ కణజాలాలు, కణితి కణాలు చనిపోయేలా ఈ క్రయోథెరపీ చేస్తుంది. అందుకే కొన్ని రకాల క్యాన్సర్లు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు దీనివల్ల తగ్గుతాయని అంటారు.



Also read: World Laughter Day 2023: నవ్వు, నవ్వించు- ఎక్కువ కాలం జీవించు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.