శరీరం తన విధులని సక్రమంగా నిర్వర్తించాలంటే తగినంత ద్రవాలు అవసరం. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడిపోతారు. ద్రవ లోటు శరీర బరువులో 2 శాతం కంటే ఎక్కువగా ఉంటే వ్యాయామ పనితీరుకి ఆటంకం కలిగిస్తుంది. కండరాలు అలసట, శరీర ఉష్ణోగ్రత నీయంత్రించలేకపోవడం, వేడి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే వ్యాయామం చేసిన తర్వాత మాత్రమే కాదు చేసే ముందు కూడా తగినంత ద్రవాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


వ్యాయామానికి ముందు శరీరం యూహైడ్రేషన్ స్థితిలో ఉండాలి. అప్పుడే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. కొన్ని సార్లు అథ్లెట్లు ఈవెంట్ కు ముందు అధిక ద్రవాలు తీసుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇది ఉబ్బరానికి దారి తీస్తుంది. ఈవెంట్ కు 2-3 గంటల ముందు 500 ఎంఎల్, ఈవెంట్ కు 15 నిమిషాల ముందు 250 ఏంఎల్ ద్రవాలు తీసుకోవడం మంచిది.


వ్యాయామం చేసే ముందు..


కఠినమైన వ్యాయామాలు చేసేటప్పుడు చెమట రూపంలో శరీరంలోని ద్రవాలు బయటకి వెళ్లిపోతాయి. వాటిని భర్తీ చేయడం కోసం తగినంత ద్రవాలు తీసుకోవడం మంచిది. వ్యాయామం చేసే ప్రతి గంటకు 0.5-1 లీటర్ ద్రవాలు తీసుకోవాలని నియమం పెట్టుకోవాలి. ఈ మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తాగాలి. ఎక్కువ ద్రవాలని తీసుకుంటే రక్తంలో సోడియం కంటెంట్ కరిగిపోతుంది. రక్తంలో వీటి స్థాయి 135 mmol/l కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని 'హైపోనట్రేమియా' అంటారు. దీని స్థాయి 130 mmol/l కంటే తక్కువగా ఉన్నప్పుడు ఉబ్బరం, బరువు పెరగడం, వికారం, వాంతులు, మూర్చలు, స్పృహ కోల్పోవడం వంటివి సంభవిస్తాయి. ఇటువంటి పరిస్థితి ఎక్కువగా రన్నర్లలో కనిపిస్తుంది. అలసటని నిర్జలీకరణానికి సంకేతంగా భావించి అధిక మొత్తంలో ద్రవాలు తీసుకుంటారు. అటువంటి పరిస్థితి చాలా ప్రమాదకరమైనది.


ఏం  తాగాలి?


వ్యాయామం ఒక గంట కంటే తక్కువ వ్యవధి పాటు చేస్తే సాధారణమైన నీటిని తీసుకోవచ్చు. అదే వ్యాయామం గంట కంటే ఎక్కువ సేపు చేస్తే శరీరానికి సుమారు 30-60 ఫరాముల కార్బోహైడ్రేట్లు అవసరం. సోడియం, పొటాషియం కలిగి ఉన్న స్పోర్ట్స్ డ్రింక్ ఎంచుకోవచ్చు. లేదంటే ఇంట్లో తయారు చేసుకుంటే నింబు పానీ తీసుకోవచ్చు. చక్కెర, ఉప్పుతో దీన్ని తయుయర్ చేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరం.


వ్యాయామం తర్వాత ద్రవాలు తీసుకోవాలా?


సుదీర్ఘ వ్యాయామం తర్వాత cఅలా మంది రన్నర్లు నిర్జలీకరణ స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళు వ్యాయామం చేసిన రెండు గంటలలోపు ద్రవాలు తీసుకోవాలి. కోల్పోయిన ప్రతి లీటరు చెమటకి 1.25-1.5 లీటర్ దర్వాన్ని తీసుకోవడం మంచిది. నిపుణుల సూచనల ప్రకారం అథ్లెట్లు వీలైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: వేడి నీటితో క్రిస్పీగా ఉండే పకోడీ ఇలా చేసేయండి!